KTR Petition: హైకోర్టులో ఎదురు దెబ్బ.. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

Best Web Hosting Provider In India 2024

KTR Petition: హైకోర్టులో ఎదురు దెబ్బ.. కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేసిన హైకోర్టు

KTR Petition: ఫార్ములా ఈ కారు రేసు విషయంలో నమోదైన అభియోగాలను కొట్టి వేయాలంటూ కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ ‌ను తెలంగాణ హైకోర్టు తిరస్కరించింది. ఏసీబీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం కేటీఆర్ అభ్యర్థనను తిరస్కరించింది.

తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు
 

KTR Petition: తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు చుక్కెదురైంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌ నిర్వహణలో అక్రమ నగదు చెల్లింపులపై నమోదైన కేసుల్ని కొట్టి వేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్‌ పిటిషన్‌పై గత వారమే విచారణ పూర్తైంది. తర్వాత

 

కేటీఆర్‌ ఈ కార్ రేసింగ్‌ వ్యవహారంలో కేటీఆర్‌ పాత్ర ఉందని కోర్టు అభిప్రాయ పడింది. కేటీఆర్‌ అభ్యర్థనను తిరస్కరించింది. ఏసీబీ వాదనలకు హైకోర్టు మొగ్గు చూపింది. ప్రజా ప్రతినిధిగా తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడ లేదని కేటీఆర్‌ వాదనలు వినిపించారు. అయితే ఫెమా నిబంధనలు ఉల్లంఘించి జరిపిన చెల్లింపులతో ఐటీ శాఖకు దాదాపు రూ.8కోట్ల నష్టం వాటిల్లిందని ఏసీబీ హైకోర్టులో వాదించింది. హెచ్‌ఎండిఏ ఛైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆర్థిక శాఖ అమోదం లేకుండా నిధులు చెల్లించారని ఏసీబీ తరపున వాదించారు. కేటీఆర్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి గ్రీన్‌ కో సంస్థకు చెల్లించిన రూ.47కోట్ల అంశం తెరపైకి వచ్చింది. ఎఫ్‌ఈఓకు నిధుల చెల్లింపులో అక్రమాలు జరిగాయని ఏసీబీ ఆరోపించింది.

మునిసిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్‌‌తో పాటు అప్పటి మునిసిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. తాజాగా హైకోర్టు నిర్ణ‍ంతో ఏసీబీ ఎలా వ్యవహరిస్తుందనేది కీలకంగా మారింది. మరోవైపు నేడు ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉండగా కోర్టు తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని కేటీఆర్‌ లేఖ రాశారు.

 

అక్రమ చెల్లింపులపై ఈడీ కేసు నమోదు…

హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయంలో జరిగిన ఫార్ములా ఈ కార్‌ రేస్ నిర్వహణలో భాగంగా యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ సంస్థకు రూ.45.71 కోట్లను తెలంగాణ మునిసిపల్ శాఖ ద్వారా హెచ్‌ఎండిఏ చెల్లించింది. ఈ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయని హెచ్‌ఎండిఏ ముఖ‌్య కార్యదర్శి దానకిశోర్‌ ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

ఆర్థిక శాఖ అమోదం లేకుండా, హెచ్‌ఎండిఏ ఛైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రికి తెలియకుండా, ఆర్‌బిఐ అనుమతి లేకుండా చెల్లింపులు చేయడంపై విచారణ జరపాలని ఏసీబీకి ఫిర్యాదు చేశారు.

లండన్‌లో ఉన్న ఫార్ములా ఈ ఆపరేషన్స్‌ ఖాతాకు బ్రిటన్ కరెన్సీలో నగదు బదిలీ చేశారని, ఇందులో ఆదాయ పన్నుమినహాయించకపోవడం వల్ల ఐటీ శాఖకు రూ.8.06కోట్లను చెల్లించాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారాలపై దర్యాప్తు చేయాలని ఏసీబీని కోరారు. ఈ వ్యవహారంలోనే కేటీఆర్‌, అర్వింద్‌ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలపై కేసులు నమోదు చేశారు. విదేశాలకు నగదు చెల్లింపుల్లో ఫెమా నిబంధనలు ఉల్లంఘించడంతో ఆ లబ్ది ఎవరికి చేకూరిందో తేలాల్సి ఉంది. ఈ కేసుల్లో కేటీఆర్‌ క్వాష్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించడంతో ఏమి జరుగుతుందో అన్నది ఉత్కంఠగా మారింది.

Whats_app_banner
 

టాపిక్

 
High Court TsTelangana NewsBrsKtr
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024