AP HMPV Alert: హెచ్ఎంపివిపై అనవసర ఆందోళన వద్దు, ఏపీలో కేసులు లేవన్న సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం

Best Web Hosting Provider In India 2024

AP HMPV Alert: హెచ్ఎంపివిపై అనవసర ఆందోళన వద్దు, ఏపీలో కేసులు లేవన్న సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం

 

AP HMPV Alert: హెచ్‌ఎంపివి వైరస్‌పై ప్రజలు అనవసరంగా ఆందోళన చెంద వద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. ఏపీలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని వైద్యఆరోగ్య శాఖ అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ముఖ‌్యమంత్రి ఆదేశించారు.

హెచ్‌ఎంపివి వైరస్‌పై అనవసర ఆందోళన వద్దన్న ఏపీ సర్కారు
హెచ్‌ఎంపివి వైరస్‌పై అనవసర ఆందోళన వద్దన్న ఏపీ సర్కారు
 

AP HMPV Alert: ఆంధ్రప్రదేశ్ లో హెచ్ఎంపివి వైరస్ కు సంబంధించి ఎటువంటి కేసులు నమోదు కాలేదని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత రెండు రోజులుగా హెచ్ఎంపివిపై కేంద్రం అందించిన సాధారణ సలహాతో పాటు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న వార్తల దృష్ట్యా ముఖ్యమంత్రి సోమవారం నాడు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో పరిస్థితిని సమీక్షించారు.

 

కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హెచ్ఎంపివి కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారులు అప్రమత్తతతో వ్యవహరించాలన్నారు. దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీనియర్ వైద్య నిపుణులు చెబుతున్నారని ఆయన వివరించారు. మన రాష్ట్రంలో హెచ్ఎంపివి కేసులు ఏవీ నమోదు కాలేదని ఆయన చెప్పారు.

తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యం మరియు ఐఎల్ఐ వంటి ఇన్‌ఫ్లుయెంజా కేసులలో కూడా ఎటువంటి పెరుగుదల నమోదు కాలేదన్నారు. ఈ వైరస్ కు తేలికపాటి స్వభావం ఉన్నందున ఆందోళన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వానికి అవసరమైన సాంకేతిక ఇన్‌పుట్‌లను అందించడానికి మైక్రో బయాలజిస్ట్, పీడియాట్రిషియన్స్, పల్మోనాలజిస్ట్ మరియు ప్రివెంటివ్ మెడిసిన్ ప్రొఫెసర్‌లతో నిపుణుల కమిటీ (టాస్క్ ఫోర్స్) ఏర్పాటు చేశామన్నారు. పరిస్థితిని మెరుగుపర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అంశంపై ఈ కమిటీ ప్రభుత్వానికి సూచనలు అందచేస్తుందని వివరించారు.

ప్రస్తుతం ఉన్న వైరస్‌ సీజనల్ వైరస్ కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించారు. వైరస్ ప్రభావితుల పరీక్ష కోసం, హెచ్ఎంపివి వైరస్‌ని పరీక్షించడానికి యూనిప్లెక్స్ కిట్‌లను సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో ఐసిఎంఆర్ గుర్తింపు పొందిన 10 వైరాలజీ ల్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, ఈ సౌకర్యాలలో హెచ్ఎంపివి పరీక్షలు చేయవచ్చని చెప్పారు.

 

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) పూణేలో హెచ్‌ఎమ్‌పివి నిర్ధారణ పరీక్ష జరగాలని కేంద్రం సూచించిందన్నారు. ఐసిఎంఆర్ గుర్తింపు పొందిన విడిఆర్ఎల్ ల్యాబ్‌లకు అవసరమైన టెస్టింగ్ కిట్‌లను సరఫరా చేస్తామని కేంద్రం తెలిపిందన్నారు.

జర్మనీ నుంచి కిట్ల కొనుగోలు…

జర్మనీ నుండి మొదటగా 3000 టెస్టింగ్ కెపాసిటీ కిట్‌లను కొనుగోలు చేయాలని సూచించారు. 4.50 లక్షల N95 మాస్క్‌లు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్క్‌లు, 3.52 లక్షల PPE కిట్లు తక్షణమే అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియచేశారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలకు సరఫరా చేయడానికి పై వాటిని మరియు శానిటైజర్‌ లు మరిన్ని స్టాక్‌లను రాబోయే మూడు నెలలకు సేకరించాలని సిఎం సూచించారు.

చికిత్స కోసం అవసరమైన ఔషధాల లభ్యతను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు. హెచ్ఎంపివి సంబంధిత అనారోగ్యం చికిత్సకు అవసరమైన మందులు తగినన్ని అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలియచేశారు. అవసరమైతే, రిబావిరిన్ వంటి ప్రత్యేక మందులను ఎపిఎంఎస్ఐడిసి ద్వారా సరఫరా చేసే వరకు స్థానికంగానే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.

అన్ని ప్రభుత్వ బోధన మరియు జిల్లా ఆసుపత్రులలో 20 పడకల ఐసోలేషన్ వార్డులను అవసరమైతే సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలోని అన్ని ఓపి ప్రాంతాలలో ఆటో శానిటైజర్ డిస్పెన్సర్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతరాయం లేని ఆక్సిజన్ సరఫరా, ఆక్సిజన్ పైపు లైన్లు, లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా మరియు పిఎస్ఎ ప్లాంట్ల లభ్యత వంటి అంశాలపై అన్ని ఆసుపత్రులలో మాక్ డ్రిల్ నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

 

ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదయిన తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ మరియు ఇన్‌ఫెక్షన్ ఐఎల్ఐ వంటి ఇన్‌ఫ్లుఎంజా కేసులను నిశితంగా పర్యవేక్షించాలని సూచించారు. తదుపరి నిర్వహణ కోసం ఏదైనా హాట్‌స్పాట్‌లను గుర్తించడంతో పాటు ప్రజలకు… సబ్బుతో 20 సెకన్ల పాటు హ్యాండ్ వాష్, మాస్క్ వాడకం, పరిశుభ్రత నిర్వహణపై అవగాహన కల్పించాలన్నారు.

ఆందోళన అవసరం లేదు :వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్

అంతకు ముందు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వైజాగ్ నుండి హెచ్ఎంపివి వ్యాప్తిపై ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వైద్య ఆరోగ్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉండాలన్నారు. తాజా ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు త‌న‌కు వివరించాల‌ని మంత్రి అధికారులను ఆదేశించారు.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

టాపిక్

 
 
HealthHmpv VirusNorovirusGovernment Of Andhra PradeshTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024