Best Web Hosting Provider In India 2024
CM Chandrababu : తక్షణమే 3 వేల హెచ్ఎంపీవీ టెస్టింగ్ కిట్లను తెప్పించండి, సీఎం చంద్రబాబు ఆదేశాలు
CM Chandrababu On HMPV Cases : హెచ్ఎంపీవీ కేసుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు వైద్యాధికారులతో సమావేశం నిర్వహించి, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్లూయెంజా కేసుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.
CM Chandrababu On HMPV Cases : దేశంలో హెచ్‌ఎంపీవీ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గుజరాత్, కర్ణాటకల్లో కేసులు నమోదైన విషయాన్ని గుర్తు చేస్తూ, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎం వివరించారు. 2001లోనే ఈ వైరస్ ఉన్నట్లుగా తెలిపారు. ఇప్పటివరకు ఏపీలో ఎలాంటి హెచ్‌ఎంపీవీ కేసులు నమోదు ఒక్కటీ నదేదుకలాన్నారు. శ్వాసకోశ వ్యాధులు, ఇన్‌ఫ్లూయెంజా లాంటి కేసుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.
వైరాలజీ ల్యాస్ సిద్ధం చేయండి
మైక్రోబయాలజిస్ట్‌లు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టాస్క్ ఫోర్స్ సలహాలు ఇవ్వాలని సూచించారు. హెచ్ఎంపీవీ సీజనల్ వ్యాధిగా వ్యాప్తిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఏపీలో ఐసీఎంఆర్ అధీకృత వైరాలజీ ల్యాబ్‌లను సిద్ధం చేయాలని సీఎం సూచించారు. అలాగే హెచ్ఎంపీవీ టెస్టింగ్ కిట్లను సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తక్షణమే 3 వేల టెస్టింగ్ కిట్లను తెప్పించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఏపీలో 4.5 లక్షల ఎన్95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పీపీఈ కిట్లు ఉన్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు.
మాస్క్ లు ధరించాలి
శానిటైజర్లు, మందులు సిద్ధం చేసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని బోధనాసుపత్రుల్లో 20 పడకల ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వివరించారు. ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ పైపులైన్లకు సంబంధించి మాక్ డ్రిల్ నిర్వహించాల్సిందిగా సూచించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. కనీసం 20 సెకన్ల పాటు చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించాలని సూచించారు.
హెచ్ఎంపీవీపై ప్రజల్ని భయబ్రాంతుల్ని చేస్తే చర్యలు – తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి
హెచ్ఎంపీవీ అనేది కొత్త వైరస్ కాదని, 2001లోనే ఈ వైరస్ ఉనికిని కనుగొన్నారని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. 2001 నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వ్యాప్తిలో ఉందన్నారు. ఈ వైరస్ శ్వాసకోశ వ్యవస్థపై స్వల్ప ప్రభావం చూపిస్తుందని తెలిపారు.
“వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతని నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుంది. చైనాలో ఈ సంవత్సరం HMPV కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాల్లో, రాష్ట్రాల్లో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులతో, మన రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు రెగ్యులర్‌గా కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఈ వైరస్ విషయంలో ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. రాష్ట్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సిద్ధంగా ఉంది. డిసీజ్ సర్వైలైన్స్ సిస్టమ్‌ను మరింత బలోపేతం చేయాలని, అన్నిరకాల వనరులతో సిద్ధంగా ఉండాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను, జిల్లా అధికారులను అప్రమత్తం చేశాం. సోషల్ మీడియాలో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసేలా నిరాధార, తప్పుడు సమాచారన్ని ప్రచారం చేస్తే, ప్రభుత్వం చాలా సీరియస్‌గా పరిగణిస్తుంది” – మంత్రి దామోదర రాజనర్సింహ
సంబంధిత కథనం
టాపిక్