Best Web Hosting Provider In India 2024
Hyderabad Flyover : హైదరాబాద్‌లో అందుబాటులోకి మరో భారీ ఫ్లైఓవర్.. ఇవీ ప్రత్యేకతలు
Hyderabad Flyover : ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభమైంది. సీఎం రేవంత్ దీన్ని ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ వినియోగంలోకి రావడంతో.. ట్రాఫిక్ కష్టాలు తీరాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరాంఘర్ ఫ్లైఓవర్‌కు సంబంధించిన ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. ఆరాంఘర్- జూపార్క్ ఫ్లైఓవర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.799 కోట్ల వ్యయంతో జీహెచ్‌ఎంసీ ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించింది. ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకు 6 లేన్లు, 4.8 కిలోమీటర్ల పొడువు, 23 మీటర్ల వెడల్పుతో ఫ్లైఓవర్‌ను నిర్మించారు. దీని నిర్మాణానికి అత్యాధునిక టెక్నాలజీని వాడారు.
ప్రత్యేకతలు..
1.గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగా అనేక ఫ్లైఓవర్లు, రోడ్లు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టారు. ఈ కార్యక్రమం కింద చేపట్టిన 42 పనుల్లో 36 ప్రాజెక్టులు పూర్తయ్యాయి.
2.నెహ్రూ జూలాజికల్ పార్క్ నుండి ఆరాంఘర్ వరకు నిర్మించిన ఫ్లైఓవర్ 4.04 కి.మీ పొడవు ఉంది. 11.6 కి.మీ పొడవున్న పీవీ నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌వే తర్వాత అతి పొడవైన ఫ్లైఓవర్‌గా ప్రసిద్ధి చెందింది.
3.జూ పార్క్ నుండి ఆరాంఘర్ వరకు ఉన్న ఈ ఫ్లైఓవర్‌ను రూ.736 కోట్లతో నిర్మించారు. ఆరు లేన్ల ద్వి దిశాత్మక రహదారికి ఇరువైపులా ర్యాంప్‌లు వేయడంతో సహా.. మిగిలిన పనులు మార్చి 2025 నాటికి పూర్తవుతాయని అధికారులు భావిస్తున్నారు.
4.వ్యూహాత్మక రహదారి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా.. కాసు బ్రహ్మానంద రెడ్డి (కేబీఆర్) పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబిలు నిర్మిస్తున్నారు.
5.ఆరు లేన్లు, ద్వి దిశాత్మక నిర్మాణంగా ఉన్న ఫ్లైఓవర్ ఆరాంఘర్‌ను నెహ్రూ జూలాజికల్ పార్క్‌తో కలుపుతుంది. ఈ ప్రాంతంలో ట్రాఫిక్‌ను గణనీయంగా మెరుగుపరుస్తుందని అధికారులు భావిస్తున్నారు.
6.ఈ ఫ్లైఓవర్ హైదరాబాద్‌లోని అనేక కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. ముఖ్యంగా.. ఆరాంఘర్, శాస్త్రిపురం, కాలాపత్తర్, దారుల్ ఉలూమ్, శివ్రాంపల్లి, హసన్‌నగర్ ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి.
7.ఈ ఫ్లైఓవర్ ప్రారంభం పట్ల వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు ట్రాఫిక్‌తో నరకం అనుభవించామని.. ఇప్పుడు కాస్త రిలీఫ్ దొరుకుతుందని అంటున్నారు.
8.ఆరాంఘర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లైఓవర్ పైన మొత్తం ఎంఐఎం జెండాలు బ్యానర్లు పెట్టారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
9.ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి ఎంఐఎం సపరేట్ ఫండ్ ఏమైనా ఇచ్చిందా? అసదుద్దీన్ ఓవైసీ ఫండ్ ఏమైనా ఉందా? అని రాజాసింగ్ ప్రశ్నించారు. ఈ ఫ్లైఓవర్‌కు ఓవైసీ పెడతారా అని ప్రశ్నించారు.
టాపిక్