Healthy Drink: రోజూ రాత్రిపూట పాలల్లో ఈ ఒక్కటి వేసుకుని తాగితే మీ శరీరంలో ఎన్నో మార్పులు

Best Web Hosting Provider In India 2024

Healthy Drink: రోజూ రాత్రిపూట పాలల్లో ఈ ఒక్కటి వేసుకుని తాగితే మీ శరీరంలో ఎన్నో మార్పులు

Haritha Chappa HT Telugu
Jan 06, 2025 06:30 PM IST

Healthy Drink: ప్రతి రాత్రి పాలు తాగే అలవాటు ఎంతో మందికి ఉంది. కేవలం పాలు ఒక్కటే తాగితే కలిగే ప్రయోజనాల కన్నా కుంకుమపువ్వు వేసుకుని తాగడం వల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. ఇది డిప్రెషన్ ను తగ్గించడానికి, సెక్స్ డ్రైవ్ ను పెంచడానికి సహాయపడుతుంది.

ఇలా పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు
ఇలా పాలు తాగితే ఎన్నో ప్రయోజనాలు (Pixabay)

రాత్రి పడుకునే ముందు పాలు తాగడం మంచి అలవాటు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ పాలు ఒక్కటే తాగే కన్నా అందులో చిటికెడు కుంకుమపువ్వు వేసుకుని తాగడం వల్ల రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయి. కుంకుమపువ్వు ప్రపంచంలో అత్యంత ఖరీదైన మసాలా దినుసులలో ఒకటి. దీని ప్రత్యేక వాసన, రంగు మిగిలిన మసాలా దినుసుల కంటే దీన్ని ప్రత్యేకమైనదిగా నిలిచేలా చేస్తోంది. ప్రతిరోజూ పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో కుంకుమపువ్వు కలిపిన తాగితే కొద్ది రోజుల్లోనే శరీరంలో అనేక మార్పులు కనిపిస్తాయి.

yearly horoscope entry point

నిద్రలేమి సమస్యకు

నిద్ర పట్టక ఇబ్బందులు సమస్యలు ఉన్నవారు ఎంతో మంది. అలాంటి వారు పాలలో కుంకుమపువ్వు కలుపుకుని తాగాలి. పాలలో కుంకుమపువ్వు కలిపి తాగడం వల్ల మనసు, మెదడు రిలాక్స్ గా మారుతాయి. దీని వల్ల మీకు నిద్ర సులభంగా పడుతుంది. కుంకుమపువ్వు కలిపిన పాలు నిద్రలేమి సమస్యను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. రోజూ కుంకుమపువ్వు పాలు తాగితే మెటబాలిజం పెరిగి బరువు తగ్గడం సులువుగా మారుతుంది.

సంతానోత్పత్తికి…

పురుషులు, మహిళల్లో సంతానోత్పత్తి సమస్యలు పెరిగిపోతున్నాయి. పెళ్లి చేసుకున్న ఎన్నో జంటలు సహజంగా గర్భం ధరించలేక ఆసుపత్రులకు చుట్టూ తిరుగుతున్నారు. అలాంటి వారు పాలల్లో కుంకుమపువ్వును కలుపుకుని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కుంకుమ పువ్వులో కామోద్దీపన లక్షణాలు ఉన్నాయి. ఇవి లిబిడో, లైంగిక పనితీరును పెంచడంలో సహాయపడతాయి. అదే సమయంలో కుంకుమపువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్పెర్మ్ నాణ్యతను, చలనశీలతను పెంచడంలో సహాయపడతాయి. ఇది పురుషుల సంతానోత్పత్తి సమస్యను తొలగిస్తుంది.

చర్మానికి మెరుపు

రాత్రిపూట కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. కుంకుమపువ్వు చర్మానికి సాగే గుణాన్ని ఇస్తుంది. సన్నని గీతలు, ముడతలను తగ్గిస్తుంది. ముఖం యవ్వనంగా కనిపించాలంటే రోజూ కుంకుమపువ్వు పాలు తాగాలి.

రోజూ రాత్రిపూట కుంకుమపువ్వు పాలు తాగడం వల్ల రాత్రిపూట జీర్ణ ఎంజైములు స్రవించడానికి కుంకుమపువ్వు సహాయపడుతుంది. ఇది కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది. ఇది జీర్ణశయాంతర ప్రేగులలో ఉపశమనం కలిగిస్తుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్, అజీర్ణ సమస్యను తొలగిస్తుంది.

డిప్రెషన్ కు

కుంకుమపువ్వు పాలు రోజూ తాగడం వల్ల డిప్రెషన్ సమస్యలున్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. 2019 అధ్యయనం ప్రకారం, కుంకుమ పువ్వు డిప్రెషన్ వంటి తేలికపాటి, మితమైన లక్షణాలపై ప్రభావాన్ని చూపుతుంది.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024