Best Web Hosting Provider In India 2024
HMPV Virus Precautions: హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి!
HMPV Virus Precautions: హెచ్ఎంపీవీ వైరస్ భారతదేశంలోకి ప్రవేశించి చాలా సమయం అయింది. ఈ ప్రాణాంతక వైరస్ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లోకి రావచ్చు, మీ దాకా కూడా రావచ్చు. దీని బారిన పడకుండా ఉండేందుకు మీరు, మీ ఇంట్లో వాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి
ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నహెచ్ఎంపీవీ వైరస్ HMPV(హ్యూమన్ మెటానిమో వైరస్) భారతదేశంలోకి కూడా ప్రవేశించింది. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఇప్పటికే కర్ణాటకలో ఇద్దరు చిన్నారులకు ఈ వైరస్ సోకింది. భయపడాల్సిన విషయం ఏంటంటే.. ఇది సాధారణ శీతాకాలపు జబ్బుల లక్షణాలతోనే వ్యాపిస్తుంది. దీన్ని ప్రత్యేకంగా గుర్తించడం కష్టంగా మారింది. కనుక ముందుగానే ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ హెచ్చరించింది.
ఈ ప్రమాదకరమైన వైరస్ ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, అంటువ్యాధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి త్వరగా సోకే అవకాశాలు ఉన్నాయట. అలాంటి వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం వల్ల HMPVతో పాటు ఇతర శ్వాసకోశ వైరస్ల నుండి తక్కువగా ప్రభావితమవుతారు.
1. చేతులు శుభ్రంగా ఉంచుకోండి:
హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడకుండా ఉండాలంటే చేతులను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకుంటే ఇది కలుషితమైన ఉపరితలాలను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఇందుకోసం మీరు చేతులను తరచుగా నీటితో, సబ్బుతో కడగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దగ్గడం, తుమ్మడం వంటివి చేసిన తర్వాత తప్పకుండా చేతులను కడుక్కోండి. అల్కహాల్-ఆధారిత హ్యాండ్ సానిటైజర్ ఉపయోగించడం మరింత శ్రేయస్కరం.
2. ముఖం, కళ్లు, ముక్కు, నోరు టచ్ చేయకుండా ఉండండి:
చాలా మంది తరచూ ముఖం మీద చేతులు వేసుకుంటూ ఉంటారు.వైరస్ కలకలం రేపుతున్న కారణంగా మీరు కళ్లు, ముక్కు, నోరును తాకకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే హెచ్ఎంపీవీ వైరస్ రోగముఖంగా ముక్కు, నోరు, కంట్లో ప్రవేశించే అవకాశాలున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సాధారణంగా కూడా ఈ అలవాటు హానికరమే. కనుక గుర్తుపెట్టుకుని ఈ అలవాటును మానుకోండి.
3. వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండండి:
హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు కూడా సాధారణ శీతాకాలపు వైరస్‌ల లక్షణాలనే పోలి ఉన్నాయి. కనుక ఎందుకైనా మంచిది సాధారణ జలుబు, దగ్గు,జ్వరం వంటి లక్షణాలున్న వారికి దూరంగా ఉండండి. ముఖ్యంగా మీకు శ్వాసకోశ సమస్యలు ఉంటే ఈ వ్యాధి మరింత ప్రమాదకారిగా మారుతుంది. అలాగే వీలైనంత వరకూ రద్దీగా ఉండే ప్రాంతాల్లోకి, షాపింగ్‌లకూ వెళ్లకండి.ఇలాంటి చోట్లలోనే వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది.
4. స్వచ్చమైన వాతావరణం ఏర్పరుచుకోండి:
ఇంటినీ, కార్యాలయాలలో మీ చోటునీ తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండండి. ఉదా: టేబుల్‌లు, ల్యాప్ టాప్లు, మీ చేతిలో ఎప్పుడూ ఉండే స్మార్ట్‌ఫోన్లు హ్యాండిల్‌లు వంటి వాటిని ఎప్పటికప్పుడు శానిటైజర్ సహాయంతో శుభ్రం చేసుకోండి.
5. ఇమ్యూనిటీని పెంచుకోండి:
ఎలాంటి వైరస్ ను అయినా అడ్డుకోవాలన్నా, దాని ప్రభావం తగ్గించాలన్నా మీరు బలంగా, ఆరోగ్యకరంగా ఉండటం చాలా ముఖ్యం. కనుక హెచ్ఎంపీవీ వైరస్ సోకకుండా ఉండేందుకు, సోకినా అది మీకు హాని చేయకుండా ఉండేందుకు మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకోసం మీరు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను ముఖ్యంగా విటమిన్ C, జింక్, మెగ్నీషియం వంటివి ఎక్కువగా ఉండే పదార్థాలను తీసుకోవడం మంచిది. దీంతో పాటు వ్యాయామం చేయడం,తగ్గినంత నిద్రపోవడం వంటివి చేయడం మర్చిపోకండి.
6. మాస్క్ ధరించడం మర్చిపోకండి:
బయటకు వెళ్తున్నప్పుడు లేదా మీకు, మీ ఇంట్లో వాళ్లకీ సాధారణ జలుబు, దగ్గు వంటివి కలిగి నప్పుడు మాస్క్ తప్పక ధరించండి. ఇది సాధారణ జలుబే అయినప్పటికీ మరొకరికి సోకుతుందని మర్చిపోకండి. అవతల వారిని మీరు భయపెట్టిన వారు కాకండి. మాస్క్ మీరు ధరించండి. వీలైతే అవతల వ్యక్తులను కూడా ధరించమని సలహా ఇవ్వండి.
7. భయం వద్దు:
మనిషిని రోగం కన్నా ముందు భయమే చంపేస్తుంది అనే మాట మీకు ఎప్పుడైనా విన్నారా? అవును వ్యాధి మనల్ని పెట్టు ఇబ్బంది కన్నా దాని తాళూకా భయమే మనిషిని శారీరకంగా, మానసికంగా ఎక్కువ ఇబ్బంది పెడుతుందట. కనుక మీకు హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలేమైనా కనిపిస్తే భయపడకండి, చింతించకండి. వైద్యుడిని సంప్రదించండి. తగిన జాగ్రత్తలు తీసుకుని మీ ప్రాణాన్ని కాపాడుకోంండి. వీలైనంత వరకూ విశ్రాంతి తీసుకుంటూ ప్రశాంతంగా ఉండండి.
8. అవసరమైన సందర్భంలో టీకాలు:
ఇతర శ్వాసకోశ వైరస్లకు వ్యాధినిరోధక టీకాలు ఉండవచ్చు, వాటిని తీసుకోవడం కూడా శరీరాన్ని బలపరుస్తుంది. RSV,ఫ్లూ టీకాలు వంటి వాటి ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
9. స్వీయ నిబంధనలు పాటించండి:
మీరు దగ్గుతుంటే లేదా తుమ్ముతుంటే నోటి నుంచి వచ్చే తుంపర్లు, లాలాజలం దుస్తులు, వస్తువుల మీద పడకుండా చూడండి. చేతులు అడ్డు పెట్టుకుని వెంటనే శుభ్రంగా సబ్బుతో కడుక్కోండి. ఇది వైరస్ గాలిలో ప్రయాణించకుండా అడ్డుకుంటుంది. అందరినీ కాపాడుతుంది.