Brahmamudi January 8th Episode: అనామికను చంపుతానన్న సామంత్- ప్రకాశంను అవమానించిన కావ్య- రుద్రాణి సైడ్‌కి చిన్నన్నయ్య

Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 8th Episode: అనామికను చంపుతానన్న సామంత్- ప్రకాశంను అవమానించిన కావ్య- రుద్రాణి సైడ్‌కి చిన్నన్నయ్య

Brahmamudi Serial January 8th Episode: బ్రహ్మముడి జనవరి 8 ఎపిసోడ్‌లో అనామిక ప్లాన్‌ బెడిసికొట్టడంతో సామంత్ ఆవేశపడుతాడు. తనవైపుకు కోపంగా వచ్చి కాలర్ పట్టుకున్న అనామికను నేను కూడా గొంతుపట్టుకోగలను అని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు గోల్డ్ తక్కువ ధరకు తీసుకొచ్చిన ప్రకాశంకు కావ్య వల్ల అవమానం జరుగుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 8వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 8వ తేది ఎపిసోడ్
 

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో లాకర్‌లో కావ్య బంగారు కిరీటం పెట్టలేదని, అది షో మోడల్ పీస్ అని తెలుసుకున్న మాజీ మేనేజర్, ప్రస్తుత సెక్యురిటీ గార్డ్ అనామికకు కాల్ చేస్తాడు. కావ్య మేడమ్ తెలివితేటల ముందు మనమెంత అని అతను అంటాడు. దానికన్ని తెలివితేటలే ఉంటే కిరీటం నా ఎదురుగా ఎందుకుంటుంది అని అనామిక అంటుంది.

అది బంగారు కిరీటం కాదు

మీ ఎదురుగా ఉన్న కిరీటం బంగారంది కాదు. ఇనుపది. అసలైన కిరీటం ఇప్పుడే లాకర్ నుంచి తీసింది. మీరిచ్చిన నకిలీలాంటిదే మీ దగ్గర ఉంది అని సెక్యూరిటీ అతను అంటాడు. అది విన్న సామంత్ వెళ్లి కోపంగా గోడను గుద్దుతుంటాడు. ఏయ్ ఏం అంటున్నావ్. ఇది నకిలీదా అని అనామిక అంటుంది. ఇంతలో సెక్యురిటీ గార్డ్ నుంచి కావ్య ఫోన్ లాక్కుంటుంది. అది చూసి అతను షాక్ అవుతాడు. పారిపోతుంటే కాలర్ పట్టుకుంటుంది.

ఏంటీ అనామిక జరిగింది ఇప్పుడే తెలిసినట్టుంది. నీ మొహం బాగా మాడిపోయినట్టుంది. ఇందాక ఫోన్‌లో ఏదో అన్నావ్. నేను మరి నీలాంటి దిక్కుమాలిన ఐడియాలు వేస్తాననుకున్నావా. కాస్తా బెటర్ ఐడియాలే కదా వేస్తాను. నీలాంటి శత్రువులు ఎంతలా ఎదురుచూస్తారో నాకు తెలుసు కదా. అప్పటి నుంచి నా జాగ్రత్తలో నేను ఉంటాను. నువ్ ఇలా వంద ప్లాన్స్ వేసిన మా కంపెనీ గోడమీది సున్నం కూడా గీకలేవు. ఇక ఇది గుర్తు పెట్టుకుని ఎలాంటి ప్లాన్స్ వేయకు. లేకుంటే జీవితంలో కోలుకోలేని గుణపాఠం నేను చెప్పాల్సి వస్తుంది అని కావ్య కాల్ కట్ చేస్తుంది.

 

చూడు ఇప్పుడు నేను రెండు పనులు చేయొచ్చు. ఒకటి నిన్ను చాచి కొట్టొట్టు. మరొటి పోలీసులకు అప్పజెప్పొచ్చు. కానీ, వయసులో పెద్దోడివి కాబట్టి కొట్టట్లేదు. భార్యా పిల్లలు ఉన్నారు కాబట్టి పోలీసులకు పట్టివ్వట్లేదు. కానీ, ఒక్కటి గుర్తుపెట్టుకో అన్నం పెట్టే కంపెనీకి ద్రోహం చేస్తే కోలుకోలేని దెబ్బ తగులుతుందని గుర్తు పెట్టుకో. ఇంకెక్కడైన నిజాయతీగా పనిచేసుకో అని కావ్య అంటుంది. దాంతో సెక్యురిటీ గార్డ్ వెళ్లిపోతాడు. మరోవైపు ప్లాన్ ఫెయిల్ అయిందని అనామిక అరుస్తుంది.

నీ గొంతు కూడా పట్టుకోగలను

ఇకనైనా వాళ్ల కంపెనీని దెబ్బ కొట్టాలన్న ఆలోచన మానుకో. అది నీకెప్పుడు సాధ్యం కాదని తెలుసుకో. ఆ కావ్య తెలివితేటల ముందు నువ్వెందుకు పనికిరావని తెలుసుకో అని సామంత్ అంటాడు. దాంతో ఏమన్నావ్ అని కోపంగా సామంత్ కాలర్ పట్టుకుంటుంది అనామిక. నేను కూడా నీ గొంతు పట్టుకోగలను. చచ్చేదాక విడిపించుకోలేవు కూడా. కావ్య గురించి తక్కువగా అంచనా వేసి టైమ్ వేస్ట్ చేశాను కాబట్టి నిన్ను ఏమనట్లేదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు సామంత్.

ఇంత మంచి రిలేషన్‌లో అపశ్రుతి జరిగింది. మర్చిపో రాజ్ అని చెప్పిన జగదీష్ మిగతా ఆరు వారాల నగలు ఇంతే క్వాలిటీతో పూర్తి చేయిస్తే బ్యాలెన్స్ మనీ ఇచ్చేస్తాను అని వెళ్లిపోతాడు. దాంతో రాజ్ షాక్ అవుతాడు. ఇదేంటీ బ్యాలెన్స్ అమౌంట్‌లో కొంత అయినా ఇస్తాడనుకుంటే ఇలా చెప్పి వెళ్లిపోతాడు. పోనీలే ఈ గండం అయితే గట్టెక్కింది అని రాజ్ అనుకుంటాడు. తర్వాత కావ్యను రాజ్ ఎత్తుకోబోతుంటే ఆపుతుంది.

 

నా పరువు కాపాడినందుకు అభినందించాలో, ముందు జాగ్రత్తగా లాకర్‌లో కిరీటం పెట్టినందుకు మెచ్చుకోవాలో తెలియట్లేదు. ఆ ఐడియా నీకు ఎలా వచ్చింది అని రాజ్ అంటాడు. అందరూ మీలా నిజాయితీగా ఉండరు. వాళ్ల పాపాన పోతారు అనుకుంటే అది ఏదో రోజు మనకు శాపంగా మారుతుంది. అందుకే రిస్క్ తీసుకోవద్దు అని ఒరిజినల్‌ది లాకర్‌లో ఉంచాను అని కావ్య అంటుంది. చాలా బాగా చేశావ్. కానీ, ఇప్పుడు ఇంకో చిక్కు వచ్చి పడిందే అని రాజ్ అంటాడు.

డబ్బుతో అవసరం ఉండదు

జగదీష్ అమౌంట్ ఏం ఇవ్వకుండా వెళ్లిపోయారు. అకౌంట్‌లో ఒక్క రూపాయి లేదు అని రాజ్ అంటాడు. దానికి ఎందుకు టెన్షన్ పడటం. ఆయన ఇచ్చిన ఐదు కోట్ల అడ్వాన్స్‌తో ఏడు వారాల నగలకు సరిపోయే గోల్డ్ కొనేశాం. ఇప్పట్లో మనం గోల్డ్ కొనాల్సిన అవసరం లేదు. ఉన్న గోల్డ్‌తో కాంట్రాక్ట్ పూర్తి అవుతుంది కాబట్టి డబ్బుతో ఇప్పట్లో అవసరం ఉండదు అని కావ్య అంటుంది. కానీ, ఇప్పుడు అకౌంట్ జీరో అయింది అని రాజ్ అంటాడు.

ఎన్ని జీరోలు ఉంటే వాటి పక్కన అన్ని అంకెలు వచ్చి చేరుతాయి అని కావ్య అంటుంది. నువ్ చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తావ్. ఐ లైక్ ఇట్ అని రాజ్ అంటాడు. ఇక వెళ్దామా.. బూత్ బంగ్లాకి అని కావ్య అంటే రాజ్ షాక్ అవుతాడు. దాంతో ఇంటికి వెళ్దాం అని కావ్య అంటుంది. మరోవైపు ఇంటికి ధాన్యలక్ష్మీ మేనమామ వస్తాడు. దాంతో తనపై ప్రేమతోనే పుట్టింటి నుంచి మేనమామ వచ్చాడని ధాన్యలక్ష్మీ గొప్పలు చెబుతుంది.

 

అంతేకాదమ్మా, మీ ఆయన ఫోన్ చేశాడు. కంపెనీకి ఏదో కాంట్రాక్ట్ వచ్చిందని, మా దగ్గర ఉన్న గోల్డ్ బిస్కెట్స్ కొంటానని చెప్పాడని అతను అంటాడు. ఆ ఆర్డర్ పూర్తి చేయాలంటే చాలా గోల్డ్ కావొస్తుందని, బయట ఎవరికో లాభాలకు అమ్మడం కంటే రెండేళ్ల క్రితమే ఉన్న రేట్‌ను మనకు ఇవ్వమని అడిగాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. రాజ్ రాగానే ఈ డీల్ పూర్తి చేయాలి అని ప్రకాశం అంటాడు. చాలా సంతోషం ఇప్పుడున్న మార్కెట్ రేట్ కంటే పాత రేట్‌కే ఇస్తున్నారంటే నిజంగా మాకు హెల్ప్ అవుతుంది అని సుభాష్ అంటాడు.

మంచి ఆఫర్

మా మేనకోడలు ఇచ్చిన ఇంటికి ఆ మాత్రం చేయకపోతే ఎలా. నిజానికి రెగ్యూలర్‌గా తీసుకునేవాళ్లు ఇప్పటి రేట్‌కే తీసుకుంటామన్న నువ్ ఫోన్ చేశావని వాళ్లను కాదని నీకుస్తున్నాను అని అతను అంటాడు. నేను కూడా మీకుచ్చిన మాట తప్పను కదా అని ప్రకాశం అంటాడు. ఇంతలో రాజ్ కావ్య వస్తారు. ఈయనే శీను బాబాయ్, మీ పిన్ని వాళ్ల మేనమామ అని పరిచయం చేస్తాడు ప్రకాశం. మనకోసం మంచి ఆఫర్‌తో వచ్చారు. నిజానికి నేనే పిలిపించాను. కాకపోతే ఆయన లిక్విడ్ క్యాష్ అడిగారు. నేను ఒప్పుకున్నాను అని ప్రకాశం అంటాడు.

 

దాంతో ధాన్యలక్ష్మీ అసలు విషయం చెబుతుంది. చిన్న మావయ్య మీరు మంచి మనసుతో ఈ ఆఫర్ తీసుకొచ్చారు. కానీ, కాంట్రాక్ట్స్ అన్నింటికి కావాల్సిన గోల్డ్ పర్చాస్ చేసి స్టాక్ పెట్టేసాం కూడా. అంత గోల్డ్ మనకు ఇప్పట్లో అవసరమే రాదు. అయినా అంత గోల్డ్ మనకు అంత లాస్‌లో ఇస్తున్నారంటే అని కావ్య అంటుంది. అంటే మా మేనమామనే అనుమానిస్తున్నావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏమ్మా గోల్డ్‌తో ఎవరికీ అవసరం ఉండదు. పైగా అంత గోల్డ్ ఎవరికీ అమ్మకుండా పాత రేట్‌కే ఇస్తానంటున్నాను కదా అని శీను అంటాడు.

స్టాక్ పెట్టుకుంటే ఏమవుతుంది. అదేం పాడయ్యేది కాదు కదా అని సుభాష్ అంటాడు. కానీ, మావయ్య అని కావ్య అంటుంటే.. నువ్ ఆగమ్మా. ఇంత మంచి డీల్ గురించి చెప్పిన నువ్ అడ్డుపడతావేంటీ. నువ్ ఇప్పుడిప్పుడే బిజినెస్ విషయాలు నేర్చుకుంటున్నావ్. గోల్డ్ మన దగ్గర ఎంతుంటే అంత మంచిది. ఏరా నువ్వేంటీ నోరు విప్పట్లేదు అని ప్రకాశం అంటాడు. దాంతో ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంతా అంటారు.

బాగా బుద్ధి చెప్పావ్

ఇక చాలు ఆపండి అని శీను ఫైర్ అవుతాడు. మీ ఆయన మాటకు, నీ మాటకి ఇంట్లో ఎంత విలువ ఉందో అర్థమైంది. ఏ ప్రకాశం నువ్ మీ ఇంట్లో ఎంత చెబితే అంత అని గొప్పలు చెప్పావ్ కదా. నీకున్న విలువ ఏంటో ఇప్పుడు బాగా అర్థమైంది. నిన్ను నమ్మి ఎంతో లాస్‌కు మీకిద్దామనుకున్న. దానికి బాగా బుద్ధి చెప్పావ్. ఇప్పుడు నాకెంత లాసో తెలుసా. ఛీ ఛీ ఏ మనిషివయ్యా నువ్ అని శ్రీను బాబాయ్ అంటాడు. మావయ్య ఆగండి అని ధాన్యలక్ష్మీ అంటుంది.

 

ఎందుకమ్మా. మీ ఇంట్లో మీకు జరిగే అవమానం చూడటానికా. వాళ్లంతా ఒక్కటే. మీకు ఇంట్లో గురువింజకున్నంత విలువ కూడా లేదు అని శ్రీను అంటే.. మీరు అపార్థం చేసుకుంటున్నారు అని కావ్య అంటుంది. బాగానే అర్థం చేసుకున్నాను. మీ ఆయన్ను మాట్లాడనివ్వకుండా నువ్వే బాగా మాట్లాడుతున్నావ్ కదా. అందరు కలిసి బాగానే బుద్ధి చెప్పారు. ఇంకోసారి మీ ఇంటికి పిలిస్తే చచ్చినా రాను అని శ్రీను బాబాయ్ వెళ్లిపోతాడు.

భగవంతుడా ప్రతిరోజు నిజం బయటపెట్టే పరిస్థితి ఎందుకు కల్పిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని కావ్య అనుకుంటుంది. మీరు బాగా అలసిపోయారు. పదండి అని రాజ్‌ను కావ్య అంటుంది. దాంతో ధాన్యలక్ష్మీ కోప్పడుతుంది. రాకరాక మా పుట్టింటి నుంచి ఒక్క మనిషి వస్తే ఆయన ముందు నన్ను, నా భర్తను పూచిక పుల్లలా తీసి పడేశారు. ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఏంట్రా ఇది ఇదేనా మీరిచ్చే మర్యాద. ఇలాగేనా అవమానించేది అని ప్రకాశం అంటాడు.

దారుణంగా అవమానించారు

నిన్న గాక మొన్న ఆఫీస్‌లో అడుగుపెట్టిన కావ్యకు ఏం తెలుసు మన బిజినెస్ గురించి. కావ్య వద్దనగానే నువ్వు వంతపాడుతావా అని ప్రకాశం అంటాడు. కంపెనీ విషయాలు నువ్ చూసుకోవాలి కానీ, మట్టి పిసుక్కునే నీ భార్యకు ఎందుకు వదిలేశావ్. ఇది కావాలనే చేశారు. ఆస్తి అడగానని నా మీద పీకల మీద కోపం పెట్టుకుని ఇప్పుడు దారుణంగా అవమానించారు. ఇప్పుడు ఇది మా పుట్టింటి బలగం ముంది నా పరువు తీస్తాడు. అందుకే ఆయన్ను అవమానించింది అని ధాన్యలక్ష్మీ అంటుంది.

 

దాంతో రుద్రాణి మరింత రెచ్చగొడుతోంది. నిలదీయాల్సిన సమయంలో కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు. కంపెనీ వ్యవహారాల్లో కూడా కోడలు ఎంత నష్టం తెచ్చిందో, ఎంత లాభం పొగొట్టిందో తెలియట్లేదా. ధాన్యలక్ష్మీ, చిన్న మావయ్యకు ఇంత అవమానం జరుగుతుంటే ఓ పెద్ద మనిషి ముందు మందలించాలని అనిపించలేదా అని రుద్రాణి అంటుంది. నన్ను ఓ మనిషిలా చూస్తేనే కదా అని ప్రకాశం అంటాడు. ఇప్పుడు అర్థమైందా మీకు. ఆస్తి కావాలని ఎందుకు గొడవ చేశానో అర్థమైందా అని ధాన్యలక్ష్మీ అంటుంది.

మొదటి నుంచి మనల్ని వేరుగానే చూస్తున్నారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఎవరేంటో తెలుసుకోండి. రాను రాను మనకు ఒక్క ముద్ద పెట్టడం దండగ అనే రోజులు వస్తాయి అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఆపండి. మీరు ఏదేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. నాకు అది అర్థం కావట్లేదు. మీకు ఇదివరకే చెప్పాను. కంపెనీకి సంబంధించి ఏ నిర్ణయమైన ఇక నుంచి నేనే తీసుకుంటాను. ఇందులో సంబంధం లేనివాళ్లు జోక్యం చేసుకుంటే నేను ఊరుకోను అని కావ్య వెళ్లిపోతుంది.

చిన్నన్నయ్య కూడా మన సైడే

దాంతో అంతా షాక్ అవుతారు. రాజ్ కూడా వెళ్లిపోతారు. ఇన్నాళ్లు మహాలక్ష్మీ అని నెత్తిన పెట్టుకున్నారు. ఇప్పుడుమంటారు. ఇవాళ నాకు, నా భర్తకు అవమానం జరిగింది. రేపు నా కొడుకు ఇదే జరుగుతుంది. ఇది మా కర్మ అని సర్దుకోవాలా అని ధాన్యలక్ష్మీ వెళ్లిపోతుంది. ప్రకాశం కూడా మాట్లాడుకుండా వెళ్లిపోతాడు. ఇక చిన్న అన్నయ్య కూడా మన సైడే అని రుద్రాణి సంతోషపడుతుంది. తర్వాత రాత్రి సుభాష్ దగ్గరికి ప్రకాశం వస్తాడు.

 

మొదటి సారి అవమానం ఎలా ఉంటుందో రుచి చూశాను. అందుకే నిద్ర పట్టట్లేదు. ఈరోజు ఈ ఇంట్లో నా స్థానం ఏంటో అర్థమై బాధపడుతున్నాను. ధాన్యలక్ష్మీ ఎంత చెప్పిన దానికి బుద్ధి చెప్పాను కానీ, ఎవరిని ఏం అనలేదు. ఏం జరిగినా అడగడానికి నువ్వు ఉన్నావనే ధైర్యం. ఈరోజు నా ఇంట్లో నా వాళ్ల ముందు నా భార్య ముంది నాకు అవమానం జరిగింది. నా మాటకు విలువలేకపోయింది. నేను చేసిన దాంట్లో తప్పుందా. ఆ డీల్ వల్ల మనకు లాభం ఉందనే కదా ఒప్పించి తీసుకొచ్చాను అని ప్రకాశం బాధపడుతాడు.

కావ్య వచ్చి సింపుల్‌గా వద్దంది. నా ఇంటికి నేను మంచి చేయడం కూడా తప్పేనా. ఆ డీల్ వద్దనడానికి ఒక్క స్ట్రాంగ్ రీజన్ చెప్పమను అని ప్రకాశం అంటాడు. ఏం చెప్పాలిరా. కావ్య ఎందుకు అలా ప్రవర్తిస్తుందో. రాజ్ ఎందుకు నోరు మెదపలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అలాగని వాళ్లు తప్పుగా నిర్ణయం తీసుకోరనే నమ్మకం ఉంది అని సుభాష్ అంటాడు. 

నాన్నగారి నమ్మకం నిలబెట్టాలనుకోవడం తప్పులేదు అన్నయ్య. కానీ, ఇంట్లో వాళ్ల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడటం తప్పే అని ప్రకాశం అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner
 

టాపిక్

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024