Best Web Hosting Provider In India 2024
Most Successful Actress: ఇండియాలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ నటి ఈమెనే.. ఏకంగా రూ.10 వేల కోట్ల కలెక్షన్లు.. హీరోని మించి క్రేజ్
Most Successful Actress: ఇండియాలో అత్యంత విజయవంతమైన నటి ఎవరో తెలుసా? ఆమె సినిమాలన్నీ కలిపి బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.10 వేల కోట్లకుపైనే వసూలు చేశాయి. హీరోని మించిన క్రేజ్ సొంతం చేసుకున్న ఆ నటి పేరు దీపికా పదుకోన్.
Most Successful Actress: దీపికా పదుకోన్ తెలుసు కదా. గతేడాది కల్కి 2898 ఏడీ మూవీతో తెలుగు వాళ్లకు కూడా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ. ఈమె దేశంలోనే అత్యంత విజయవంతమైన నటిగా నిలుస్తోంది. ఒక్కో సినిమాకు అత్యధిక మొత్తం వసూలు చేసే నటి కూడా ఆమెనే. తన 18 ఏళ్ల కెరీర్లో దీపికా పదుకోన్ నటించిన సినిమాలన్నీ కలిపి రూ.10 వేల కోట్లకుపైనే వసూలు చేయడం విశేషం.
దీపికా పదుకోన్.. సక్సెస్‌ఫుల్ నటి
దీపికా పదుకోన్ కు ఉన్న క్రేజ్ ఇప్పుడు ఇండియాలో మరే నటికి లేదంటే అతిశయోక్తి కాదు. బాలీవుడ్ ఖాన్ త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ తమ కెరీర్లో వసూలు చేసిన మొత్తం కంటే కూడా దీపికా నటించిన సినిమాల గ్రాస్ కలెక్షన్లే ఎక్కువంటే నమ్మగలరా? ఆమె 18 ఏళ్ల కెరీర్లో మొత్తంగా రూ.10 వేల కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఏకైక నటిగా నిలుస్తోంది. అంతేకాదు గత పదేళ్లలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న నటి కూడా దీపికానే కావడం గమనార్హం.
2007లో వచ్చిన ఓం శాంతి ఓం మూవీతో బాలీవుడ్ లోకి దీపికా అడుగుపెట్టింది. ఈ 18 ఏళ్లలో ఆమె నటించిన సినిమాలన్నీ కలిపి బాక్సాఫీస్ దగ్గర రూ.10200 కోట్లు వసూలు చేశాయి. అందులో రూ.8 వేల కోట్లు ఇండియన్ సినిమాల ద్వారా రాగా.. మరో రూ.2200 కోట్లు ఆమె నటించిన ఏకైక హాలీవుడ్ మూవీ ఎక్స్ఎక్స్ఎక్స్: ది రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ మూవీ ద్వారా వచ్చాయి.
ఆ హీరోల సక్సెస్ కలిసి వచ్చి..
దీపికా పదుకోన్ తన కెరీర్లో పెద్ద పెద్ద హీరోలందరితోనూ పని చేసింది. ముఖ్యంగా 2023లో షారుక్ ఖాన్ తో కలిసి నటించిన పఠాన్, గతేడాది ప్రభాస్ తో కలిసి నటించిన కల్కి 2898 ఏడీ సినిమాలు రెండూ రూ.1000 కోట్ల మార్క్ అందుకున్నాయి. ఇవి దీపికా సక్సెస్ కు కారణమయ్యాయి. రెండేళ్ల కిందట వరకూ టాప్ 5లో కూడా లేని ఆమె.. ఈ రెండు సినిమాల సక్సెస్ తో ఏకంగా నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లడం విశేషం. ఆ రెండు సినిమాలతోపాటు దీపిక ఈ రెండేళ్లలో నటించిన ఫైటర్, సింగం అగైన్ సినిమాలు రూ.300 కోట్లకుపైగా వసూలు చేశాయి.
మొత్తంగా రెండేళ్లలోనే ఆమె సినిమాలు రూ.4 వేల కోట్లకుపైగా రాబట్టాయి. దీంతో దేశంలో తిరుగులేని నటిగా ఎదిగింది. ఆమె తర్వాత రూ.6 వేల కోట్లతో ప్రియాంకా చోప్రా, రూ.5500 కోట్లతో కత్రినా కైఫ్ ఉన్నారు. ఇక హీరోల విషయానికి వస్తే షారుక్ ఖాన్ రూ.9 వేల కోట్లతో తొలి స్థానంలో ఉండగా.. అక్షయ్ కుమార్ రూ.8300 కోట్లు, సల్మాన్ ఖాన్ రూ.7500 కోట్లు, ఆమిర్ ఖాన్ రూ.7200 కోట్లతో ఉన్నారు. ఇక దీపిక రానున్న రోజుల్లో కల్కి 2, బ్రహ్మాస్త్ర 2 సినిమాల్లో నటిస్తుండటంతో ఆమె రేంజ్ మరో లెవల్ కు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.
టాపిక్