Karthika Deepam January 8th Episode: తాతామనవళ్ల మాటల వార్.. రెచ్చిపోయిన శివన్నారాయణ.. యుద్ధానికి సిద్ధమన్న కార్తీక్

Best Web Hosting Provider In India 2024

Karthika Deepam January 8th Episode: తాతామనవళ్ల మాటల వార్.. రెచ్చిపోయిన శివన్నారాయణ.. యుద్ధానికి సిద్ధమన్న కార్తీక్

Karthika Deepam Today Episode January 8th: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. వంట గురించి సుమిత్రపై వెటకారం చేస్తుంది పారిజాతం. కార్తీక్, శివన్నారాయణ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగా అయింది. పూర్తిగా ఏం జరిగిందో ఇక్కడ చూడండి.

Karthika Deepam January 8th Episode: తాతామనవళ్ల మాటల వార్.. రెచ్చిపోయిన శివన్నారాయణ.. యుద్ధానికి సిద్ధమన్న కార్తీక్
Karthika Deepam January 8th Episode: తాతామనవళ్ల మాటల వార్.. రెచ్చిపోయిన శివన్నారాయణ.. యుద్ధానికి సిద్ధమన్న కార్తీక్
 

కార్తీక దీపం 2 నేటి (జనవరి 8) ఎపిసోడ్‍లో ఏం జరిగిందంటే.. భోజనం చేసేందుకు కూర్చొని సుమిత్రను ఉద్దేశించి వెటకారంగా మాట్లాడుతుంది పారిజాతం. “సుమిత్ర ఈ వంటలు మన ఇంట్లోవేనా.. ఏ ఇంట్లో నుంచైనా వచ్చాయా” అని అడుగుతుంది. దీప చేసిన టిఫిన్స్ తెచ్చిన విషయాన్ని మళ్లీ గుర్తు చేస్తుంది. తాను చేసిన వంటే అని సుమిత్ర చెబుతుంది. తీనే సమయంలో ఆ దరిద్రాన్ని తలుచుకోవడం అవసరమా అని శివన్నారాయణ కోప్పడతాడు. నాన్నకు నచ్చని విషయం ఎందుకు మాట్లాడుతున్నావని దశరథ్ కూడా పారుపై చిరాకు పడతాడు.

విషయం వినకుండా సపోర్ట్

కంపెనీకి సంబంధించి నేను ఓ పని చేశాను తాత.. అని జ్యోత్స్న చెప్పబోతే శివన్నారాయణ ఆపేస్తాడు. “నువ్వు ఏదైనా చెప్పమ్మా.. నాతో చెప్పొద్దు. కానీ మన కంపెనీ నంబర్ వన్‍గా ఉండాలి. కార్తీక్ గాడు దాంటో ఈ శివన్నారాయణ స్థాయికి చేరాలని కలలు కంటున్నాడు. వాడి పక్కన వంట మనిషి దీప ఉంది కదా.. కలలు కనేలా చేస్తోంది. మన మీద పగ సాధించేందుకు రెచ్చగొడుతోంది” అని శివన్నారాయణ అంటాడు. రయ్‍మని వందో అంతస్తుకు వెళ్లే వారిని, మెట్ల మీద వచ్చే వారు అందుకోలేరని అంటాడు. కరెంట్ పోతే లిఫ్ట్ ఆగిపోతుందని, మెట్లు ఎక్కే వారి ప్రయాణం ఆగదని సుమిత్ర కౌంటర్ వేస్తుంది.

ఏ నిర్ణయం తీసుకున్నా తాత తలెత్తుకునేలా ఉండాలని జ్యోత్స్నతో శివన్నారాయణ అంటాడు. జ్యోత్స్న కూడా గర్వపడేలా చేస్తానంటుంది. 50ఏళ్లు పైబడిన వారిని జ్యోత్స్న.. ఉద్యోగం నుంచి తీసేసిన విషయం తెలియక శివన్నారాయణ భేష్ అన్నాడు.

గొడవ పడొద్దు

ఎప్పటి నుంచో కంపెనీలో పని చేస్తున్న వారిని తీసేయడం జ్యోత్స్న తప్పే కార్తీక్‍తో దీప అంటుంది. అలాగని తాత కుటుంబంతో గొడవ పడొద్దని కార్తీక్‍కు సర్దిచెబుతుంది దీప. “50 ఏళ్లు మించిన వారు కంపెనీలో ఉండకూడదంటే.. ముందుగా తీసేయాల్సింది మా తాతనే. వెళ్లి ఇలానే అడుగుతా” అని కార్తీక్ అంటాడు. అన్యాయం జరిగిన ఉద్యోగుల విషయంలో గట్టిగానే అడుగుతానని అంటాడు. చట్టాలు, న్యాయస్థానాలు కూడా ఉన్నాయని, ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో తనకు తెలుసని అంటాడు. ఏం చేసినా అది మీ కుటుంబం అని గుర్తుంచుకోవాలని దీప చెబుతుంది. ఆ విషయం వాళ్లు మరిచిపోయారని, వాళ్ల నిర్ణయాలు ఇలాగే ఉంటాయని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న చేసిన పని తాతయ్యకు తెలిసి ఉండదు బాబు అని దీప అంటుంది. ఆయనకు చెప్పకుండా జ్యోత్స్న ఏదీ చేయదని కార్తీక్ అంటాడు. ఆ మనిషి మారిపోయాడని చెబుతాడు.

 

తాతకు నచ్చజెప్పాలని, ముందు మాట్లాడాలని కార్తీక్‍కు దీప సలహా ఇస్తుంది. తాతతో ఎక్కడ గొడవ పెట్టుకుంటారో అని మీ అమ్మ భయపడుతున్నారని, అలా చేయవద్దని దీప అంటుంది. దీంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు. సాధారణ మనిషిలా ఉద్యోగుల తరఫున తాతను కలవాలని చెబుతుంది. అర్థం చేసుకుంటారని అంటుంది. తప్పు సరిచేసుకోకపోతే ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంటే వింటానని కార్తీక్‍కు దీప భరోసా ఇస్తుంది.

నాశనం చేశావ్.. జ్యోత్స్నపై పారిజాతం ఆగ్రహం

పని చేసుకుంటూ తనను పట్టించుకోవడం లేదని జ్యోత్స్నతో పారిజాతం అంటుంది. ఈ క్రమంలో ఏ నిర్ణయం తీసుకున్నావని అడుగుతుంది. కంపెనీలో 50 ఏళ్లకు పైబడిన వారిని ఉద్యోగం నుంచి తీసేశానని అసలు విషయం చెబుతుంది జ్యోత్స్న. దీంతో పారిజాతం కంగారు పడుతుంది. మళ్లీ అడుగుతుంది. 50 ఏళ్లు దాటిన వారిని పీకేశానని జ్యోత్స్న అంటుంది. కొట్టానంటే మూతిపళ్లు రాలిపోతాయ్ దరిద్రపుదాన.. బంగారం లాంటి అవకాశాన్ని చేజేతులా నాశనం చేసేశావ్ కదే” అని పారు ఫైర్ అవుతుంది. మీ తాతకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా, నాలుగు పీకుతాడు అంటూ కోప్పడుతుంది. అయితే, ఈ విషయం తెలిస్తే తాత నన్ను మెచ్చుకుంటాడని జ్యోత్స్న అంటుంది. తాతకు తెలిసే లోపు తీసేసిన వారిని చేర్చుకోవాలని, జాగ్రత్త పడాలని పారిజాతం సూచిస్తుంది. ఏం జరిగినా ఎదుర్కొంటానని జ్యోత్స్న అంటుంది. ఇది అంటించిన బాంబు లాంటిది.. ఏ క్షణాన్నైనా పేలొచ్చని పారు మనసులోనే భయపడుతుంది.

 

సైకిల్‍పై తాత ఇంటికి కార్తీక్.. పేరుతో పిలుస్తూ

ఇంత దారుణం చేసి కాఫీ ఎలా తాగుతున్నావే అంటూ పారిజాతం అంటే.. రాత్రి నుంచి ఏంటి నీ గోల.. ఎవరైనా వచ్చి అడుగుతారా.. అంత దమ్ము ఎవరికైనా ఉందా అని జ్యోత్స్న అంటుంది. ఇంతలోనే సైకిల్‍పై తాత శివన్నారాయణ ఇంటికి వస్తాడు కార్తీక్. బయటి నుంచే శివన్నారాయణ గారు.. శివన్నారాయణ గారు అని అరుస్తాడు. పేరు పెట్టి పిలుస్తున్నాడని శివన్నారాయణ కోప్పడతాడు.

ఎవర్రా నువ్వు.. కార్తీక్ టిఫిన్ సెంటర్ ఓనర్‌ని

“నా ఇంటికి గుమ్మం ముందు నిలబడి నన్నే పేరు పెట్టి పిలుస్తున్నావ్ ఎవర్రా నువ్వు” అని మనవడు కార్తీక్‍పై శివన్నారాయణ ఫైర్ అవుతాడు. సుమిత్ర అడ్డుకోబోతే… మంచి, మర్యాద లేని వాళ్లతో ఇలాగే మాట్లాడాలని అంటాడు. ఎవర్రా అని అంటాడు. “నా పేరు కార్తీక్. కార్తీక్ టిఫిన్ సెంటర్ ఓనర్‌ని” అని కార్తీక్ అంటే.. పోయి ఇండ్లీలు అమ్ముకోక నా ఇంటి ముందుకు ఎందుకు వచ్చావ్ రా అని శివన్నారాయణ అంటాడు. మనవడిగా రావడం మీకు ఇష్టం లేదని, అందుకే తాత అని కాకుండా పేరు పెట్టి పిలిచానని కార్తీక్ చెబుతాడు.

 

మాజీ ఉద్యోగిగా మాట్లాడతా..

నువ్వు పరాయి వాడివి ఏంటి బావ అని జ్యోత్స్న అంటే.. వద్దనుకొని పోయిన వారు పరాయి వాడే అని శివన్నారాయణ చెబుతాడు. వాడు నా మేనల్లుడు.. నాన్న అని దశరథ్ అంటాడు. నాకు మాత్రం మనవడు కాదు అని శివన్నారాయణ అంటే.. ఎన్నాళ్లు దూరం పెడతారు మామమ్య అని సుమిత్ర చెబుతుంది. తాను దగ్గరవ్వాలని రాలేదని, ఓ విషయం చెప్పేందుకు వచ్చానని అంటాడు కార్తీక్. పరాయి వాళ్లతో మాట్లాడనని శివన్నారాయణ అంటాడు. ఒకప్పుడు మీ కంపెనీలో పని చేసే వెళ్లి మాజీ ఉద్యోగి కార్తీక్‍గా మాట్లాడుతున్నానని, ఇది సరిపోతుందా అని తాతతో కార్తీక్ చెబుతాడు. లోపలికి రా బావ అని జ్యోత్స్న అంటే.. ఆ మాట మీ తాతతో చెప్పించు అని కార్తీక్ అంటాడు.

విషయం వినకుండానే రెచ్చిపోయిన తాత

ఇలా తాతమనవళ్ల మధ్య మాటల యుద్ధం జోరుగా సాగుతుంది. సారీ చెబితేనే లోపలికి పిలిచే విషయం ఆలోచిస్తానని శివన్నారాయణ అంటాడు. అలా ఉంటాయి మన కథలు అని కార్తీక్ వెటకరిస్తాడు. ఛైర్మన్‍ను కొన్ని ప్రశ్నలు అడగాలంటాడు. కంపెనీ నుంచి ఏమైనా రావాలా అంటే.. లేవు.. ఉన్నా వద్దు అని కార్తీక్ అంటాడు. కంపెనీ గురించి తీసుకుంటున్న నిర్ణయాల గురించి అడగాలని అనుకుంటున్నానని చెబుతాడు. కంపెనీలో జరుగుతున్న అరాచకాల గురించి చెప్పాలనుకుంటున్నానని అంటాడు. “నువ్వెవడివి రా.. నా కంపెనీ విషయాల గురించి మాట్లాడేందుకు.. నువ్వు ఎవడ్రా నా నిర్ణయాలు ప్రశ్నించేందుకు” అంటూ శివన్నారాయరణ రెచ్చిపోతాడు. మనవరాలు జోత్స్న.. ఉద్యోగులను తీసేసిన నిర్ణయం తెలుసుకోకుండా మాట్లాడుతుంటాడు. ఆ విషయం చెప్పేందుకు కూడా కార్తీక్‍కు అవకాశం ఇవ్వడు.

 

బావ ఆఫీస్ ఉద్యోగుల గురించి మాట్లాడేందుకు వచ్చినట్టు ఉన్నాడని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న. ఆ విషయం వీడికి ఎలా తెలుసని పారు కూడా అనుకుంటుంది. నా కంపెనీ గురించి నిర్ణయాలు తీసుకునేందుకు సీఈవో ఉందని జ్యోత్స్న వైపు శివన్నారాయణ చూపిస్తే.. తన వల్లే అన్యాయం జరిగే ఎవరితో మాట్లాడాలని కార్తీక్ ప్రశ్నిస్తాడు. ఏమైందని సుమిత్ర అంటే.. శివన్నారాయణ అడ్డుకుంటాడు. జరిగింది వింటే ఎవరు డబ్బాలు కొట్టుకుంటున్నారో అర్థమవుతుందని కార్తీక్.. అంటే వినాల్సిన అవసరం లేదని శివన్నారాయణ అంటాడు. ఏం చేసినా జోత్స్నకు మద్దతుగానే ఉంటానని గట్టిగా చెబుతాడు. కార్తీక్ చెప్పాలనుకున్న విషయాన్ని తెలుసుకోడు. జ్యోత్స్న ఏం చేసినా కరెక్టేనని, పూర్తి నమ్మకం ఉందని చెబుతాడు. కడుపు మంటగా ఉందా అని వెటరిస్తాడు.

యుద్ధానికి రెడీగా ఉండండి

జ్యోత్స్న తీసుకున్న నిర్ణయం ఎలాంటిదైనా సమర్థిస్తానంటారా అని కార్తీక్ ప్రశ్నిస్తే.. అవును సమర్థిస్తానని శివన్నారాయణ చెబుతాడు. నా మనవరాలి మాటే నా మాట అంటాడు. ఇదే మీ ఆఖరి మాటనా అని కార్తీక్ అంటే.. అవునంటాడు శివన్నారాయణ. ఆల్ ది బెస్ట్ అని కార్తీక్ అంటే.. ఏంటదని అని అడుగుతుంది జోత్స్న. నువ్వు చేసిందే అని కార్తీక్ అంటే కంగారు పడుతుంది. తమకు చాలా పనులు ఉన్నాయని వెళ్లాలని శివన్నారాయణ అంటాడు. “మీరు చేయాల్సింది మీరు చేశారు కదా.. నేను చేయాల్సింది నేను చేస్తాను” అని కార్తీక్ వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడతాడు.

 

ఏమైంది రా అని సుమిత్ర అంటే.. ఏం కాలేదు అత్తా అని విషయయ చెప్పడు కార్తీక్. కుర్రవేషాలు అంటూ కార్తీక్‍ను రెచ్చగొడతాడు శివన్నారాయణ. “హలో శివన్నారాయణ గారు.. ఏదైనా సాధించేందుకు రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి శాంతి.. రెండోది యుద్ధం. నేను శాంతి కోసం వచ్చాను. యుద్ధాన్ని మీరు కోరుకుంటున్నారు. యుద్ధమే కావాలనుకుంటే సిద్ధంగా ఉండండి” అని కార్తీక్ అంటాడు. చేతనైంది చేసుకోపోరా అని శివన్నారాయణ అంటే.. ఆల్ ది బెస్ట్ చెప్పి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోతాడు కార్తీక్.

కార్తీక్ చెప్పింది వినాల్సిందని దశరథ్ అంటే.. వాడు చెప్పింది మనం వినడం ఏంటిరా అని ఇంకా మొండిగానే మాట్లాడతాడు శివన్నారాయణ. వాడిది సైకిల్ మీద తిరిగే స్థాయి.. మనం లేకపోతే వాడు జీరోనే అని అంటాడు. ఆఫీస్‍కు వెళ్లాలని జ్యోత్స్నతో చెబుతాడు. దశరథ్, సుమిత్ర బాధగా ఉంటారు. వాడేదో అనేసి పోయాడని దాని గురించి ఆలోచించొద్దని, అవన్నీ చేతకాని మాటలు అంటూ శివన్నారాయణ అంటాడు. కార్తీక్ ఏం చెప్పాలనుకున్నాడు అని సుమిత్ర అనుకుంటుంది. దీంతో కార్తీక దీపం 2 నేటి (జనవరి 8) ఎపిసోడ్ ముగిసింది. తాతామనవళ్ల మధ్య యుద్ధం ఏ రేంజ్‍లో కొనసాగుతుందో చూడాలి.

 
 
Whats_app_banner
 

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024