Old Age Roles: 13 ఏళ్లకే రజనీకాంత్‌కు తల్లిగా శ్రీదేవి.. తమ ఏజ్‌కు మించి వయసున్న పాత్రలు చేసిన హీరో హీరోయిన్స్!

Best Web Hosting Provider In India 2024

Old Age Roles: 13 ఏళ్లకే రజనీకాంత్‌కు తల్లిగా శ్రీదేవి.. తమ ఏజ్‌కు మించి వయసున్న పాత్రలు చేసిన హీరో హీరోయిన్స్!

Sanjiv Kumar HT Telugu
Jan 06, 2025 02:34 PM IST

Heroes And Heroines Who Played Old Age Roles: సినిమాల్లో విలక్షణమైన నటనతో ఆకట్టుకుంటారు హీరో హీరోయిన్స్‌తోపాటు నటులు. అయితే, తమకున్న ఏజ్ కంటే ఎక్కువ వయసున్న పాత్రలో నటించి మెప్పించిన సెలబ్రిటీలు చాలామందే ఉన్నారు. మరి వారెవరు, వారు చేసిన పాత్రలపై ఓ లుక్కేద్దాం.

13 ఏళ్లకే రజనీకాంత్‌కు తల్లిగా శ్రీదేవి.. తమ ఏజ్‌కు మించి వయసున్న పాత్రలు చేసిన హీరో హీరోయిన్స్!
13 ఏళ్లకే రజనీకాంత్‌కు తల్లిగా శ్రీదేవి.. తమ ఏజ్‌కు మించి వయసున్న పాత్రలు చేసిన హీరో హీరోయిన్స్!

Heroes And Heroines Who Played Old Age Roles: నటన అన్నాక అన్ని రకాల పాత్రలు చేయాల్సి ఉంటుంది. ఎంత వైవిధ్యమైన రోల్స్ చేస్తే అంత గుర్తింపు వస్తుంది. ఇందులో భాగంగానే తమ ఏజ్‌కు మించి వయసున్న పాత్రలను చేసిన హీరో హీరోయిన్స్‌తోపాటు నటులు చాలానే ఉన్నారు. మరి వారెవరు, వారు చేసిన పాత్రలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

yearly horoscope entry point

శ్రీదేవి

అతిలోక సుందరి శ్రీదేవి నాలుగేళ్ల వయసులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన తమిళ సినిమా కాంధాన్ కరుణై. అనంతరం 13 ఏళ్లకు హీరోయిన్‌గా తమిళంలో మూండ్రు ముడిచ్చు సినిమాతో అరగేంట్రం చేసింది. ఇందులో రజనీకాంత్‌కు 25 ఏళ్ల సవతి తల్లిగా, వృద్ధుడికి భార్యగా 13 సంవత్సరాల వయసులో నటించి మెప్పించింది శ్రీదేవి. అలాగే పదహారేళ్ల వయసు మూవీలో నటించిన శ్రీదేవికి అప్పుడు 14 ఏళ్లు కావడం విశేషం.

విశ్వక్ సేన్

వెళ్లిపోమాకే సినిమాతో హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ మాస్ కా దాస్‌గా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా నటించడమే కాకుండా ఫలక్‌నూమా దాస్, దాస్ కా ధమ్కీ సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు. అయితే, విశ్వక్ సేన్ తన వయసుకుమించి పాత్ర చేసిన సినిమా అశోకవనంలో అర్జున కల్యాణం.

2022లో వచ్చిన అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో విశ్వక్ సేన్ 30 ఏళ్లకుపై బడి, పెళ్లి కానీ వ్యక్తి పాత్రలో నటించాడు. అది తనకు వయసుకు మించి పాత్ర అని పలు ఇంటర్వ్యూలో కూడా విశ్వక్ సేన్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో పాత్ర చేస్తున్నప్పుడు విశ్వక్ సేన్ ఏజ్ 27 ఏళ్లు.

వెంకటేష్

ఫ్యామిలీ హీరోగా సూపర్ సక్సెస్ అయ్యాడు విక్టరీ వెంకటేష్. కుటుంబ కథా తరహా చిత్రాలకు పెట్టింది పేరుగా వెంకటేష్‌ గురించి చెప్పుకుంటారు. అలాంటి వెంకటేష్ ఎన్నో సినిమాల్లో డబుల్ యాక్షన్ చేశారు. అందులో తండ్రీ, కొడుకు పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. అంటే, తన వయసుకు మించి తండ్రి పాత్రలో సూర్యవంశం, జయం మనదేరా వంటి ఎన్నో సినిమాల్లో నటించాడు వెంకటేష్.

అర్చన జోయిస్

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన కెజీఎఫ్ చాప్టర్ 1 మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో హై ఓల్టేజ్ యాక్షన్‌తోపాటు ప్రేక్షకులను కట్టిపడేసిన అంశం మదర్ సెంటిమెంట్. రాకీ భాయ్ తల్లిగా నటించి యావత్ దేశాన్ని ఆకర్షించిన నటి అర్చన జోయిస్. 2018లో వచ్చిన కేజీఎఫ్ సినిమాలో యశ్‌కు తల్లిగా నటించిన అర్చన్ జోయిస్‌కు అప్పుడు 24 ఏళ్లు మాత్రమే.

అలాగే, కేజీఎఫ్ చాప్టర్ 1 సమయంలో యశ్ వయసు 32 ఏళ్లు. అంటే, యశ్ కంటే వయసులో ఎనిమిదేళ్లు చిన్నదైన అర్చన జోయిస్ అతనికి తల్లిగా నటించడం విశేషం.

హనీరోజ్

వీర సింహా రెడ్డి సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణకు హీరోయిన్‌గా తల్లిగా అలరించింది మలయాళ బ్యూటి హనీ రోజ్. ఇందులో హీరోయిన్‌గా నటించిన శ్రుతి హాసన్‌ కంటే హనీరోజ్ ఐదేళ్లు చిన్నది. ఇక ఆ సమయంలో బాలకృష్ణకు 63 ఏళ్లు.

వీళ్లతోపాటు ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన ప్రకాశ్ రాజు, కమల్ హాసన్, చిరంజీవి అనేక సినిమాల్లో ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేస్తూ తమ వయసుకు మించిన పాత్రలు చేసి అలరించారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024