Earthquake today : నేపాల్​- టిబెట్​ సరిహద్దులో భారీ భూకంపం, భారత్​లో ప్రకంపనలు..

Best Web Hosting Provider In India 2024


Earthquake today : నేపాల్​- టిబెట్​ సరిహద్దులో భారీ భూకంపం, భారత్​లో ప్రకంపనలు..

 

Earthquake today : నేపాల్​- టిబెట్​ సరిహద్దు ప్రాంతాల్లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి బీహార్​, అసోలోనూ భూమి కంపించింది.

నేపాల్​- టిబెట్​ సరిహద్దులో భూకంపం..
నేపాల్​- టిబెట్​ సరిహద్దులో భూకంపం..
 

నేపాల్​- టిబెట్​ సరిహద్దులో మంగళవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూమి కంపించింది. భూకంపం ధాటికి భారత్​లోని బీహార్​, అసోంలో సైతం ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి.

 

యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (యూఎస్​జీఎస్) ప్రకారం, నేపాల్-టిబెట్ సరిహద్దుకు సమీపంలోని లోబుచేకు ఈశాన్యంగా 93 కిలోమీటర్ల దూరంలో ఉదయం 6:35 గంటలకు ఈ భూకంపం సంభవించింది.

బీహార్​లో భూప్రకంపనల కారణంగా ప్రజలు భయాందోళనతో తమ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

అయితే తాజా భూకంపం కారణంగా ఇంకా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వెలుగులోకి రాలేదు.

Whats_app_banner
 


Best Web Hosting Provider In India 2024


Source link