Best Web Hosting Provider In India 2024
OTT Crime Thriller: ఓటీటీలో అదరగొడుతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. నాలుగు వారాలుగా టాప్‍లో ట్రెండింగ్
OTT Crime Thriller: డిస్పాచ్ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. టాప్‍లో ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ మనోజ్ బాజ్‍పేయ్ నటించిన సినిమాలు, సిరీస్‍లకు ఓటీటీల్లో మంచి క్రేజ్ ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్‍తో పాటు మనోజ్ నటించిన మరిన్ని సిరీస్‍లు, చిత్రాలు ఓటీటీల్లో సత్తాచాటాయి. తాజాగా మనోజ్ నటించిన మరో మూవీ ఓటీటీలో దుమ్మురేపుతోంది. ఆ చిత్రమే ‘డిస్పాచ్’. ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చింది. మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా.. వ్యూస్ మాత్రం భారీగా దక్కించుకుంటోంది ఈ మూవీ. నేషనల్ వైడ్‍గా ట్రెండ్ అవుతోంది. ఆ వివరాలు ఇవే..
నాలుగు వారాలుగా టాప్‍లో..
డిస్పాచ్ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్ అవుతోంది. నాలుగు వారాలుగా ఆ ఓటీటీ ఇండియా ట్రెండింగ్‍లో టాప్‍లో కొనసాగుతోంది. మంచి వ్యూస్ సాధిస్తోంది. ఈ సినిమా జీ5 ఓటీటీలో గత నెల డిసెంబర్ 13న స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆరంభం నుంచి వ్యూస్‍లో దూసుకెళుతోంది. వీక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు వస్తున్నా.. వ్యూస్‍లో మాత్రం ఈ చిత్రం అదరగొడుతోంది.
ఓ మర్డర్, భారీ స్కామ్‍ను బయటపెట్టేందుకు ఓ జర్నలిస్ట్ కష్టపడడం, ఆ క్రమంలో బయటపడే షాకింగ్ విషయాలతో డిస్పాచ్ మూవీ సాగుతుంది. ఈ చిత్రానికి కనూ బెహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మనోజ్ బాజ్‍పేయ్‍తో పాటు సహానా గోస్వామి, అర్చితా అగర్వాల్, రితుపర్ణ సేన్, రిజు బజాజ్, ఆనంద్ అకుంటే, పృథ్విక్ ప్రతాప్, వీనా మెహతా కీలకపాత్రలు పోషించారు.
డిస్పాచ్ చిత్రంలో క్రైమ్ రిపోర్టర్ జాయ్ బేగ్ పాత్రలో మనోజ్ అదరగొట్టేశారు. తన నటనతో మెప్పించారు. ఈ సినిమాను ఆర్ఎస్‍వీపీ పతాకంపై రోనీ స్క్రూవాలా నిర్మించారు. సిద్ధార్థ్ దివాన్ సినిమాటోగ్రఫీ చేశారు. ఈ మూవీ జీ5 ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి.
డిస్పాచ్ స్టోరీలైన్
డిస్పాచ్ అనే న్యూస్ పేపర్‌లో క్రైమ్ జర్నలిస్టుగా జాయ్ బేగ్ (మనోజ్ బాజ్‍పేయ్) విధులు నిర్వహిస్తుంటాడు. ప్రింట్ న్యూస్ ఎప్పటికీ నిలిచి ఉండాలని తపన పడుతుంటాడు. ప్రేరణతో లవ్‍లో పడి.. భార్య శ్వేత (సహానా గోస్వామి)కి విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతాడు. ఈ క్రమంలోనే బిగ్ స్కామ్ గురించి జాయ్‍కు తెలుస్తుంది. దేశాన్నే ఆశ్చర్యపరిచేంత పెద్ద స్కామ్ అది అని తెలుసుకుంటాడు. ఓ హత్యతో ఇది బయటపడుతుంది. అండర్ వరల్డ్, కొందరు పోలీసులు ఈ స్కామ్‍లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.. ఈ స్కామ్‍ను జాయ్ ఎలా బయటపెట్టాడు.. ఎదురైన సవాళ్లు ఏంటి అనే అంశాల చుట్టు డిస్పాచ్ మూవీ సాగుతుంది.
సంబంధిత కథనం