Brahmamudi January 7th Episode: రొమాన్స్‌కు కావ్య కండీష‌న్స్‌ – రాజ్‌పై ఫ్రాడ్‌గా ముద్ర – అనామిక‌ రిట‌ర్న్ గిఫ్ట్‌

Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 7th Episode: రొమాన్స్‌కు కావ్య కండీష‌న్స్‌ – రాజ్‌పై ఫ్రాడ్‌గా ముద్ర – అనామిక‌ రిట‌ర్న్ గిఫ్ట్‌

Brahmamudi: బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 7 ఎపిసోడ్‌లో తాము త‌యారు చేసిన న‌గ‌ల‌ను జ‌గ‌దీష్‌ప్ర‌సాద్‌కు చూపిస్తాడు రాజ్‌. క్వాలిటీ చెక్‌లో కిరీటం న‌కిలీ అని తేలుతుంది. రాజ్‌ను ఫ్రాడ్‌గా పొర‌పాడిన జ‌గ‌దీష్‌ప్ర‌సాద్ అత‌డిని దారుణంగా అవ‌మానిస్తాడు. భ‌ర్త‌తో పాటు స్వ‌రూజ్ గ్రూప్‌ను కావ్య కాపాడుతుంది.

బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 7 ఎపిసోడ్‌
బ్ర‌హ్మ‌ముడి జ‌న‌వ‌రి 7 ఎపిసోడ్‌

ఆఫీస్ టైమ్ అవుతోన్న రాజ్ నిద్ర పోతున్న‌ట్లుగా న‌టిస్తుంటాడు. అత‌డిని లేప‌డానికి చ‌క్క‌లిగిలి పెట్ట‌బోతుంది కావ్య‌. ఆమె ప్లాన్ రివ‌ర్స్ అవుతుంది. రాజ్‌పై ప‌డిపోతుంది.కావ్య‌కు ముద్దు పెట్ట‌బోతాడు రాజ్‌. ముద్దు పెట్టుకోవాల‌నే నాది ఓ కండీష‌న్ అని కావ్య అంటుంది.

 

ఇప్పుడు ముద్దు పెట్టుకుంటే జీవితాంతం నా చేయి వ‌ద‌ల‌కుండా ప‌ట్టుకోవాల‌ని అంటుంది. ఆ న‌మ్మ‌కం మీకు ఉంటే ముద్దు పెట్టుకోమ‌ని భ‌ర్త‌తో అంటుంది. కావ్య మాట‌లు విన్న రాజ్ డైల‌మాలో ప‌డ‌తాడు. ముద్దు పోగ్రామ్ క్యాన్సిల్ చేస్తాడు. ఆఫీస్ టైమ్ అవుతుంద‌ని తొంద‌ర‌పెట్టి బెడ్‌రూమ్ నుంచి వెళ్లిపోతాడు.

కారు డ్రైవింగ్ స్పీడ్‌…

రాజ్‌, కావ్య ఆఫీస్‌కు బ‌య‌లుదేరుతారు. రాజ్ కారు డ్రైవింగ్ స్పీడుగా చేస్తుంటాడు. ఆ స్పీడు చూసి కావ్య కంగారుప‌డుతుంది.లేట్ అనే ప‌దాన్ని ఎన్ని ర‌కాలుగా వాడుతారో చెప్పి రాజ్‌కు క్లాస్ ఇస్తుంది. లేట్ అనే ప‌దంలో గుణ‌పాఠం, చావు హెచ్చ‌రిక ఉంద‌ని అంటుంది. క్లాస్‌లు మీద క్లాసులు తీసుకోకు క‌ళావ‌తి అని రాజ్ అంటాడు. అస‌లే ప్ర‌జంటేష‌న్ ఇవ్వాల్సివుంద‌ని, మొత్తం మ‌ర్చిపోతాన‌ని కంగారుప‌డిపోతాడు.

అనామిక‌కు ఫోన్‌….

ప్ర‌జంటేష‌న్ కోసం తీసుకురావాల్సిన ఫైల్ క‌నిపించ‌దు. రాజ్ ఇంటి ద‌గ్గ‌రే ఆ ఫైల్ మ‌ర్చిపోతాడు. ఆ ఫైల్ తీసుకురావ‌డానికి కావ్య ఆటోలో వెన‌క్కి వెళుతుంది. రాజ్ ఒక్క‌డే ఆఫీస్‌కు రావ‌డం చూసి సెక్యూరిటీ కంగారుప‌డిపోతాడు. ఆ విష‌యం అనామిక‌కు ఫోన్ చేసి చెబుతాడు.

సెక్యూరిటీ చెప్పిన మాట విన‌గానే అనామిక ఆలోచ‌న‌లో ప‌డిపోతుంది. త‌న‌తో ప‌నేం లేద‌ని, ఆల్రెడీ మ‌నం కిరీటం మార్చేశాముగా అని సామంత్ ఆమెకు స‌ర్ధిచెబుతాడు.వాళ్ల ప‌రువు పోవ‌డం ఖాయ‌మ‌ని అంటాడు.

 

ఈగో సాటిస్‌ఫై…

త‌న‌కు దొంగ బంగారం అమ్మినందుకజ‌గ‌దీష్ ప్ర‌సాద్ తిడుతూ ఉంటే కావ్య క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం తాను చూడాల‌ని, అప్పుడే త‌న ఈగో సాటిస్‌ఫై అవుతుంద‌ని అనామిక అంటుంది. కావ్య‌కు ఫోన్ చేసి సంతోషంగా సినిమా పాట‌లు పాడుతుంది. వేస్ట్‌ఫెలో అంటూ అనామిక ఫోన్ క‌ట్ చేయ‌బోతుంది కావ్య‌.

ఆఫీస్‌లో జ‌గ‌దీష్‌ప్ర‌సాద్‌తో అంక్షిత‌లు వేసుకోకుండా నువ్వు బ‌య‌ట ఉంటే ఎలా అని కావ్య‌ను రెచ్చ‌గొడుతుంది అనామిక‌. మ‌రికొద్ది సేప‌ట్లో నేను గెల‌వ‌బోతున్నాన‌ని అనామిక‌తో ఛాలెంజ్ చేస్తుంది కావ్య‌.అదంతా నీ భ్ర‌మ అని అనామిక చెబుతుంది.

కుటుంబం రోడ్డు మీద‌కు…

ఇంకాసేప‌ట్లో ఆఫీస్‌లో మీకు న‌ష్టం జ‌ర‌గ‌బోతుంద‌ని, ఎప్పుడు లేని విధంగా రాజ్ త‌ల‌దించుకోబోతున్నాడ‌ని, మీ కుటుంబం రోడ్డు మీద‌కు రాబోతుంద‌ని కావ్య‌తో అంటుంది అనామిక‌. న‌న్ను అవ‌మానించి మీరు సంతోషంగా ఉంటే ఎలా మీరు అంత‌కుమించి అవ‌మానాల పాలు కావాలి అని అనామిక అంటుంది. మీకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇవ్వాల‌ని మంచి టైమ్ కోసం ఎదురుచూశా…ఇప్పుడు నా టైమ్ వ‌చ్చింద‌ని అనామిక చెబుతుంది.

అనామిక సంబ‌రాలు…

త్వ‌ర‌గా ఆఫీస్‌కు వెళ్ల‌మ‌ని, నీ భ‌ర్త మాత్ర‌మే అవ‌మానాలు ప‌డితే ఎలా…ఇద్ద‌రు ఆఫీస్‌కు వెళ్లి త‌నివితీరా ఏడ‌వండి అంటూ ఫోన్ క‌ట్ చేస్తుంది. ఫోన్ క‌ట్ చేసి అనామిక, సామంత్ సంబ‌రాలు చేసుకుంటారు.

 

అనామిక ఎలాంటి కుట్ర‌ల‌కు పాల్ప‌డిందో అని కావ్య కంగారుప‌డిపోతుంది. రాజ్‌కు ఫోన్ చేస్తుంది. రాజ్ ప్ర‌జంటేష‌న్ రూమ్‌లో ఉండ‌టంతో ఫోన్ లిఫ్ట్ చేయ‌లేక‌పోతాడు. జ‌గ‌దీష్ ప్ర‌సాద్‌కు తాము త‌యారు చేసిన న‌గ‌ల‌ను చూపిస్తాడు రాజ్. ఈ న‌గ‌ల‌ను అందంగా డిజైన్ చేసింది కావ్య‌నే అని క్రెడిట్ ఆమెకు ఇస్తాడు.

కిరీటం న‌కిలీది…

జ‌గ‌దీష్ ప్ర‌సాద్‌తో వ‌చ్చిన అప్రైజ‌ల్ న‌గ‌ల‌ను చెక్ చేస్తాడు. కిరీటం గోల్డ్‌ది కాద‌ని, న‌కిలీద‌ని అప్రైజ‌ల్ అన‌డంతో రాజ్ షాక‌వుతాడు. దుగ్గిరాల సీతారామ‌య్య స్థాపించిన సంస్థ‌లో ఇలాంటి ఫ్రాడ్ ఎలా చేస్తావ‌ని రాజ్‌పై జ‌గ‌దీష్ ప్ర‌సాద్ ఫైర్ అవుతాడు. మిమ్మ‌ల్ని న‌మ్మి ఇంత పెద్ద కాంట్రాక్ట్ మీకు ఇస్తే చివ‌ర‌కు ఇంత‌గా దిగ‌జారుతారా రాజ్‌ను నానా మాట‌లు అంటాడు.

ఒరిజిన‌ల్ కిరీటం ఏమైందో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని, ఎక్క‌డో ఏదో పొర‌పాటు జ‌రిగింద‌ని రాజ్ స‌ర్ధిచెప్ప‌బోతాడు. అడ్డంగా దొరికిపోయి ఇంకా మాయ చేయాల‌ని చూస్తున్నావా అంటూ రాజ్ మాట‌ల‌ను న‌మ్మ‌డు జ‌గ‌దీష్ ప్ర‌సాద్‌. బిజినెస్ చేసే ప‌ద్ద‌తి ఇదేనా అంటూ రాజ్‌ను అవ‌మానిస్తాడు.

రాజ్‌ను కాపాడిన కావ్య‌…

అప్పుడే కావ్య అక్క‌డికి ఎంట్రీ ఇస్తుంది. నీకు తెలియ‌కుండా ఇంత పెద్ద ఫ్రాడ్ జ‌రిగింద‌ని నేను అనుకోవ‌డం లేద‌ని కావ్య‌పై జ‌గ‌దీష్ ప్ర‌సాద్ ఫైర్ అవుతాడు. నాకే న‌కిలీ కిరీటం అంట‌గ‌ట్టాల‌ని చూస్తారా అంటూ కోపంగా మాట్లాడుతాడు. ఇది మోడ‌ల్ డిజైన్ మాత్ర‌మేన‌ని ఒరిజిన‌ల్ త‌న ద‌గ్గ‌రే భ‌ద్రంగా ఉంద‌ని కావ్య అంటుంది.

 

మీకు చెప్ప‌డం రాజ్ మ‌ర్చిపోయాడ‌ని జ‌గ‌దీష్ ప్ర‌సాద్‌తో కావ్య అంటుంది. కావ్య‌తో పాటు లాక‌ర్ రూమ్‌కు వెళ్లిన రాజ్ కిరీటం తీసుకొచ్చి ఇస్తాడు. ఆ కిరీటం చెక్ చేసిన అప్రైజ‌ల్ బంగారంతో చేసింద‌ని అంటాడు. ఆ మాట విన‌గానే జ‌గ‌దీష్ ప్ర‌సాద్ సంబ‌ర‌ప‌డిపోతాడు.

కావ్య‌కు సారీ…

క‌నీసం ఏం జ‌రిగిందో తెలియ‌కుండా దుగ్గిరాల సీతారామ‌య్య మ‌న‌వ‌డినే అవ‌మానించారా? ఫ్రాడ్ చేసే అల‌వాటు రాజ్‌కు లేద‌ని కావ్య అంటుంది. రాజ్‌తో పాటు కావ్య‌కు సారీ చెబుతాడు జ‌గ‌దీష్‌ప్ర‌సాద్‌. మీ కంపెనీ హిస్ట‌రీతో పాటు తాత‌య్య గురించితెలిసి కూడా అవ‌మానించి త‌ప్పు చేశాన‌ని జ‌గ‌దీష్‌ప్ర‌సాద్ అంటాడు. తాను కొట్టేసింది బంగారు కిరీటం కాద‌ని తెలిసిన‌ సెక్యూరిటీ భ‌యంతో వ‌ణికిపోతాడు.

ఒరిగిందేమి లేదు…

కావ్య‌, రాజ్‌ల‌ను దెబ్బ‌కొట్టాన‌నే సంతోషంలో ఉంటుంది అనామిక‌. రాజ్ ఫ్రాడ్‌ను వాడుకొని స్వ‌రాజ్ గ్రూప్‌కు వ‌చ్చే కాంట్రాక్ట్‌ల‌ను మ‌న కంపెనీవైపుకు వ‌చ్చేలా చేసుకుందాం అని సామంత్‌తో అంటుంది అనామిక‌. నాకేందుకో కొడుతుంది. నీ అపార‌మైన తెలివితేట‌ల వ‌ల్ల అపాయంలో ప‌డ‌టంలో త‌ప్ప నాకు ఇంత వ‌ర‌కు ఒరిగిందేమి లేద‌ని సామంత్ అంటాడు. అప్పుడే సెక్యూరిటీ అనామిక‌కు ఫోన్ చేస్తాడు.

బంగారం కాదు ఇనుము…

ఫోన్ లిఫ్ట్ చేసిన అనామిక‌…జ‌గ‌దీష్ ప్ర‌సాద్‌…కావ్య‌, రాజ్‌ల‌పై కేసు పెడ‌తాన‌ని అంటున్నాడా అని సెక్యూరిటీని అడుగుతుంది. కేసు ఎందుకు పెడ‌తాడ‌ని, ఇంకాసేపు ఆగితే న‌న్ను క‌మ్మేసి…దొంగ‌త‌నం కేసులో మిమ్మ‌ల్ని ఇరికించేలా ఉన్నార‌ని అస‌లు సంగ‌తి చెబుతాడు. కావ్య తెలివితేట‌ల ముందు మ‌న‌మెంతా… మీ ముందు ఉన్న‌ది బంగారు కిరీటం కాద‌ని ఇనుముద‌ని అస‌లు బాంబు పేల్చుతాడు. ఆ మాట విన‌గానే అనామిక‌తో పాటు సామంత్ షాక‌వుతారు.

 

ప్ర‌కాశానికి అవ‌మానం…

మార్వాడీతో బంగారం డీల్ కుద‌ర్చుకుంటాడు ప్ర‌కాశం.కానీ ఇప్పుడు అంత బంగారం మ‌న‌కు అవ‌స‌రం లేద‌ని, ఆ డీల్ కాద‌ని అంటుంది కావ్య‌. మా ఇంట్లో నేను ఎంత చెబితే అంత అని గొప్పులు చెప్పావు క‌దా…మీ ఇంట్లో నీ విలువ ఏంటో ఇప్పుడే అర్థ‌మైంద‌ని ప్ర‌కాశాన్ని మార్వాడీ అవ‌మానిస్తాడు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

Whats_app_banner
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024