Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
వైయస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ
తాడేపల్లి: విద్యుత్ ఉద్యోగులు, కార్మికులకు వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుందని వైయస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ఆర్ విద్యుత్ ఉద్యోగుల యూనియన్ నూతన సంవత్సర 2025 డైరీ, క్యాలెండర్‌ను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ..విద్యుత్ రంగ అభివృద్దికి వైయస్ జగన్ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ ఉద్యోగులు, కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ ఎస్‌సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, వైయస్ఆర్ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుగ్గల్ల మహేశ్వర రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్రావుల మల్లికార్జున రెడ్డి, స్టేట్ చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ ధర్మపురి వెంకటరమణ, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.బాలాజీ, పలువురు యూనియన్ నాయకులు పాల్గొన్నారు.