Best Web Hosting Provider In India 2024
Gunde Ninda Gudi Gantalu: శాడిస్ట్‌గా మారిన సంజు – అత్తింట్లో మౌనికకు నరకం – చెల్లికి గాజులు గిఫ్ట్‌గా ఇచ్చిన బాలు
Gunde Ninda Gudi Gantalu: గుండె నిండా గుడి గంటలు జనవరి 7 ఎపిసోడ్‌లో మౌనికను సంజు టార్చర్ పెట్టినట్లు కల రావడంతో ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేస్తాడు బాలు. మౌనికను ఇప్పుడే పుట్టింటికి తీసుకొస్తానని సంజు ఇంటికి బయలుదేరబోతాడు. అతడిని ప్రభావతి, మనోజ్ అడ్డుకుంటారు.
Gunde Ninda Gudi Gantalu: మౌనిక భవిష్యత్తును తలచుకొని బాలు ఎమోషనల్ అవుతాడు. చెల్లెలి పెళ్లి విషయంలో ఎన్నో కలలు కన్నానని, అవన్నీ నాశనం అయిపోయానని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మౌనిక పెళ్లి కోసం కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులతో తయారు చేయించిన బంగారు గాజులను మీనాకు చూపిస్తాడు. సంజు తన మెడలో కట్టింది ఉరితాడు అని తెలియక భ్రమపడి నన్ను చెంపమీద కొట్టి మౌనిక వెళ్లిపోయిందని బాలు అంటాడు.
మీనా ఒడిలోనే బాలు నిద్ర…
సంజు దుర్మార్గుడు అనే నిజం తెలిసిన రోజు మౌనిక బతుకుతుందా? సంజు తన చెల్లెలిని ప్రాణాలతో ఉంచుతాడా అని బాలు కంగారుపడతాడు. నా చెల్లికి ఏం కాకూడదని బాలు అంటాడు.
మౌనికకు ఏం కాదని, తను కన్నీళ్లు పెట్టుకుంటే మీరు ఊరుకోరని నీలకంఠం, సంజులకు తెలుసునని భర్తను ఓదార్చుతుంది మీనా . చెల్లి గురించి ఆలోచిస్తూ మీనాఒడిలోనే నిద్రపోతాడు బాలు.
మౌనిక కన్నీళ్లు…
బాలుతో పాటు తన కుటుంబంపై పగతోనే సంజు తనను పెళ్లిచేసుకున్నాడనే నిజం తెలిసి మౌనిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను అత్త సువర్ణ ఓదార్చుతుంది. సంజు రివేంజ్ గురించి అత్తయ్య దగ్గర నిజం దాచిపెడుతుంది మౌనిక. బాధను గుండెల్లో దాచినంత సులభంగా కళ్లల్లో దాచుకోలేం అని చెబుతుంది. కోడలిని క్షమించమని అంటుంది.
పాతికేళ్ల క్రితం నేను నీలాగే ఈ ఇంటికి కోడలిగా వచ్చాను. భర్త, భవిష్యత్తు గురించి ఎన్నో కలలతో ఈ ఇంట్లో అడుగుపెట్టానని మౌనికతో అంటుంది సువర్ణ. సముద్రంలో దిగన తర్వాతే ఈత ఎంత కష్టామో తెలిసిందని చెబుతుంది.
పెళ్లి నీకు మేలు చేస్తుంది…
సాటి ఆడదానిగా నీ కష్టం ఏమిటో నాకు తెలుసునని, ఈ పెళ్లి నీకు మేలు చేసి ఉండకపోవచ్చు… నాకు మేలు చేసిందని మౌనికతో చెబుతుంది సువర్ణ. ఎంతో బాధ ఉన్నా నా ముందు బయటపడకుండా గుండెల్లో దాచుకుంటున్నావని, ఇంత మంచి కోడలు ఎవరికి దొరుకుతుందని, నీకు నేనున్నానని, నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పమని మౌనికకు అభయమిస్తుంది సువర్ణ. నువ్వు మనసు పెడితే సంజును మర్చకోగలవని, ఆ నమ్మకం నాకు ఉందని సువర్ణ అంటుంది.
పగతో పెళ్లి…
సంజు మారుతాడనే నమ్మకం లేదని మౌనిక అంటుంది. మా ఫ్యామిలీని బాధపెట్టడానికి పగతోనే తనను పెళ్లిచేసుకున్నాడని, సంజు దృష్టిలో ఇది పెళ్లి కాదని, అతడి ప్లాన్‌లో ఓ భాగమేనని మౌనిక ఎమోషనల్ అవుతుంది. ప్రేమతో సంజును మార్చుకోమని మౌనికకు సలహా ఇస్తుంది సువర్ణ. సంజుకు మీ అన్నయ్యల మీద తప్ప నీ మీద ఏం కోపం లేదని, ఆ కోసం తగ్గే రోజు వస్తుందని ఓదార్చుతుంది. దేవుడు నీకు అన్యాయం చేయడని, సంజు తప్పకుండా మారే రోజు వస్తుందని సువర్ణ అంటుంది.
నిజం తెలుసుకన్న సుశీల…
సుశీల తమ ఊరికి బయలుదేరుతుంది. బాలుకు చెప్పడానికి వస్తుంది. బాలు గాఢనిద్రలో ఉండటంతో మీనాకు చెప్పి బయలుదేరుతుంది. చెల్లెలిపై పిచ్చి ప్రేమలో బాలు ఇలా తయారయ్యాడని, అతడిని జాగ్రత్తగా చూసుకోమని బాలుకు చెబుతుంది.
రవిని, శృతిని తొందరలోనే ఇంటికి పిలవమని సత్యంతో అంటుంది సుశీల. తనకు వాళ్ల పెళ్లి గురించిన నిజం తెలిసిపోయిందని, పంతాలు, పట్టింపులకు పోయి పిల్లలను దూరం చేసుకోవద్దని కొడుకుతో అంటుంది సుశీల. ప్రభావతికి క్లాస్ ఇస్తుంది సుశీల. మౌనిక మీద ప్రేమతోనే బాలు పెళ్లిలో గొడవ చేశాడని, వాడిని, మీనాను ఏం అనొద్దని ప్రభావతితో అంటుంది సుశీల.
కాఫీ కప్‌లో మందు…
సంజును లేపడానికి బెడ్‌రూమ్‌కు వస్తుంది మౌనిక. కానీ తన కుటుంబం గురించి అతడు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆ పని చేయలేకపోతుంది. తాను తెచ్చిన కాఫీని టేబుల్‌పై పెట్టి వెళ్లబోతుంది. కానీ ఆమె చేయి తగిలి గ్లాస్ కిందపడిపోతుంది.
ఆ సౌండ్‌కు సంజుకు తెలివివస్తుంది. తన నిద్రను డిస్ట్రబ్ చేశావని మౌనికపై ఫైర్ అవుతాడు. నీ బోడి కాఫీ ఎవరికి కావాలి అని మౌనిక తెచ్చిన కాఫీని పారబోస్తాడు. హ్యాంగోవర్ దిగాలంటే మందు తాగాల్సిందే అని మౌనిక తెచ్చిన కప్‌లోనే మందు కలుపుకొని తాగుతాడు.భర్త శాడిజం చూసి మౌనిక షాకవుతుంది.
నరకం అంటే ఏమిటో పరిచయం చేస్తా….
ఏంటే అలా చూస్తున్నావు…మీ అన్న కూడా తాగుతాడుగా అని మౌనికతో అంటాడు సంజు. మా అన్నయ్య రోజంత పడిన కష్టాన్ని మర్చిపోవడానికి ఎప్పుడైనా తాగుతాడు అని మౌనిక ధీటుగా బదులిస్తుంది. ఎదురు సమాధానం చెబితే ఏం జరుగుతుందో నీకు తెలియదు. నరకం అంటే ఏమిటో పరిచయం చేస్తేనే నీకు ఎక్కువగా నొప్పి ఉంటుంది. అప్పుడే నాకు ఆనందంగా ఉంటుందని మౌనికతో అంటాడు సంజు.తాను తాగేసిన మందు బాటిల్స్‌ను క్లీన్ చేయమని చెబుతాడు.
మౌనిక ఇంటికి బాలు…
పెళ్లి తర్వాత మీ చెల్లిని అడ్డుపెట్టుకొని ఒక్కొక్కరిని చెడుగుడు ఆడుకుంటానని సంజు తనతో చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చి ఉలిక్కిపడి నిద్రనుంచి లేస్తాడు. నా మీద ఉన్న పగతో మౌనికకు సంజు నరకం చూపిస్తున్నాడు కావచ్చునని బాలు కంగారు పడతాడు. తాను ఇప్పుడే వెళ్లి మౌనికను మన ఇంటికి తీసుకొస్తానని బయలుదేరుతాడు.
అడ్డుకున్న ప్రభావతి…
బాలును ప్రభావతి అడ్డుకుంటుంది. నా కూతురిని ప్రశాంతంగా కాపురం చేసుకోనివ్వవా అని అంటుంది. సుఖంగా, సంతోషంగా మౌనిక ఉంటే నాకు ఏ అభ్యంతరం లేదని బాలు అంటాడు. కానీ మౌనిక అలా లేదని తల్లికి బదులిచ్చి బయలుదేరబోతాడు. నువ్వు మౌనిక విషయంలో ఎక్కువ భయపడుతున్నావని బాలును సత్యం ఆపేస్తాడు.
సంజును అనుమానించొద్దు…
మీకు సంబంధం నచ్చిందనే తలంచుకొని తాళ్లి కట్టించుకున్నదని బాలు అంటాడు. మౌనికకు ఇష్టం లేకుండానే పెళ్లి ఆపడానికి ప్రయత్నించిన నిన్ను లాగిపెట్టి ఒక్కటి కొట్టిందా అని బాలును ప్రశ్నిస్తుంది ప్రభావతి. అత్తకు సర్ధిచెప్పబోతుంది మీనా. కోడలిపై ప్రభావతి ఫైర్ అవుతుంది.
మౌనిక సంతోషంగా ఉందని, సంజును అనుమానించొద్దని ప్రభావతి అంటుంది. సంజు కుటుంబం గురించి నీకు ఏం తెలుసునని నిందలు వేస్తున్నావని మనోజ్ కూడా బాలునే తప్పు పడతాడు. నీకు ఏం తెలుసు, నువ్వు ఆ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేస్తే పెళ్లి జరిగేది కాదని మనోజ్‌పై కోప్పడుతాడు బాలు.
చావుబతుకుల్లో ఉంటే…
మాకు బాధ్యత ఉంది కాబట్టే మౌనిక భవిష్యత్తు బంగారంగా ఉంటుందని ఇలా పూలమ్మే ఇంటికి కాకుండా కోటీశ్వరుల ఇంటికి కోడలిగా పంపించామని కొడుకుతో వాదిస్తుంది ప్రభావతి. డబ్బు పిచ్చితో మౌనిక జీవితాన్ని నాశనం చేశారని, రేపు తాను చావు బతుకుల్లో ఉన్నప్పుడు అన్ని మీకే తెలుస్తాయని బాలు తల్లితో అంటాడు.
అందరూ కలిసి మభ్యపెట్టి, నిన్ను మాయ చేసి నమ్మించారని తండ్రితో చెప్పి బాధపడతాడు బాలు. ఎవరు ఏం చెప్పిన వినేది లేదని మౌనిక ఇంటికి బయలుదేరబోతాడు. మనోజ్ వచ్చి అడ్డుకుంటాడు. నాకు అడొస్తే తన్నులు తప్పవని మనోజ్‌కు బాలు వార్నింగ్ ఇస్తాడు.
చెల్లిని కలిసిన బాలు…
సంజు, మౌనికతో పాటు సువర్ణ గుడికివస్తారు. మౌనికను కలవడానికి అదే గుడికి బాలు, మీనా వస్తారు. సంజు తనను టార్చర్ పెడుతున్నాడనే నిజం తెలిస్తే బాలు అతడిని బతకనివ్వడని మౌనిక అంటుంది. నిజం దాచేస్తుంది. మౌనిక పెళ్లి కోసం కొన్న గాజులను ఆమె చేతికి తొడుగుతాడు బాలు. అక్కడితో నేటి గుండె నిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.