RGV: మళ్లీ థియేటర్లలోకి ఆర్జీవీ కల్ట్ క్లాసిక్ మూవీ.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..

Best Web Hosting Provider In India 2024

RGV: మళ్లీ థియేటర్లలోకి ఆర్జీవీ కల్ట్ క్లాసిక్ మూవీ.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..

Satya Re Release: సత్య సినిమా మళ్లీ థియేటర్లలోకి వచ్చేస్తోంది. 27 ఏళ్ల తర్వాత రీ-రిలీజ్ కానుంది. రామ్‍గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కల్ట్ క్లాసిక్‍గా నిలిచింది.

RGV: మళ్లీ థియేటర్లలోకి ఆర్జీవీ కల్ట్ క్లాసిక్ మూవీ.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..
RGV: మళ్లీ థియేటర్లలోకి ఆర్జీవీ కల్ట్ క్లాసిక్ మూవీ.. రీ-రిలీజ్ ఎప్పుడంటే..
 

స్టార్ డైరెక్టర్ రామ్‍గోపాల్ వర్మ (ఆర్జీవీ) ఒకప్పుడు తన టేకింగ్, ఫిల్మ్ మేకింగ్‍తో సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. కొత్తదనంతో చిత్రాలు తెరకెక్కించి బ్లాక్‍బస్టర్లు కొట్టారు. అప్పట్లోనే దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. బాలీవుడ్‍లో ఆర్జీవీ తెరకెక్కించిన కొన్ని చిత్రాలు కల్ట్ క్లాసిక్‍లుగా నిలిచాయి. అలాంటి సినిమానే ‘సత్య’. 1998లో రిలీజైన ఈ గ్యాంగ్‍స్టర్స్ క్రైమ్ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. పెద్ద స్టార్స్ ఎవరూ లేకున్నా ఈ చిత్రం బ్లాక్‍బస్టర్ కొట్టింది. క్లాసిక్ స్టేటస్ తెచ్చుకుంది. ఆర్జీవీ సత్తాను మరోసారి చాటింది. ఇప్పుడు సత్య చిత్రం మరోసారి థియేటర్లలోకి వస్తోంది.

రీ-రిలీజ్ డేట్ ఇదే

సత్య సినిమా జనవరి 17వ తేదీన థియేటర్లలో రీ-రిలీజ్ కానుంది. సుమారు 27 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదలవుతోంది. దీంతో ఈ మూవీ ఎలా పర్ఫార్మ్ చేస్తుందోననే ఆసక్తి విపరీతంగా నెలకొంది.

ముంబై అండర్‌వరల్డ్ చుట్టూ..

సత్య సినిమాను పక్కా క్రైమ్ డ్రామా మూవీగా రామ్‍గోపాల్ వర్మ తెరకెక్కించారు. ముంబై మాఫియా అండర్‌వరల్డ్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి, మనోజ్ బాజ్‍పేయ్, ఊర్మిళ మతోంద్కర్, పరేశ్ రావల్ ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో పెద్దగా స్టార్ డమ్ లేని వారిని పెట్టి బ్లాక్‍బస్టర్ కొట్టారు ఆర్జీవీ. అది కూడా క్లాసిక్‍గా నిలిచే రేంజ్‍లో తెరకెక్కించారు. ఈ చిత్రానికి సౌరభ్ శుక్లా, అనురాగ్ కశ్యప్ కథ అందించగా.. ఆర్జీవీ తెరకెక్కించారు.

సత్య చిత్రానికి ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి గాను ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్‌గా మనోజ్ బాజ్‍పేయ్‍కి నేషనల్ అవార్డు దక్కింది. సత్య సినిమా గురించి, ఆర్జీవీ టాలెంట్ గురించి మనోజ్ చాలా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఆయన ఈ చిత్రం గురించి ప్రస్తావిస్తుంటారు.

 

సత్య సినిమాను రామ్‍గోపాల్ వర్మనే నిర్మించారు. అప్పట్లో రూ.2.5కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందింది. మొత్తంగా రూ.15కోట్ల కలెక్షన్లు రాబట్టి కమర్షియల్‍గా బ్లాక్‍బస్టర్ కొట్టింది. అండర్‌వరల్డ్ గ్యాంగ్‍స్టర్ జానర్‌లో కల్ట్ క్లాసిక్‍గా నిలిచింది. ఆర్జీవీ టేకింగ్, బ్రిలియన్స్‌కు మరోసారి భారీ ప్రశంసలు దక్కాయి.

సత్య మూవీకి విశాల్ భరద్వాజ్, సందీప్ చౌతా సంగీతం అందించగా.. గెలార్డ్ హూపర్, మజర్ కమ్రాన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ మూవీలో కెమెరా యాంగిల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. స్క్రీన్‍ప్లే కూడా ప్రశంసలు దక్కించుకుంది.

సత్య స్టోరీలైన్

సత్య (జేడీ చక్రవర్తి) ముంబైలోని ఓ బార్‌లో పని చేసేందుకు వస్తాడు. గ్యాంగ్‍స్టర్ భికూ మాత్రే (మనోజ్ బాజ్‍పేయ్)ను పరిచయం అవుతాడు. ఆ తర్వాత అతడు ముంబై క్రిమినల్ అండర్‌వరల్డ్‌లోకి అడుగుపెడతాడు. ఆ తర్వాత పరిస్థితులు ఎలా మారాయి.. ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనే విషయాల చుట్టూ సత్య మూవీ సాగుతుంది. ఈ చిత్రాన్ని జనవరి 19న మరోసారి థియేటర్లలో చూసేయవచ్చు.

రణ్‍బీర్ కపూర్, దీపికా పదుకొణ్ హీరోహీరోయిన్లుగా నటించిన యే జవానీ హై దీవానీ చిత్రం ఈనెలలోనే థియేటర్లలో రీ-రిలీజ్ అయింది. మంచి కలెక్షన్లను దక్కించుకుంది. సత్య ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

Whats_app_banner
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024