HMPV: హెచ్ఎంపీవీ వైరస్ పై యాంటీబయోటిక్స్ సమర్థవంతంగా పనిచేస్తాయా?

Best Web Hosting Provider In India 2024

HMPV: హెచ్ఎంపీవీ వైరస్ పై యాంటీబయోటిక్స్ సమర్థవంతంగా పనిచేస్తాయా?

Haritha Chappa HT Telugu
Jan 08, 2025 07:30 AM IST

కరోనా తర్వాత మరొక మహమ్మారి వచ్చి పడేలా ఉంది. అదే హ్యూమన్ మెటనోమా వైరస్. ఇది మనుషుల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

హెచ్ఎంపీవీ పై యాంటీబయోటిక్స్ పనిచేస్తాయా?
హెచ్ఎంపీవీ పై యాంటీబయోటిక్స్ పనిచేస్తాయా? (Pixabay)

కరోనా తర్వాత మరో మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసేలా కనిపిస్తోంది. అదే హెచ్ఎంపీవీ లేదా హ్యూమన్ మెటానోమా వైరస్. ఇది మనుషుల్లో త్వరగా వ్యాప్తి చెందుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. చైనా నుంచి మలేషియా చేరిన ఈ వైరస్ అక్కడ కూడా ఎక్కువమందికి వ్యాప్తి చెందింది. చైనా, మలేషియా దేశాల్లోని ఆసుపత్రులలో హెచ్ఎంపీవీ వైరస్ సోకిన ప్రజలు ఎక్కువగా చేరుతున్నట్టు గుర్తించారు. ఇది కొత్తగా పుట్టిన వైరస్ కావడంతో దీనికి ఎలాంటి చికిత్స, ప్రత్యేక మందులు లేవు. ఇవి యాంటీబయోటిక్స్ తో తగ్గుతాయన అపోహ కూడా ఎక్కువ మందిలో ఉంది.

yearly horoscope entry point

ఏమిటీ హెచ్ఎంపీవీ?

యాంటీబయోటిక్స్‌తో హెచ్ఎంపీవీ వైరస్ అదుపులో ఉంటుందో లేదో అన్న అనుమానం ఎంతోమందిలో ఉంది. యాంటీబయోటిక్స్ మందులను బ్యాక్టీరియాలను చంపడానికి వినియోగిస్తారు. అయితే వైరస్‌లపై ఇది సరిగా పనిచేయకపోవచ్చు. హెచ్ఎంపీవీ అనేది ఒక శ్వాసకోశ వైరస్. ఊపిరితిత్తులు, వాయు మార్గాలలో ఈ వైరస్ ఇబ్బందికి గురిచేస్తుంది. ఈ వైరస్ పారామిక్సో వైరస్ కుటుంబానికి చెందినది. ఈ వైరస్ రెస్పిరేటరీ సమస్యలను అధికంగా కలిగిస్తుంది.

యాంటీ బయోటిక్స్ పనిచేస్తాయా?

హెచ్ఎంపీవీ అనేది పూర్తిగా వైరస్ వల్ల కలిగేది. కాబట్టి ఆ సమయంలో యాంటీబయోటిక్స్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుందని ఎంతో మందికి సందేహం ఉంటుంది. నిజానికి అది కొంతవరకు వాస్తవమే. వైద్యులను సంప్రదించకుండా యాంటీబయోటిక్స్ తీసుకోకూడదు. ఇది మీ శరీరంలో యాంటీ బయోటిక్ రెసిస్టెన్స్ కు కారణం అవుతుంది. అంటే భవిష్యత్తులో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చినా కూడా శరీరం ఆ చికిత్సకు స్పందించలేదు. యాంటీబయోటిక్స్ అవసరమైనప్పుడు మాత్రమే వినియోగించాలి. అవసరం లేనప్పుడు వినియోగిస్తే వికారం, విరేచనాలు, అలెర్జీలు వంటివి కలుగుతూ ఉంటాయి.

జ్వరం, దగ్గు వచ్చినప్పుడు వెంటనే చాలామంది యాంటీ బయోటిక్స్ వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వైరల్ ఇన్ఫెక్షన్లు, జ్వరం, అలసట, దగ్గు వంటి వాటికీ కారణం అవుతాయి. అదే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు గొంతు దురద, గొంతు నొప్పి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గొంతు మంట, మూత్ర విసర్జన సమయంలో మంట వంటి వాటికీ కారణం అవుతాయి. ఈ రెండూ కూడా వేరువేరు లక్షణాలను కలిగి ఉంటాయి. దేనికి సరిపడే చికిత్సను దానికి తీసుకోవాల్సి ఉంటుంది.

హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారికి వైరస్ లను కట్టడి చేసే మందులతో చికిత్సను ఆరంభిస్తారు. హెచ్ఎంపీవీ వైరస్ సోకిన వారిలో అధికంగా దగ్గు, గొంతు నొప్పి, జ్వరము, గురక అధికంగా రావడం, ముక్కు దిబ్బడ కట్టడం వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దీన్ని అలాగే వదిలేస్తే బ్రాంకైటిస్, నిమోనియాగా కూడా మారుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపైనే దీని ప్రతాపాన్ని చూపిస్తుంది. ఎందుకంటే వీరి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరిలో ఇలాంటి శ్వాసకోశ వ్యాధులు త్వరగా వస్తాయి.

(గమనిక: అధ్యయనాలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ కోసం ఇక్కడ అందిస్తున్నాం. ఇది కేవలం సమాచారం మాత్రమే. ఇది వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి సందేహాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.)

Whats_app_banner

సంబంధిత కథనం

Source / Credits

Best Web Hosting Provider In India 2024