Vizianagaram Crime: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం.. మద్యం మత్తులో స్నేహితుడి పొడిచి చంపిన యువకుడు

Best Web Hosting Provider In India 2024

Vizianagaram Crime: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాదం.. మద్యం మత్తులో స్నేహితుడి పొడిచి చంపిన యువకుడ

Vizianagaram Crime: విజ‌య‌న‌గ‌రం జిల్లాలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. మ‌ద్యం తాగుతూ ప‌ని డ‌బ్బులు గురించి ఇద్ద‌రు స్నేహితుల మ‌ధ్య వివాదం చెల‌రేగింది. ఈ క్ర‌మంలో వివాదం మ‌రింత ముదిరింది. దీంతో మ‌ద్యం మ‌త్తులో ఉన్న యువ‌కుడు త‌న స్నేహితుడిని ఇన‌ప చువ్వ‌తో ప‌లుమార్లు పొడిచి హత్య చేశాడు.

మద్యం మత్తులో యువకుడి హత్య

Vizianagaram Crime: మద్యం మత్తులో స్నేహితుడిని ఇనుప చువ్వతో పొడిచి చంపిన ఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. విజ‌య‌న‌గం జిల్లాలోని పూస‌పాటిరేగ మండ‌లం ఎరుకొండ‌లో చోటుచేసుకుంది. ఎస్ఐ దుర్గాప్ర‌సాద్‌ తెలిపిన వివరాల ప్ర‌కారం ర‌ణ‌స్థ‌లం మండ‌లం గొర్లెపేట‌కు చెందిన గొర్లె బంగార‌మ్మ భ‌ర్త‌తో గొడ‌వ‌ప‌డి కొన్నేళ్లే క్రితం పుట్టిళ్లైనా విజ‌య‌నగ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం ఎరుకొండ గ్రామం వ‌చ్చేసింది.

 

ఆమెకు కుమారుడు ప‌వ‌న్‌కుమార్ ఉన్నాడు. 21 ఏళ్ల ప‌వ‌న్ కుమార్ డిగ్రీ వ‌ర‌కు చ‌దువుకున్నాడు. ఎరుకొండ గ్రామానికే చెందిన బి. అప్ప‌లనాయుడుతో ప‌వ‌న్ కుమార్‌కు స్నేహం ఏర్ప‌డింది. ఇద్ద‌రూ మ‌ద్యం వ్య‌స‌నానికి బానిస‌లై గ్రామంలో జ‌రిగే వివాదాల్లో త‌ల‌దూర్చేవారు.

పెయింటింగ్ ప‌నుల‌కు వెళ్తూ ప‌ని ముగిసిన తరువాత‌, సాయంత్రం మ‌ద్యం తాగి ఇంటికి వ‌చ్చేవారు. ఇద్ద‌రూ ప్ర‌తి రోజూ ఇలానా చేసేవారు. ఎప్ప‌టి లాగే ఆదివారం ప‌నికి వెళ్లి, సాయంత్రం తిరిగి ఇంటికి వ‌చ్చే స‌మ‌యంలో కొత్త కొప్పెర్ల గ్రామం వ‌ద్ద మ‌ద్యం దుకాణంలో మ‌ద్యం సేవించారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు మ‌ధ్య కూలి డ‌బ్బుల‌కు సంబంధించి వివాదం నెల‌కొంది. ఇద్ద‌రూ వాదులాటకు దిగారు. దీంతో స్థానికులు జోక్యం చేసుకుని విడిపించి, వారిని అక్క‌డి నుంచి పంపించేశారు. వీరిద్ద‌రూ ఎరుకొండ చేరుకున్నారు.

అక్క‌డికి వెళ్లిన త‌రువాత మ‌ళ్లీ ఇద్ద‌రూ క‌లిసే మ‌ద్యం సేవించారు. అక్క‌డ కూడా ఇద్ద‌రి మ‌ళ్లీ కూలీ డ‌బ్బుల గురించే వివాదం నెల‌కొంది. దీంతో ప‌వ‌న్ కుమార్ న‌డుచుకుంటూ ఇంటి ముందుకు వ‌చ్చేశాడు. అయితే ఫుల్‌గా మ‌ద్యం తాగి మ‌త్తులో ఉన్న అప్ప‌లనాయుడు ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెనుక నుంచి వ‌చ్చి, ప‌వ‌న్ కుమార్‌ను ఇనుప చువ్వ‌తో విచ‌క్ష‌ణార‌హితంగా పొడిచాడు. వెంట‌నే ప‌వ‌న్ కుమార్‌ త‌ల్లి ఇంటిల్లోంచి వ‌చ్చి అడ్డుకునే ప్ర‌య‌త్నం చేసింది. అయిన‌ప్ప‌టికీ నిందితుడు అప్ప‌లనాయుడు ఆగ‌కుండా దారుణంగా పొడిచాడు.

 

అటువైపు వ‌స్తున్న ఇద్ద‌రు వ్యక్తులు విడిపించే ప్ర‌య‌త్నం చేయ‌డంతో అప్ప‌ల‌నాయుడు ప‌రార‌య్యాడు. త‌న కుమారుడిని కాపాడాలంటూ త‌ల్లి వేడుకున్నా ఎవ‌రూ ముంద‌కు రాలేదు. దీంతో కొద్ది సేప‌టికే త‌ల్లి ఒడిలోనే ప‌వ‌న్ కుమార్ మృతి చెందాడు. దీంతో త‌ల్లి త‌ల్ల‌డిల్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

సోమ‌వారం సీఐ రామ‌కృష్ణ మాట్లాడుతూ ఈ ఘ‌ట‌న రాత్రి 11.30 గంట‌ల స‌మ‌యంలో జ‌రిగి ఉంటుంద‌ని అన్నారు. కేసు న‌మోదు చేశామ‌ని, నిందితుడిని కూడా ప‌ట్టుకున్నామ‌ని తెలిపారు. ద‌ర్యాప్తు అనంతరం త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని అన్నారు. పోస్టుమార్టం అనంత‌రం మృత దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు ఇచ్చారు. కుటుంబ స‌భ్యులు క‌న్నీరు మున్నీరు అయ్యారు. ఈ హ‌త్య‌ ఘ‌ట‌న‌తో ఎరుకొండ గ్రామంలో క‌ల‌క‌లం రేగింది.

(జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner
 

టాపిక్

 
VizianagaramCrime Ap
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024