Stomach Pain: భోజనం చేసిన వెంటనే పొట్ట నొప్పి వస్తుంటే ఇవి కారణాలు కావచ్చు

Best Web Hosting Provider In India 2024

Stomach Pain: భోజనం చేసిన వెంటనే పొట్ట నొప్పి వస్తుంటే ఇవి కారణాలు కావచ్చు

Stomach Pain:కడుపు నొప్పి ఒక సాధారణ సమస్య, ఇది వివిధ కారణాల వల్ల కావచ్చు. కానీ ఆహారం తిన్న వెంటనే ఇది జరగడం ఆందోళన కలిగిస్తుంది. ఆహారం తిన్న వెంటనే కడుపునొప్పి రావడానికి కారణాలు ఇక్కడ ఉన్నాయి.

పొట్ట నొప్పికి కారణాలు
పొట్ట నొప్పికి కారణాలు
 

కడుపునొప్పి ఏదో ఒక సందర్భంలో అందరూ అనుభవించే సమస్యే. ఇది ఒక సాధారణ సమస్యలా కనిపిస్తున్నప్పటికీ ఆ నొప్పిని భరించడం మాత్రం చాలా కష్టం. కొందరికి భోజనం చేశాక, లేదా ఏదైనా తిన్న వెంటనే విపరీతంగా పొట్ట నొప్పి వచ్చేస్తుంది. ఒక వ్యక్తికి ఆహారం తిన్న వెంటనే పొట్ట నొప్పి వస్తూ ఉంటే… అలా రావడానికి కారణాలేంటో తెలసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం తిన్న తర్వాత కొన్నిసార్లు తేలికపాటి నొప్పి రావడం సాధారణం అయినప్పటికీ, ఇది పదేపదే జరిగితే అది ఏదైనా సమస్య వల్ల కావచ్చు. తిన్న తర్వాత కడుపు నొప్పి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

తిన్న తర్వాత కడుపు నొప్పి ఎందుకు వస్తుంది?

చెడు ఫుడ్ కాంబినేషన్: కొన్ని సార్లు సరిపడని రెండు ఆహారాలను కలిపి తినడం వల్ల పొట్ట నొప్పి రావచ్చు. దీన్నే బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ అంటారు. అలాంటి ఆహారాలు పొట్టలో చేరాక కడుపు నొప్పికి, తిమ్మిరికి, అసౌకర్యానికి కారణం అవుతుంది.

అజీర్ణం – ఆహారం తిన్న తర్వాత కడుపు నొప్పి అజీర్ణం వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది. భోజనం చేసేటప్పుడు వేగంగా తినడం లేదా అధిక కొవ్వు, చక్కెర, కారంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల పొట్టనొప్పి వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా, అధికంగా ఆల్కహాల్ లేదా కెఫిన్, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నా కూడా ఇలా పొట్ట నొప్పి వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల మందులు వాడే వారిలో కూడా ఈ సమస్య కనిపిస్తుంది.

ఆహార అలెర్జీలు – చాలా మందికి కొన్ని ఆహార పదార్థాల వల్ల అలెర్జీ వస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు వంటి నిరంతర జీర్ణశయాంతర లక్షణాలను కలిగిస్తుంది. గుడ్లు, వేరుశెనగ, షెల్ఫిష్, పాలు, సోయా, గోధుమ వంటి కొన్ని పదార్థాలు తిన్న తర్వాత కడుపునొప్పి సమస్య ఉండవచ్చు. ఒక్కసారి పొట్ట నొప్పి వచ్చినప్పుడు మీరు ఏం తిన్నారో గుర్తుకుతెచ్చుకోవాలి. వాటిని తక్కువగా తినేందుకు ప్రయత్నించండి.

 

అతిగా తినడం – కొంతమంది ఆకలిగా ఉన్నప్పుడు ఎక్కువగా తినడం, తిన్న వెంటనే పుష్కలంగా నీరు త్రాగటం వంటివి చేస్తారు. దీన్ని వల్ల కూడా కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంది. తిన్న తర్వాత కడుపు నొప్పికి ఇది చాలా సాధారణ కారణం. ఎక్కువ మందిలో ఇలా పొట్ట నొప్పి వస్తూ ఉంటుంది. ఎక్కువ ఆహారం తినేటప్పుడు, అదనపు ఆహారానికి చోటు కల్పించడానికి పొట్ట తనను తాను సాగదీయాల్సి ఉంటుంది. ఇది కడుపు నొప్పిని కలిగిస్తుంది.

ఫుడ్ పాయిజనింగ్ – ఫుడ్ పాయిజనింగ్ కూడా కడుపు నొప్పికి కారణమవుతుంది. ఈ సమస్యలో వాంతులు, విరేచనాలు, శక్తి లేకపోవడం, అధిక శరీర ఉష్ణోగ్రత వంటి లక్షణాలు కనిపిస్తాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024