Best Web Hosting Provider In India 2024
NNS 7th January Episode: రామ్మూర్తికి నిజం చెప్పిన అమర్.. కూలబడిపోయిన ఆరు.. అయోమయంలో మిస్సమ్మ!
NNS 7th January Episode: నిండు నూరేళ్ల సావాసం మంగళవారం (జనవరి 7) ఎపిసోడ్లో రామ్మూర్తికి ఆరు తన కూతురే అన్న నిజం చెప్పేస్తాడు అమర్. అది చూసి ఆరు కుప్పకూలిపోతుంది. అటు అమర్ జాడ తెలియక మిస్సమ్మ అయోమయంలో పడుతుంది.
NNS 7th January Episode: జీ తెలుగు సీరియల్ నిండు నూరేళ్ల సావాసం ఈరోజు (జనవరి 7) ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నీ గతం గురించి నీవు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఇక్కడకు తీసుకొచ్చాను. నిజం తెలుసుకున్నాక నువ్వు తట్టుకునే శక్తి ఆ జగన్నాథుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటాడు గుప్త. అమర్ ఆరు ఉన్న వైపు చూస్తుంటాడు. ఆరు అనుమానంగా ఆయన నావైపే చూస్తున్నాడు. నేను ఆయనకు కనిపిస్తున్నాన్నా గుప్త గారు అని అడుగుతుంది.
రామ్మూర్తి తన తండ్రి అని తెలుసుకున్న ఆరు
ఇంతలో అమర్ అక్కడి నుంచి ఆశ్రమం లోపలికి వెళ్లిపోతాడు. వెనకాలే అందరూ వెళతారు. ఆరు ఫోటో ఎదురుగా నిలబడి మీరు కోరుకున్నట్టుగానే మీ 30 ఏళ్ల నిజం మీ ముందుకు తీసుకొచ్చాను. మీకు నిజం తెలిశాక మీరడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. కానీ ఇన్ని రోజులు నేను మీ దగ్గర ఎందుకు నిజం దాచానో.. నిజం కన్నా ఎదురుచూపులే మంచిది అని నేను ఎందుకు అనుకున్నానో మీకు ఇప్పుడు అర్థం అవుతుంది అంటూ ఆరు ఫోటో ముందు దీపం వెలిగించి సారీ ఆరు అంటాడు.
గుప్త గారు ఈయన తన కూతురు గురించి నిజం చెప్పమంటే ఆయనేంటి నాకు సారీ చెప్తున్నాడు అని ఆరు అడుగుతుంది. మాట్లాడకుండా అటు చూడు బాలిక అంటాడు. ఇంతలో అమర్ పక్కకు తప్పుకోగానే.. ఆరు ఫోటో కనిపిస్తుంది. రామ్మూర్తి అది మీ భార్య ఫోటో కదా బాబు గారు అని అడుగుతూ షాక్ అవుతాడు. ఆయన మా నాన్నా.. అని గుప్తను ఆరు అడుగుతుంది. అవునని గుప్త తలూపుతాడు. అమర్ మెల్లగా రామ్మూర్తి దగ్గరకు వస్తాడు.
రామ్మూర్తికి నిజం చెప్పిన అమర్
రామ్మూర్తి ఆరు ఫోటో దగ్గరకు వెళ్లి చూస్తుంటాడు. ఆరు కూలబడిపోయి ఏడుస్తుంది. మిస్సమ్మ అమర్ వాళ్ల కోసం వెతుకుతుంది. నిర్మల, మిస్సమ్మకు ఫోన్ చేసి అమర్ కనిపించాడా అని అడుగుతుంది. ఎక్కడా కనిపించడం లేదు అత్తయ్యా అని చెప్తుంది. ఇక్కడ ఎక్కడా లేరు ఆఫీసుకు వెళ్దామని అనుకుంటున్నాను అనగానే.. నేను అక్కడికి ఫోన్ చేశాను ఎవరూ రాలేదని చెప్పారు అని శివరాం చెప్పి.. నువ్వు ఇంటికి రా అని చెప్తాడు.
మిస్సమ్మ సరే అంటుంది. మరోవైపు ఏడుస్తూ రామ్మూర్తి.. అమర్ దగ్గరకు వచ్చి బాబు గారు ఏంటండి ఇది అని అడుగుతాడు. అవునండి నా భార్య తల్లిదండ్రులు ఎవరో కనుక్కుని తన కూతురు గురించి చెప్పి వాళ్లను ఒక్కటి చేద్దామని బయలుదేరిన నాకు ఎదురైన నిజం అండి ఇది అని అమర్ చెప్తాడు. నీ కూతురు కోసం నీ ఎదురు చూపులు తెలిశాక కూడా నీకు ఈ నిజం ఎలా చెప్పాలో తెలియలేదు.
నీ కళ్లల్లోకి చూస్తూ మీ కూతురు ఈ లోకంలో లేదని మీకు ఎలా చెప్పాలో అర్థం కాలేదండి. మీ బాధకు విముక్తి లేదు. మీ పశ్చాతాపానికి అంతం లేదని ఎలా చెప్పాలో తెలియడం లేదు. అందుకే మీకు నిజం చెప్పలేదు అంటూ అమర్ ఏడుస్తుంటాడు. రామ్మూర్తి కూడా ఏడుస్తుంటాడు. ఇదే మీరు 30 ఏళ్లుగా ఎదురు చూసిన నిజం అని అమర్ చెప్పగానే.. రామ్మూర్తి బోరున విలపిస్తాడు.
అరుంధతి అక్కడే ఉందన్న అమర్
ఆరు ఫోటోను చూస్తూ.. అమ్మా అంటూ తనను తాను తిట్టుకుంటూ బాధపడుతుంటాడు. అమర్ సైగ చేయగానే రాథోడ్ వెళ్లి ఆరును చిన్నప్పుడు దాచిన పంచె తీసుకొస్తాడు. అది అమర్ తీసుకెళ్లి రామ్మూర్తికి ఇస్తాడు. ఆ పంచె చూసిన రామ్మూర్తి మరింత ఎక్కువ ఏడుస్తాడు. మీరు ఎవరో తనకు తెలియకపోయినా.. తనను ఎందుకు వదిలేశారో తనకు అర్థం కాకపోయినా.. ఒక్కటే తను బలంగా నమ్మింది.
తన తండ్రి తన కోసం వస్తాడని.. మిమ్మల్ని నమ్మిందండి.. నమ్మకం ఉన్నచోట కోపాలు ద్వేషాలు ఎందుకు ఉంటాయి అంటాడు అమర్. మా మేడం బంగారం సార్ తనకు కీడు చేసిన వాళ్లకు కూడా మేలు చేసేది. అలాంటిది తనను కన్నతండ్రి సార్ మీరు. మీ కళ్లల్లో నీళ్లు రానిచ్చేదా..? అంటాడు రాథోడ్. ఇన్ని రోజులు నేను తండ్రిగా నేను ఓడిపోయాను అనుకున్న వాడిని బాబు.. కానీ నేను ఎప్పుడో చనిపోయాను బాబు అంటూ ఏడుస్తుంటాడు రామ్మూర్తి. మీరిలా అయిపోతారనే నేను మీకు ఈ విషయం చెప్పలేదు అంటాడు అమర్.
ఆ దేవుడు దుర్మార్గుడు సార్ .. మేడం ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన కుటుంబాన్ని చూడకుండా చేశాడు అని రాథోడ్ తిడుతుంటే.. దేవుడు ఆ పని చేయలేకపోయాడు రాథోడ్. ఆరుకు ఆ దేవుడు కూడా అంత పెద్ద శిక్ష వేయలేకపోయాడు. అందుకే నా ద్వారా తండ్రీ కూతుళ్లు ఇద్దరికీ ఒకేసారి నిజం చెప్పించాడు అని అమర్ చెప్పగానే.. అందరూ షాక్ అవుతారు. ఏంటి బాబు మీరు చెప్పేది నా కూతురు ఇక్కడ ఉందా..? అని రామ్మూర్తి అడుగుతాడు. అరుంధతే తన అక్క అని భాగీకి తెలుస్తుందా? నిజం బయటపడకుండా మనోహరి ఏం చేయబోతోంది? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు జనవరి 07న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే!
టాపిక్