Navodaya Schools: పీవీ పుట్టిన గడ్డపై నవోదయ ఏర్పాటు కోసం బండి సంజయ్ వినతి, కేంద్ర మంత్రి సానుకూలం

Best Web Hosting Provider In India 2024

Navodaya Schools: పీవీ పుట్టిన గడ్డపై నవోదయ ఏర్పాటు కోసం బండి సంజయ్ వినతి, కేంద్ర మంత్రి సానుకూలం

Bolleddu Sarath Chand HT Telugu Jan 08, 2025 05:54 AM IST
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Twitter
  • Share on Facebook
Bolleddu Sarath Chandra HT Telugu
Jan 08, 2025 05:54 AM IST

Navodaya Schools: మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జన్మించిన ‘వంగర’లో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీంతో పాటు సిరిసిల్ల జిల్లాలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బండి సంజయ్ విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.

నవోదయ విద్యాలయం కోసం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తున్న బండి సంజయ్
నవోదయ విద్యాలయం కోసం కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తున్న బండి సంజయ్
మమ్మల్ని ఫాలో అవ్వండిShare on Whatsapp
  • Share on twitter
  • Share on Facebook

Navodaya Schools: పీవీ జన్మస్థలమైన వంగరలో నవోదయ విద్యాలయం ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ న్యూఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ను విజ్ఞప్తి చేశారు.

yearly horoscope entry point

తెలంగాణలో కొత్తగా 18 జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. అయితే అందులో హనుమకొండ జిల్లా అంశం ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ విషయాన్ని బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన బండి సంజయ్ హన్మకొండ జిల్లా పరిధిలోని హుస్నాబాద్ నియోజకవర్గం వంగరలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు విజ్ఝప్తి చేశారు. దీంతోపాటు తెలంగాణలోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాన్న ఏర్పాటు చేయాలని, అందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.

పీఎం ద్వారా ప్రతి మండలంలో రెండు స్కూల్స్..

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రతి మండలంలో రెండు పాఠశాలలను ప్రధానమంత్రి శ్రీ స్కీమ్ కింద స్థాపించాలని బండి సంజయ్ అభ్యర్థించారు. ఈ స్కీం కింద ఎంపికైన ప్రతి పాఠశాలకు రూ.40 లక్షల చొప్పున నిధులు మంజూరవుతాయని, తద్వారా ఆయా పాఠశాలలను సమగ్రాభివృద్ధి చేసే అవకాశం ఏర్పడనుందని వివరించారు. పీఎం శ్రీ కింద పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో

– కరీంనగర్ టౌన్

– కోతపల్లి

– కరీంనగర్ రూరల్

– మనకొండూర్

– తిమ్మాపూర్

– గన్నేరువరం

– గంగాధర

– రామడుగు

– చొప్పదండి

– చిగురుమామిడి

– హుజూరాబాద్

– వీనవంక

– సైదాపూర్

– జమ్మికుంట

– ఇల్లందకుంట

– శంకరపట్నం మండలాల్లో పాఠశాలలు ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించారు.

టెక్నికల్ యూనివర్సిటీ…

కరీంనగర్ జిల్లాలో టెక్నికల్ యూనివర్సిటీ స్థాపించాలని కోరుతూ బండి సంజయ్ కేంద్ర మంత్రికి మరో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టెక్నికల్ యూనివర్సిటీ అవసరాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో నైపుణ్య అభివృద్ధి, టెక్నికల్ విద్యను ప్రోత్సహించడానికి యూనివర్సిటీ కీలకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

అధునాతన విద్యాసంస్థల కొరతను తీర్చడం ద్వారా యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు అందించేందుకు దోహదపడుతుందన్నారు. ప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ అత్యవసరమని పేర్కొన్నారు. బండి సంజయ్ వినతి పట్ల సానుకూలంగా స్పందించిన ధర్మేంద్ర ప్రదాన్ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner

టాపిక్

Bandi SanjayKarimnagarKarimnagar Lok Sabha ConstituencyTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024