Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో 107 రేషన్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

Best Web Hosting Provider In India 2024

Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో 107 రేషన్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి

HT Telugu Desk HT Telugu Jan 07, 2025 05:07 PM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
HT Telugu Desk HT Telugu
Jan 07, 2025 05:07 PM IST

Srikakulam Ration Dealer Jobs : శ్రీకాకుళం జిల్లాలో రేషన్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 107 పోస్టులను భర్తీ చేయనున్నారు. రెవెన్యూ డివిజ‌న్ కార్యాల‌యంలో ఆఫ్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను సమర్పించాల్సి ఉంటుంది.

శ్రీకాకుళం జిల్లాలో 107 రేషన్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి
శ్రీకాకుళం జిల్లాలో 107 రేషన్ డీల‌ర్ పోస్టుల‌కు భ‌ర్తీకి నోటిఫికేష‌న్, ఇలా ద‌ర‌ఖాస్తు చేసుకోండి
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Srikakulam Ration Dealer Jobs : ఆంధ్రప్రదేశ్‌లో రేష‌న్ డీల‌ర్ల నియామ‌కానికి సంబంధించి ఖాళీల‌ను భ‌ర్తీ చేయడానికి నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. శాశ్వత ప్రాతిప‌దిక శ్రీకాకుళం జిల్లాలో 107 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ద‌ర‌ఖాస్తులు శ్రీకాకుళం రెవెన్యూ డివిజ‌న్ కార్యాల‌యం, మండ‌ల తహ‌శీల్దార్ కార్యాల‌యాల్లోనూ, సచివాలయాల్లోనూ అందుబాటులో ఉంటాయి. ద‌ర‌ఖాస్తుల‌ను రెవెన్యూ డివిజ‌న్ కార్యాల‌యంలో ఆఫ్‌లైన్‌లోనే చేసుకోవాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు జ‌న‌వ‌రి 23 ఆఖ‌రు తేదీగా నిర్ణయించారు. రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూలు ద్వారా ఎంపిక ఉంటుంది.

yearly horoscope entry point

ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు?

శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం రెవెన్యూ డివిజ‌న్‌లో 107 పోస్టులను భర్తీ చేస్తున్నారు. అందులో శ్రీకాకుళం మండలంలో 14, సరుబుజ్జిలిలో 4, రణస్థలం 10, పొందురు 16, పోలంకి 12, నరసన్నపేట 12, లవేరు 15, జలుమూరు 3, జి.సిగడం 5, ఎచ్చెర్ల 5, బూర్జ 3, ఆమ‌దాల‌వ‌ల‌స 8 రేష‌న్ డీల‌ర్ల పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

విద్యా అర్హత‌…వ‌యో ప‌రిమితి

రేష‌న్ డీల‌ర్ల పోస్టులను భ‌ర్తీ చేయ‌డానికి ఇంట‌ర్మీడియ‌ట్ విద్యా అర్హత‌ను నిర్ణయించారు. అయితే ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసిన వారు లేక‌పోతే, ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన అభ్యర్థులు ఉన్నా ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిగ‌ణిస్తారు. అలాగే వ‌య‌స్సు 18 నుంచి 40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. రిజ‌ర్డ్వ్ కేట‌గిరీకి చెందిన అభ్యర్థుల‌కు ప్రభుత్వ నిర్ణయించిన మిన‌హాయింపు ఉంటుంది. డీల‌ర్ పోస్టుకు, దుకాణానికి ద‌ర‌ఖాస్తు చేసే అభ్య‌ర్థులు సొంత గ్రామానికి చెందిన వారై ఉండాలి. ఎటువంటి పోలీసు కేసులు ఉండ‌కూడ‌దు. చ‌దువుతున్నవారు, విద్యా వ‌లంటీర్లు, ఏఎన్ఎంలు, కాంట్రాక్టు ఉద్యోగులుగా ప‌ని చేస్తున్నవారు, ఆశ కార్యక్తలు ద‌ర‌ఖాస్తు దాఖ‌ల‌కు అన‌ర్హులు. ఆర్థిక స్థోమ‌త వివ‌రాలు తెలుపుతూ స్వీయ డిక్లరేష‌న్‌, స‌ర్టిఫికేట్ స‌మ‌ర్పించాలి. ద‌ర‌ఖాస్తుదారుల కుంటుబ స‌భ్యులు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులై ఉండ‌రాదు.

అభ్యర్థుల ఎంపిక షెడ్యూల్

అభ్యర్థులు జ‌న‌వ‌రి 23 తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జ‌న‌వ‌రి 24 తేదీన ద‌ర‌ఖాస్తుల ప‌రిశీలించ‌నున్నారు. అదే రోజు అర్హులైన వారి జాబితా ప్రక‌టిస్తారు. ఎంపికైన వారికి ఫిబ్రవ‌రి 2న‌ రాత ప‌రీక్ష నిర్వహిస్తారు. రాత ప‌రీక్షకు సంబంధించి హాల్ టికెట్స్ జ‌న‌వ‌రి 31న జారీ చేస్తారు. ఫిబ్రవరి 4న రాత ప‌రీక్షల ఫ‌లితాలు వెల్లడిస్తారు. ప‌రీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. రాత ప‌రీక్షలో ఆయా ప్రాంతాల‌కు చెందిన అత్య‌ధిక మార్కులు సాధించిన ఐదుగురు అభ్యర్థుల‌కు ఫిబ్రవ‌రి 9న ఆర్డీవో కార్యాల‌యంలో ఇంట‌ర్వ్యూలు నిర్వహిస్తారు. ఫిబ్రవ‌రి 10న ఎంపికైన వారి తుది జాబితాను విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది.

రాత ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ

రాత ప‌రీక్ష‌, ఇంట‌ర్వ్యూకు వేర్వేరుగా మార్కులు ఉంటాయి. మొత్తం 100 మ‌ర్కులు ఉండ‌గా, అందులో రాత ప‌రీక్ష‌కు 80 మార్కులు ఉంటాయి. ఇంట‌ర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి. రాత పరీక్ష నుంచి ఇంట‌ర్వ్యూకు 1:15 నిష్ప‌త్తిలో ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు

ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.600 ఉంటుంది. ఫీజును రెవెన్యూ డివిజ‌నల్ అధికారి, శ్రీకాకుళం పేరుతో డీడీ తీయాలి.

ద‌ర‌ఖాస్తుతో పాటు జ‌త చేయాల్సిన ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు

1. ఇంట‌ర్మీడియ‌ట్‌, ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణత స‌ర్టిఫికెట్లు

2,. వ‌య‌స్సు ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

3. నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం (ఓట‌రు కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైనా ప‌ర్వాలేదు)

4. మూడు పాస్‌పోట్ సైజ్ ఫొటోలు

5. కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

6. నిరుద్యోగిగా ఉన్నట్లు స్వీయ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

7. దివ్యాంగుల కేట‌గిరికి చెందిన వారైతే సంబంధిత స‌ర్టిఫికేట్లు జ‌త చేయాలి.

ద‌ర‌ఖాస్తు ఇలా చేసుకోండి

శ్రీకాకుళం రెవెన్యూ డివిజ‌న్‌కు సంబంధించి డీల‌ర్ల పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఆర్డీవో కార్యాల‌యం, సంబందిత తహ‌శీల్దారు కార్యాల‌యాలు, గ్రామా స‌చివాల‌యం నోటీసు బోర్డు, సంబందిత రేష‌న్ షాపుల వ‌ద్ద ప్రచురిస్తారు. పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన‌ ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా స‌చివాల‌యాల్లోనూ, మండ‌లాల త‌హ‌శీల్దారు కార్యాల‌యాల్లోనూ, లేదా ఆర్డీవో కార్యాల‌యంలోనూ నుంచి పొంద‌వ‌చ్చు. పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తు ఫాంను నేరుగా గాని, లేదా పోస్టు ద్వారా గాని సంబంధిత ఆర్డీవో కార్యాలయానికి, లేదా తాహ‌శీల్దారు కార్యాల‌యంలో దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. ద‌ర‌ఖాస్తుతో పాటు సంబంధిత స‌ర్టిఫికెట్లు జ‌త చేయడం త‌ప్పనిస‌రి. గెజిటెడ్ అధికారితో అటెస్ట్ చేయించాలి.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner

సంబంధిత కథనం

టాపిక్

Andhra Pradesh NewsSrikakulamTrending ApTelugu NewsAp Jobs
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024