Shaving Mistakes: షేవింగ్ చేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారంటే.. వృద్ధాప్యాన్ని కొని తెచ్చుకున్నట్టే!

Best Web Hosting Provider In India 2024

Shaving Mistakes: షేవింగ్ చేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారంటే.. వృద్ధాప్యాన్ని కొని తెచ్చుకున్నట్టే!

Ramya Sri Marka HT Telugu
Jan 07, 2025 07:30 PM IST

షేవింగ్ కోసం సెలూన్ కు వెళ్లడం నచ్చడం లేదా.. మరి ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఈ పొరబాట్లు చేస్తున్నారా.. జాగ్రత్త! వయస్సు కంటే ఎక్కువగా కనిపించే పొరబాట్లు ఏమైనా చేస్తున్నారేమో అని చెక్ చేసుకోండి..

 షేవింగ్ చేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారంటే.. వృద్ధాప్యాన్ని కొని తెచ్చుకున్నట్టే!
షేవింగ్ చేసుకునేటప్పుడు ఈ తప్పులు చేశారంటే.. వృద్ధాప్యాన్ని కొని తెచ్చుకున్నట్టే! (Shutterstock)

పురుషుల అలంకరణలో షేవింగ్ అనేది చాలా కీలకం. ఇతరులకు కనిపించగానే ముందగా చూసేది ముఖాన్నే. మగాళ్లలో ప్రత్యేకించి చూసేది మీసాలు, గడ్డాన్నే. అందుకే లుక్ కోసం గడ్డం షేప్ చేసుకుని తెగ రెడీ అయిపోతున్నారు. ఇందుకోసం సెలూన్ కు వెళ్లే వాళ్లు కొందరుంటే, ఇంట్లోనే షేవింగ్ చేసుకుని సొంతగా రెడీ అవుతున్నారు ఇంకొందరు. సెలూన్‌లో తగినంత శుభ్రం లేదని ఇంట్లో చేసుకోవడం మంచిపనే. మరి సెలూన్‌లో వాడే సాధనాలను మీరూ వాడుతున్నారా.. లేదంటే పెద్ద ప్రమాదమే ఉందట. అందం మాట దేవుడెరుగు. అసలు వయసు కంటే ఇంకా పెద్ద వాళ్లలాగా కనపడతారట తెలుసా..

yearly horoscope entry point

కంగారుపడకండి. ఆ పొరబాట్లేంటో తెలుసుకుని మరోసారి రిపీట్ అవకుండా చూసుకోండి.

ఒకటే బ్లేడ్‌ను పదేపదే వాడటం:

షేవింగ్ చేసేటప్పుడు, మీరు ప్రతిసారీ కొత్త బ్లేడ్ ఉపయోగించకపోతుంటే తప్పు చేస్తున్నట్లేనని గుర్తుంచుకోండి. పాత బ్లేడ్‌ను షేవింగ్ కుదురుతుంది కదా అని బ్లేడ్ మార్చడం చాలాసార్లు మర్చిపోతారు. ఇది ఆరోగ్య పరంగా చర్మానికి చాలా హానికరమైన విధానం. పాత బ్లేడ్లను ఉపయోగించడం వల్ల చర్మం మరింత ముదురుగా మారిపోతుంది. ఒక్కోసారి బ్లేడ్ లో తుప్పు లాంటివి ఏర్పడటం వల్ల చర్మానికి, ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. అటువంటి పరిస్థితిలో, షేవింగ్ చేసినప్పుడల్లా, ఎల్లప్పుడూ కొత్త బ్లేడ్ ఉపయోగించడం మంచిది.

షేవింగ్ క్రీమ్ లేదా ఫోమ్ వాడటం:

కొంతమంది పురుషులు గడ్డానికి ఉన్న వెంట్రుకలను షేవ్ చేసుకునే ముందు నీటితో మాత్రమే తడుపుకుంటారు. అలా చేయడం వల్ల చర్మం కట్ అయ్యే ప్రమాదముంది. కాబట్టి షేవింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ షేవింగ్ క్రీమ్ లేదా షేవింగ్ ఫోమ్ ఉపయోగించండి. ఇవి జుట్టును మృదువుగా మార్చడంతో పాటు చర్మం మరీ పొడిబారకుండా నివారిస్తాయి. మీ చర్మ రకాన్ని బట్టి సరైన షేవింగ్ క్రీమ్ ఎంచుకోవడం మరో ముఖ్య విషయం. ఇలా చేసుకోవడం వల్ల మీరు షేవింగ్‌ను మరింత సేఫ్టీతో పూర్తి చేసుకోగలుగుతారు.

షేవింగ్‌కు ముందు వెంట్రుకలపై ఫోకస్

చాలా మందిలో షేవింగ్ ప్రక్రియ త్వరగా పూర్తయిపోవాలనే ఆతురత ఉంటుంది. ఈ తొందర వల్ల గడ్డానికి ఉన్న వెంట్రుకలను పూర్తిగా మృదువుగా మారకముందే షేవింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఇది చర్మాన్ని ఇబ్బందికి గురి చేస్తుంది. ఇలా నిరంతరం చేయడం వల్ల చర్మం రఫ్ గా మారిపోతుంది. కొన్నిసార్లు గాయాలు కలిగే ప్రమాదం కూడా ఉంది. దీంతోపాటుగా పురుషులు వయస్సు కంటే ఎక్కువగా కనిపిస్తూ, చిన్న వయస్సులోనే వృద్ధులుగా కనిపిస్తారు. అటువంటి పొరబాట్లు జరగకుండా ఉండాలంటే, షేవింగ్ చేసుకునేటప్పుడు, మొదట గడ్డం జుట్టును పూర్తిగా తడవనివ్వండి. ఆ వెంట్రుకలకు ఫోమ్ లేదా క్రీమ్ రాసుకుని మృదువుగా చేయండి. ఇందుకోసం గడ్డం వెంట్రుకలను తడిపే సమయంలో గోరువెచ్చని నీటితో కాసేపు రుద్దుకోవడం ఇంకా మంచిది. ఇలా ఒక ఐదు నిమిషాల వరకూ చేస్తే గడ్డం వెంట్రుకలు మృదువుగా మారుతాయి. ఇప్పుడు షేవింగ్ చేసుకున్నా కూడా మీ చర్మంపై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపదు.

షేవింగ్ తర్వాత కడుక్కోవడం

షేవింగ్ చేసిన తర్వాత చాలా మంది నిర్లక్ష్యపెట్టే విషయం. గడ్డం భాగాన్ని నీటితో కడుక్కోవడం. చాలా మంది ఫోమ్ లేదా క్రీమ్ తో గడ్డం చేసుకున్న తర్వాత టవల్ తో లేదా ఏదైనా పొడి బట్టతో తుడుచుకుని మిగతా విషయాలు వదిలేస్తారు. అలా చేయడం వల్ల క్రీమ్ తాలూకూ రసాయనాలు చర్మంపై అలాగే ఉండిపోతాయి. ఫలితంగా చర్మంలో బ్యాక్టీరియా ఇంకిపోయి ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదముంది. దీనిని నివారించడం కోసం షేవింగ్ చేసిన వెంటనే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. చివరిగా మాయిశ్చరైజర్ పూసుకోవాలి. ఇందుకోసం కలబంద గుజ్జు లేదా కొబ్బరి నూనె లాంటివి ఎంచుకోవడం బెటర్ ఆప్షన్. మీరు మీ చర్మ రకాన్ని బట్టి మంచి ఫేస్ క్రీమ్ వాడవచ్చు.

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024