Best Web Hosting Provider In India 2024
Karthika Deepam January 7th Episode: టిఫిన్ సెంటర్‌పై ఆఫీసర్స్ రైడ్.. దీప, కార్తీక్ కంగారు.. జ్యోత్స్న ప్లాన్ మిస్ ఫైర్
Karthika Deepam 2 Today episode January 7th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. దీప చేసిన టిఫిన్స్ అని తెలియడంతో తినే మధ్యలోనే శివన్నారాయణ వెళ్లిపోతాడు. దీప టిఫిన్ బండిపై ఆఫీసర్లు రైడ్ చేస్తారు. సీజ్ చేస్తామంటారు. అయితే జ్యోత్స్న వేసిన ప్లాన్ ఫలించదు. పూర్తిగా ఏం జరిగిందంటే..
కార్తీక దీపం 2 నేటి (జనవరి 7) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. దీప చేసిన టిఫిన్లను పొగిడేస్తూ తింటారు శివన్నారాయణ, జ్యోత్స్న. ఇంతలో ఈ టిఫిన్స్ ఎవరు చేశారని సుమిత్రను జ్యోత్స్న అడుగుతుంది. ఆ టిఫిన్స్.. దీప చేసిందని నిజం చెప్పేస్తుంది. కార్తీక్ టిఫిన్ సెంటర్ నుంచి తెచ్చానని చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో అక్కడికి ఎందుకెళ్లావ్, ముందే చెప్పొచ్చు కదా అని సుమిత్రను అడుగుతారు. దీప చేసిన టిఫిన్స్ అని తెలియడంతో తినకుండా మధ్యలోనే లేచి వెళతాడు శివన్నారాయణ. దశరథ్ కూడా వెళ్లిపోతాడు.
దీప వంటకు రెస్టారెంట్ రేంజ్ ఉందని అన్నందుకు థ్యాంక్స్ దీప అని వెటకారంగా అంటుంది సుమిత్ర. రెస్టారెంట్ పెట్టిస్తావా అని అడుగుతుంది. దీంతో మమ్మీకి దాసు ఏమైనా చెప్పాడా అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. దాసు నిజం చెప్పేశాడేమోనని కంగారుగా
దీపకు నిజం చెప్పిన కార్తీక్
టిఫిన్ సెంటర్ దగ్గరికి సుమిత్రమ్మ వచ్చారు కదా అని కార్తీక్‍ను దీప అడుగుతుంది. దీంతో వచ్చారని నిజం చెబుతాడు కార్తీక్. ఇంత దూరం వచ్చి కలవకుండా ఎందుకు వెళ్లారని దీప అడుగుతుంది. మొహం చెల్లకవెళ్లిపోయిందని కార్తీక్ బదులిస్తాడు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని చూసి తట్టుకోలేక వెళ్లి పోయి ఉంటుందని దీప అంటుంది. అందుకే అని అంటాడు కార్తీక్. ఆటో డ్రైవర్‌తో టిఫిన్స్ కట్టించి తీసుకెళ్లిందని చెబుతాడు. “మా అమ్మ, అత్త మంచి ఫ్రెండ్స్. తన ఫ్రెండ్ టిఫిన్ సెంటర్‌లో కూర్చొని పని చేస్తుంటే ఎదురొచ్చి ఎలా ఉన్నావని అడగలేదు కదా. అందుకే ఎవరికీ కనిపించకుండా చాటుగా చూసి వెళ్లిపోవాలనుకుంది. కానీ నేను చూశా” అని కార్తీక్ చెబుతాడు. సొంత మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయానని దీప బాధపడుతుంది. ఇది శాశ్వతం కాదని, రాత్రి లాగా కోపాలు.. దూరాలు త్వరగా మాయం అవుతాయని, ఆలోచించకుండా పడుకోవాలని దీపతో కార్తీక్ అంటాడు. దీంతో మీరు గెలవాలి కార్తీక్ బాబు.. అందరూ కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటూ దీప నిద్రపోతుంది.
టిఫిన్ సెంటర్‌పై ఆఫీసర్స్ రైడ్
టిఫిన్ సెంటర్ వద్ద కాంచన పని చేస్తుంటే దీప వద్దని వారిస్తుంది. సాయం చేయనీ అని కార్తీక్ అంటే.. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా మనసుకు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అని దీప చెబుతుంది. ఇంక మన జీవితంలో ఏ కష్టాలు రావు దీప అని కాంచన అంటుంటేనే.. ఓ కారు వచ్చి ఆగుతుంది. కార్లు కూడా టిఫిన్ సెంటర్ దగ్గర ఆగుతుంటే.. మనం ఫేమస్ అయినట్టే దీప అంటూ కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అయితే, తాము ఫుడ్ కార్పొరేషన్ నుంచి వస్తున్నామని, తాను ఫుడ్ ఇన్‍స్పెక్టర్ అని ఓ వ్యక్తి పరిచయం చేసుకుంటాడు. టిఫిన్ సెంటర్‌లో శుభ్రం లేని, క్వాలిటీ లేని ఫుడ్ అమ్ముతున్నారని తమకు కంప్లైట్ వచ్చిందని, అందుకే రైడ్ చేసేందుకు వచ్చామని చెబుతాడు. ఎవరూ టిఫిన్స్ తినొద్దని అంటాడు.
సీజ్ చేస్తాం.. దీప, కార్తీక్ టెన్షన్
కంప్లైట్‍లో వచ్చినట్టు టిఫిన్స్ శుభ్రంగా లేకపోయినా.. కెమికల్స్ వాడినట్టు తెలిసినా బండి సీజ్ చేస్తామని ఆ ఆఫీసర్ బెదిరిస్తాడు. దీంతో దీప, కార్తీక్, కాంచన షాక్ అవుతారు. ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నందుకు చర్యలు తీసుకుంటామని అంటాడు. ఇంతలో తాము అన్ని శుభ్రత పాటిస్తున్నామని, ఏదైనా టేస్ట్ చేసుకోండని దీప చెబుతుంది. కంప్లైట్ ఎవరిచ్చారని కార్తీక్ అడిగితే.. ఆఫీసర్ నిజం చెప్పడు. ఎవరో కంప్లైట్ ఇస్తే.. ఇలా చేస్తే ఎలా అని, టిఫిన్స్ ఎలా ఉన్నాయని అక్కడి వారిని దీప అడుగుతుంది. అయినా బండి సీజ్ చేయాలని ఆ ఆఫీసర్ హడావుడి చేస్తాడు. కొత్తగా బిజినెస్ పెట్టామని ఇలా చేస్తే ఎలా అని కార్తీక్ అడుగుతాడు. డ్యూటీ చేసుకోనివ్వాలని ఆ ఆఫీసర్ అంటాడు.
మాజీ కలెక్టర్ ఎంట్రీ.. జ్యోత్స్న కంగారు
ఇదంతా ప్లాన్ చేసిన జ్యోత్స్న కారులో కూర్చొని చూస్తుంటుంది. కంప్లైట్ ఇచ్చిన వ్యక్తిని తీసుకొని రావాలని, ఎవరు కంప్లైట్ ఇచ్చారో చెప్పాలని దీప మరోసారి ఆఫీసర్లను అడుగుతుంది. అవన్నీ చెప్పలేమని, షాంపిల్స్ తీసుకొని బండి సీజ్ చేయాలని ఆ అధికారి అంటాడు. దీంతో దీప కంగారు పడుతుంది. ఇంతలోనే ప్లేట్ బజ్జీ ఇవ్వాలంటూ ఓ వ్యక్తి వస్తారు. ఇంక వ్యాపారం ఆగిపోయినట్టు బాబాయ్ అని దీప అంటుంది. క్వాలిటీ లేని టిఫిన్స్ తయారు చేస్తున్నామని మా బండిని సీజ్ చేస్తున్నారని అంటున్నారని ఆయనతో చెబుతుంది. ఆఫీసర్లను ఆ వ్యక్తి ప్రశ్నిస్తాడు. తాను ఇక్కడే రోజూ టిఫిన్స్ తింటున్నానని, క్వాలిటీ చాలా బాగుంటోందని అంటాడు. శుభ్రమైన ఫుడ్ అని, ఎవరు కంప్లైట్ ఇచ్చారో చెప్పాలంటాడు. మీకెందుకు చెప్పాలని ఆఫీసర్ తిరిగి ప్రశ్నిస్తాడు. దీంతో తాను రిటైర్డ్ కలెక్టర్ అని, ఉన్నతాధికారులతో మాట్లాడాలా అని ఆ వ్యక్తి చెబుతాడు.
మోహన్ దాస్ అన్న ఉన్నతాధికారికి కాల్ చేయకూడదంటే కంప్లైట్ ఎవరు ఇచ్చారో చెప్పాలని అడుగుతాడు. తన పేరు ఎక్కడ చెబుతారో అని జ్యోత్స్న కంగారు పడుతుంది. అయితే గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కంప్లైట్ వచ్చిందని ఆ ఆఫీసర్ చెబుతాడు. మర్యాదగా సారీ చెప్పి వెళ్లిపోవాలని ఆ రిటైర్డ్ కలెక్టర్ అంటాడు. దీంతో దీప, కార్తీక్‍కు సారీ చెబుతాడు ఆఫీసర్. సారీ వద్దని, ఎవరో కంప్లైట్ చేశారని మీ లాంటి వాళ్లు వచ్చి సీజ్ చేస్తే మా లాంటి వారి పరిస్థితి ఏంటని కార్తీక్ ప్రశ్నిస్తాడు. పెద్దాయన చెప్పారు కదా.. మీ బిజినెస్ చేసుకోండని చెప్పి ఆ ఆఫీసర్ వెళ్లిపోతాడు.
జ్యోత్స్న ప్లాన్ ఫెయిల్.. కారు చూసేసిన కార్తీక్
దీప, కార్తీక్ టిఫిన్ సెంటర్ సీజ్ చేయించాలని జ్యోత్స్న వేసిన ప్లాన్ మిస్ ఫైర్ అవుతుంది. రిటైర్డ్ కలెక్టర్‌కు థ్యాంక్స్ చెబుతారు దీప, కార్తీక్. రోజూ మంచి టిఫిన్ పెడుతున్నందుకు మీకే థ్యాంక్స్ చెప్పాలయ్యా అని ఆయన చెబుతారు. ముసలోడా టైమ్‍కు వచ్చిన ప్లాన్ పాడు చేశావ్ కదా అనుకుంటూ దీంతో చిరాకుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్యోత్స్న. అసలు కంప్లైట్ ఎవరు ఇచ్చి ఉంటారని కార్తీక్ అనుకుంటాడు. ఇంతలో అక్కడి నుంచి వెళుతున్న జ్యోత్స్న కారును వెనక నుంచి చూస్తాడు. ఇదంతా జ్యోత్స్న పనేనా అని అనుమానిస్తాడు.
50 ఏళ్లు నిండిన వారిని తీసేస్తా
ప్లాన్ ఫెయిల్ అయిందని ఆఫీస్‍కు వచ్చి చిరాకుగా ఉంటుంది జ్యోత్స్న. వాళ్లను ఎలాగైనా జీరో చేసి.. కార్తీక్‍ను తన వద్దకు తెచ్చుకోవాలని అనుకుంటుంది. ఈ ప్లాన్ ఫెయిల్ అయినా.. ఇంకా ప్రయత్నిస్తానని కసిగా ఫిక్స్ అవుతుంది. ఇంతలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలని మేనేజర్ అడుగుతాడు. వేరే అకౌంట్‍లో ఉన్న డబ్బుతో జీతాలు క్లియర్ చేయాలని, వచ్చే నెల నుంచి ఒకేసారి ఇన్ని జీతాలు అంటే కుదరదని అంటుంది. అలా అయితే స్టాఫ్ అంగీకరించరని మేనేజర్ చెబుతాడు.
కంపెనీకి సీఈవో తాను అని, ప్రశ్నించే వారు కంపెనీలో ఉండేందుకు వీలు లేదని జ్యోత్స్న అంటుంది. కంపెనీలో 50 ఏళ్లు నిండిన వారు ఎంత మంది ఉన్నారని జ్యోత్స్న అడుగుతుంది. వారందరినీ ఉద్యోగం నుంచి తీస్తానని అంటుంది. వాళ్ల లిస్ట్ నోటీస్ బోర్డులో అంటించాలని చెబుతుంది. ఎవరో తన మాట వినకుంటే నేనేమైనా జోకర్‌నా అని చిరాకు పడుతుంది.
కార్తీక్ దగ్గరికి ఉద్యోగులు.. పోరాటానికి సై
ఉద్యోగం నుంచి జ్యోత్స్న తీసేసిన ఉద్యోగులు మాజీ సీఈవో అయిన కార్తీక్ ఇంటికి వస్తారు. కార్తీక్ వాళ్లు తినేందుకు కూర్చుంటే తలుపుకొడతారు. కార్తీక్ కోసం వచ్చామని దీపతో చెబుతారు. దీంతో కార్తీక్ బయటికి వచ్చి.. ఏం జరిగిందని అడుగుతాడు. తమకు అన్యాయం జరిగిపోయిందని, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మీరే న్యాయం చేస్తారని వచ్చామని మేనేజర్ అంటాడు. తనతో పాటు 50 ఏళ్లు నిండిన వారందరినీ ఉద్యోగాల నుంచి జ్యోత్స్న తీసేసిందని చెబుతాడు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం నుంచి తొలగిస్తే ఎలా బతకాలని తమ కష్టాలను కార్తీక్‍కు చెప్పుకుంటారు. వచ్చే నెలలో కూతురు పెళ్లి పెట్టుకున్నానని, ఇప్పుడు ఏం చేయాలంటూ కార్తీక్ కాళ్లు పట్టుకునేందుకు మేనేజర్ ప్రభాకర్ ప్రయత్నిస్తాడు. అతడిని కార్తీక్ ఆపేస్తాడు.
కంపెనీ ఎదుగుదల కోసం అందరం కలిసి కష్టపడ్డామని అంటాడు. మనకు హక్కు ఉందని, వినకపోతే ఎదురిద్దామని కార్తీక్ చెబుతాడు. దీంతో ఆవేశపడొద్దని దీప అంటుంది. ఏం చేయాలో తాను చెబుతానని, దాని కోసం పోరాడదామని కార్తీక్ అంటాడు. మనకు కావాల్సింది న్యాయం, ఏం చేయాలో చెబుతా అని నమ్మకం ఇస్తాడు. జ్యోత్స్న ఇలా చేస్తోందేంటని కాంచన అంటే.. సరైన దారిలో పెట్టే వారు ఎదురయ్యే వరకు ఇలాగే ఉంటుందని కార్తీక్ అంటాడు. కార్తీక్ బాబును చూస్తుంటే మళ్లీ ఏదో గొడవ జరిగేలా ఉందని దీప అంటుంది. తనకు ఓ సాయం చేస్తావా అని కాంచన అడుగుతుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 7) ఎపిసోడ్ ముగిసింది. ఉద్యోగుల కోసం జ్యోత్స్నపై కార్తీక్ పోరాటం ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లలో చూడాలి.
సంబంధిత కథనం