OTT Top Releases: ఈ వారం ఓటీటీల్లో ముఖ్యమైన 5 రిలీజ్‍లు.. ఓ తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్.. యథార్థ ఘటనలపై ఓ చిత్రం

Best Web Hosting Provider In India 2024

OTT Top Releases: ఈ వారం ఓటీటీల్లో ముఖ్యమైన 5 రిలీజ్‍లు.. ఓ తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్.. యథార్థ ఘటనలపై ఓ చిత్రం

OTT Top 5 Releases This Week: ఈ వారం ఓటీటీల్లో కొన్ని ఇంట్రెస్టింగ్ రిలీజ్‍లు ఉన్నాయి. గోద్రా రైలు దగ్ధంపై రూపొందిన చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ తెలుగు మూవీ నేరుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది.

OTT Top Releases: ఈ వారం ఓటీటీల్లో ముఖ్యమైన 5 రిలీజ్‍లు.. ఓ తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్.. యథార్థ ఘటనలపై ఓ చిత్రం
OTT Top Releases: ఈ వారం ఓటీటీల్లో ముఖ్యమైన 5 రిలీజ్‍లు.. ఓ తెలుగు మూవీ నేరుగా స్ట్రీమింగ్.. యథార్థ ఘటనలపై ఓ చిత్రం
 

జనవరి రెండో వారంలోనూ ఓటీటీల్లోకి కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్‍లు ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాయి. ఓటీటీ రిలీజ్‍ల కోసం వేచిచూసే వారిని అలరించేందుకు అడుగుపెట్టనున్నాయి. ఇందులో ఐదు రిలీజ్‍లు ఆసక్తికరంగా ఉన్నాయి. ది సబర్మతి ఎక్స్‌ప్రెస్ చిత్రం ఈ వారంలోనే ఓటీటీలోకి రానుంది. ఓ తెలుగు రొమాంటిక్ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. అన్‍స్టాపబుల్ షోలోనూ చాలా మంది ఎదురుచూస్తున్న ఎపిసోడ్ రానుంది. ఈ వారం ఓటీటీల్లో టాప్-5 రిలీజ్‍లు ఏవో ఇక్కడ చూడండి.

ది సబర్మతి రిపోర్ట్

ది సబర్మతి రిపోర్ట్ చిత్రం ఈ వారం జనవరి 10వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. 2002లో జరిగిన గోద్రా రైలు దగ్ధం ఘటనపై ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాలో విక్రాంత్ మాసే, రిధి డోగ్రా ప్రధాన పాత్రలు పోషించారు. ధీరజ్ శర్న ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నవంబర్ 15న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత భారత పార్లమెంట్‍లో ది సబర్మతి రిపోర్ట్ చిత్రాన్ని స్క్రీనింగ్ చేయగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కూడా చూశారు.

నీలి మేఘశ్యామ

నీలి మేఘశ్యామ చిత్రం నేరుగా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. జనవరి 9న ఈ తెలుగు రొమాంటిక్ డ్రామా మూవీ ఆహాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రంలో విశ్వదేవ్ రాచకొండ, పాయల్ రాధాకృష్ణ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి రవి ఎస్ వర్మ దర్శకత్వం వహించగా.. శరణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. నీలి మేఘశ్యామ చిత్రాన్ని వాల్తేర్ ప్రొడక్షన్స్, మూన్‍షైన్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకాలపై కౌశిక్ సత్య నిర్మించారు. ఈ చిత్రాన్ని జనవరి 9 నుంచి ఆహాలో చూసేయవచ్చు.

 

బ్లాక్ వారెంట్

బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్ జనవరి 10వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వస్తుంది. ఈ థ్రిల్లర్ సిరీస్‍లో జాహన్ కపూర్, రాహుల్ భట్, పరమ్‍వీర్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు. విక్రమాదిత్య మోత్వానే, సత్యాన్షు సింగ్ ఈ సిరీస్‍కు క్రియేటర్లుగా ఉన్నారు. తీహార్ జైలులో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ఓ పోలీస్ ఆఫీసర్ ప్రయత్నించడం చుట్టూ ఈ డార్క్ థ్రిల్లర్ సిరీస్ సాగుతుంది. జనవరి 10న నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి బ్లాక్ వారెంట్ అడుగుపెట్టనుంది.

అన్‍స్టాపబుల్ 4 – రామ్‍చరణ్ ఎపిసోడ్

నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో అన్‍స్టాపబుల్ 4కు మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ వచ్చారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ షోలో గెస్టుగా చెర్రీ పాల్గొన్నారు. ఇటీవలే ఈ ఎపిసోడ్ ప్రోమో వచ్చింది. సరదాగా, ఫుల్ ఫన్‍తో ఈ ప్రోమో సాగింది. దీంతో ఈ ఎపిసోడ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. రామ్‍చరణ్ హాజరైన ఈ అన్‍స్టాపబుల్ 4 షో ఎపిసోడ్ ఈ వారమే జనవరి 8వ తేదీన సాయంత్రం 7 గంటలకు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.

 

ది బ్రేక్‍త్రూ

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ది బ్రేక్‍త్రూ’.. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేడు స్ట్రీమింగ్‍కు వచ్చేసింది. ఈ సిరీస్‍లో పీటర్ ఎగ్గెర్స్, మాటియాస్ నోర్డ్ క్విస్ట్, జెస్సికా లీడ్‍బెర్గ్ ప్రధాన పాత్రలు పోషించారు.

 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024