Best Web Hosting Provider In India 2024
Hyderabad Car Accident : హైదరాబాద్ లో ఘోర ప్రమాదం, కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం
Hyderabad Car Accident : హైదరబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఘన్ పూర్ సర్వీస్ రోడ్డులో రన్నింగ్ కారులో మంటలు చెలరేగి ఇద్దరు సజీవ దహనం అయ్యారు.
Hyderabad Car Accident : హైదరాబాద్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఘన్ పూర్ సర్వీసు రోడ్డులో రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో చిక్కుకొని కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు సజీవదహనం అయ్యారు. సంఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు.
కారులో మంటలు చెలరేగి అంతలోనే భారీగా వ్యాపించాయి. మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ ఫుట్‌పాత్‌పై పడి కాలిపోయాడు. ముందు సీట్లో కూర్చున్న మరో వ్యక్తి కారులోనే సజీవ దహనం అయ్యాడు. ప్రమాదానికి గురైన కారుని మేడిపల్లిలోని ఓ ట్రావెల్ ఏజెన్సీ నుంచి సెల్ఫ్ డ్రైవ్ కోసం అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలికి చేరుకున్న మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి, ఘట్ కేసర్ సీఐ పరశురామ్ ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
టాపిక్