Best Web Hosting Provider In India 2024
Marco Collections: 2025లో టాలీవుడ్లో ఫస్ట్ హిట్ డబ్బింగ్ సినిమాదే – మలయాళ హీరో బోణీ- మార్కో తెలుగు వెర్షన్‌కు డబు
Marco Collections: 2025లో టాలీవుడ్ ఫస్ట్ హిట్‌గా మలయాళ డబ్బింగ్ మూవీ మార్కో నిలిచింది. జనవరి 1న థియేటర్లలో రిలీజైన ఈయాక్షన్ మూవీ ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఉన్ని ముకుందన్ హీరోగా నటించిన మార్కో మూవీకి వచ్చిన మొత్తం కలెక్షన్స్ ఎంతంటే?
Marco Collections: 2025లో టాలీవుడ్‌కు ఫస్ట్ హిట్ వచ్చేసింది. అయితే ఈ సారి స్ట్రెయిట్ మూవీ కాకుండా డబ్బింగ్ మూవీ బోణీ కొట్టింది. మార్కో మూవీ 2025లో టాలీవుడ్ ఫస్ట్ హిట్‌గా నిలిచింది. జనవరి 1న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కేవలం ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది.
ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్…
మార్కో మూవీ తెలుగు వెర్షన్ రెండు కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిరోజే కోటి డెబ్బై ఐదు లక్షల వరకు కలెక్షన్స్ రాబట్టింది. మలయాళ డబ్బింగ్ మూవీస్‌లో హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా నిలిచింది. ఆదివారం నాటికే నాలుగున్నర కోట్ల గ్రాస్‌ను, రెండున్నర కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను సాధించింది.
సోమవారం రోజు మరో యాభై లక్షల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. మొత్తంగా ఆరు రోజుల్లో ఐదు కోట్లకుపైగా గ్రాస్‌ను, రెండు కోట్లఎనభై లక్షల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మలయాళ వెర్షన్ యాభై లక్షల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నట్లు తెలిసింది.
మలయాళంలో వంద కోట్లు…
మలయాళంలో ఈ మూవీ వంద కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళ సినీ చరిత్రలో ఏ రేటింగ్‌తో వచ్చి హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా ఉన్ని ముకుందన్ కెరీర్లో వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన తొలి సినిమాగా నిలిచింది.
వయలెన్స్ పీక్స్…
మార్కో మూవీలో ఉన్ని ముకుందన్ హీరోగా నటించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈమూవీకి హనీఫ్ అదేని దర్శకత్వం వహించాడు. మితిమీరిన హింస, రక్తపాతంతో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. ఈ సినిమాను చిన్నపిల్లలు, గుండెజబ్బులు ఉన్నవారితో పాటుమహిళలు చూడొద్దంటూ మేకర్స్ కూడా అనౌన్స్‌చేశారు. ఇండియన్ స్క్రీన్‌పై ఇంతటి వయలెన్స్‌తో కూడిన మూవీ ఇప్పటివరకు రాలేదంటూ ఆడియెన్స్ కూడా చెబుతోన్నారు.
మార్కో మూవీ కథ ఇదే…
రివేంజ్ డ్రామాగా మార్కో మూవీ తెరకెక్కింది. కొచ్చిన్‌లోని గోల్డ్ సిండికేట్ లీడర్ జార్జ్ (సిద్ధిఖీ) తమ్ముడు విక్టర్ (ఇషాన్)అంధుడు. విక్టర్‌ను కొందరు దారుణంగా చంపేస్తారు. విక్టర్‌ను చంపిన వాళ్లపై మార్కో పగతో రలిగిపోతాడు.
ఆ హంతకులను మార్కో ఎలా కనిపెట్టాడు? ఈ హత్యకు టోనీ ఇసాక్, రసెల్ ఇసాక్‌కు ఉన్న సంబంధం ఏమిటి? మార్కో రివేంజ్ కారణంగా జార్జ్ ఫ్యామిలీకి ఎలాంటి నష్టం జరిగింది? అన్నదే ఈ మూవీ కథ.
భాగమతి, యశోద..
మార్కో మూవీకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. ఉన్ని ముకుందన్ తెలుగులో జనతా గ్యారేజ్, యశోదతో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు.