Best Web Hosting Provider In India 2024
డిప్యూటీ సీఎం పవన్ తీరుపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఫైర్
3 రోజులైనా మరణించిన అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణం
ఆ ఇద్దరి మరణానికి పవనే కారణం
చిత్తూరు: గేమ్ చేంజర్ ఈవెంట్ కు వచ్చి యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన విధానంపై మాజీ మంత్రి ఆర్కే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మానవత్వం మరచి గత ప్రభుత్వంపై నిందలు వేస్తారా అంటూ ఎక్స్ వేదికగా పవన్ తీరును ఆమె ఎండగట్టారు.
గేమ్ ఛేంజర్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి వెళ్లి ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ లు మరణించడం బాధాకరం. తన కోసం వచ్చిన ఇద్దరు అభిమానులు చనిపోయి 3 రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించకపోవడం అమానవీయం. తెలంగాణలో సినీ నటుడు అల్లు అర్జున్, పుష్ప టీమ్ మానవత్వం తో వ్యవహరించలేదన్న పవన్..ఏపీలో 3 రోజులైనా మరణించిన అభిమానుల ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పకపోవడం దారుణం. ఆ యువకుల తల్లులు, కుటుంబాల కన్నీటి రోదన కనిపించడం లేదా..? పరామర్శించకపోగా వీరి మరణానికి గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం రోడ్డు వెయ్యకపోవడం కారణం అంటూ చౌక బారు రాజకీయం చెయ్యడం తగునా..? పవన్ కళ్యాణ్ గారు. 7 నెలలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నది మీ ప్రభుత్వ మే కదా..? 7 నెలలుగా ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నది మీరు కాదా..? పవన్ కళ్యాణ్.. రోడ్డు వల్ల చనిపోతే వీరిద్దరి మరణానికి మీకు ఓట్లేసి గెలిపించినందుకు మీరు కారణం కాదా..? మీ గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ విమర్శ చేసుకోండి!! అంటూ ఆర్కే రోజా ట్వీట్ చేశారు.