Gunde Ninda Gudi Gantalu: సత్యం తల్లి చనిపోయినట్లు చెప్పిన ప్రభావతి- మౌనికకు గాజులు తొడిగిన బాలు- శోభన కన్నింగ్ ప్లాన్!

Best Web Hosting Provider In India 2024

Gunde Ninda Gudi Gantalu: సత్యం తల్లి చనిపోయినట్లు చెప్పిన ప్రభావతి- మౌనికకు గాజులు తొడిగిన బాలు- శోభన కన్నింగ్ ప్లాన్!

 

Gunde Ninda Gudi Gantalu Serial January 8th Episode: గుండె నిండా గుడి గంటలు జనవరి 8 ఎపిసోడ్‌లో మౌనిక ఇంటికి వెళ్లనని బాలు దగ్గర మాట తీసుకుంటాడు సత్యం. తర్వాత టిఫిన్ చేస్తుండగా.. సత్యం తల్లి సుశీల గురించి బాలు అడిగితే.. తను చనిపోయనట్లుగా చెబుతుంది ప్రభావతి. దాంతో అంతా షాక్ అవుతారు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 8 ఎపిసోడ్‌
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జనవరి 8 ఎపిసోడ్‌
 

Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో మౌనిక ఇంటికి బాలు వెళ్తానంటే మనోజ్ ఆపుతాడు. ఎందుకీ గొడవలు, వీళ్లు చెబుతున్నారు కదా అని మీనా నచ్చజెబుతుంది. ఏంటండి వీడు. వీడి గోల వీడిదేనా. మనం చెప్పింది వినడా అని ప్రభావతి అంటుంది. ఇంతలో మనోజ్‌ను తోసేసి బాలు వెళ్లబోతుంటే సత్యం పిలుస్తాడు. దాంతో బాలు ఆగిపోతాడు.

అక్కడికి వెళ్లనని మాటివ్వు

నేను నలుగురు పిల్లల తండ్రిని. నీకన్న అనుభవం ఎక్కువ ఉందిగా. వీళ్లను వదిలేయ్ నన్ను నమ్ముతావు కదా. ఏ తండ్రి కన్నకూతురు అత్తింట్లో కష్టపడటం చూడడు. మౌనిక అత్తింట్లో కష్టపడట్లేదు. అలా అని మౌనిక గానీ, చుట్టుపక్కల వాళ్లు నీకు చెప్పలేదు. ఇదంతా నీకు లేనిపోని భయం అంతే. మౌనిక అక్కడ సంతోషంగా ఉంటుంది. నీకు మాద ఏమాత్రం గౌరవం ఉన్న అక్కడికి వెళ్లనని నాకు మాటివ్వు అని సత్యం అంటాడు. వీడికి ఆయనే కరెక్ట్ అని ప్రభావతి అనుకుంటుంది.

మాట ఇవ్వు అని బాలు చేయి తీసుకుని తన చేతిలో వేసుకుంటాడు సత్యం. సరే తను ఎలా ఉందో చూసి వస్తాను బాలు అంటాడు. అబ్బా మళ్లీ అలాగే అంటావేంట్రా. వెళ్లి గొడవ చేసి వాళ్ల మధ్య చిచ్చు పెట్టి రా. మీ మీద గౌరవంతోనే నిన్ను ఏమనకుండా వదిలేశారు. కాదు గీదు అని వెళ్తే కచ్చితంగా నీ మీద కోపంతో దాన్ని సాధిస్తారు అని ప్రభావతి అంటుంది. వద్దురా బాలు వెళ్లకు. వెళ్లడమే కాదు. కొన్నాళ్లపాటు తనకు ఫోన్ కూడా చేయకు. లోపలికి వెళ్లు అని సత్యం అంటాడు.

 

దాంతో బాలును పైకి తీసుకెళ్తుంది మీనా. దాంతో తలుపును తంతాడు బాలు. అత్యాశతో ఆడపిల్ల గొంతు కోశారు అని బాలు అంటాడు. ఇప్పుడేం కాలేదు కదా అని మీనా అంటుంది. నువ్ అలాగే అంటావేంటీ అని బాలు అంటే.. ఇక్కడ మీ మాట కాదనకూడదు. అక్కడ అత్తకు ఎదురుచెప్పకూడదు. కొన్నిసార్లు నలుగురితో నారాయణ అనాలి అని మీనా అంటుంది. ఓహో.. ఇప్పుడు వాళ్లతోపాటే మా బావ బంగారం అంటూ భజన చేస్తుండాలి అని బాలు అంటాడు.

అనుభవంతోనే తెలుసుకోవాలి

లేదండి. ఇప్పుడు మన మాట ఎవరు నమ్మనప్పుడు కొంతకాలం ఆగాల్సిందే. ఇప్పుడు ఇంట్లోవాళ్లంతా సంజు మైకంలో ఉన్నారు. ఇప్పుడేం చెప్పిన మనల్లే అంటారు. మౌనిక కూడా అతని నమ్మే పెళ్లి చేసుకుంది. తనకు సంజు అంటే కొంత తెలుస్తుంది. తర్వాత మనకు చెబుతుంది కదా. కొన్ని విషయాలు మనం చెప్పడంకంటే వారి అనుభవంతోనే తెలుసుకోవాలి కదా అని మీనా అంటుంది. మీరంతా నా నోరు నొక్కేస్తున్నారు అని బాలు అంటాడు.

కోరికోరి గొడవలెందుకు తెచ్చుకోవడం అంటున్నా అన్న మీనా రాత్రి ఇచ్చిన గాజులు తీసుకొచ్చి చూపిస్తుంది. రాత్రి బాలు చెప్పిన మాటలు చెబుతుంది మీనా. మీరు కోపాన్ని ఆపుకోలేరు, ప్రేమను ఆపుకోలేరు. అది మనోజ్, మీ అమ్మకు తప్పా అందరికీ తెలుసు. మౌనిక కూడా తనకోసం ఏదో కొనింటారని ఊహించే ఉంటుంది. కానీ, అంతా గందరగోళం అయిపోయింది. ఆ దేవుడి దయ వల్ల అతనిలో మార్పు వచ్చి ఈ పగలు, కోపాతాపాలు పోయి మౌనికను బాగా చూసుకునే రోజు వస్తుంది. అప్పుడే మౌనిక కాల్ చేసి సంతోషంగా ఉన్నాను. నన్ను చూడటానికి రావా అని అంటుందని మీనా అంటుంది.

 

అప్పుడు మీరే వెళ్లి ఈ గాజులు వేయండి అని మీనా అంటుంది. నిజంగా ఆరోజు వస్తుందా అని బాలు అంటాడు. కాలం ఎప్పుడు ఒకలా ఉండదు. మీరు గాజులు కొనడంతో దిట్ట కదా. భార్యకు, చెల్లెలికి ఏ గాజులు కొనాలో బాగా తెలుసు అని మీనా అనడంతో బాలు నవ్వుతాడు. బాగా అరిచారు. తినేసి గుడిగి వెళ్దాం అని మీనా అంటుంది. తర్వాత బాలు టిఫిన్ తింటుంటే ప్రభావతి వచ్చి మాటలు అంటుంది. దాంతో బాలు పంచ్‌లు వేస్తాడు. అప్పుడే మనోజ్, రోహిణి వస్తారు.

చనిపోయినట్లు మాట్లాడిన ప్రభావతి

నీ గురించే అనుకుంటున్నాంరా. నువ్ లక్షలు మింగేయడం గురించి తలుచుకుంటున్నాం అని బాలు అంటాడు. వీడొకడు పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకుంటాడు అని మనోజ్‌ను ప్రభావతి అంటుంది. మీ అన్నయ్యను, ఆంటీని అనకుండా ఉంటే మింగుడు పడదు కదా అని రోహిణి అంటుంది. ఆయన సైలెంట్‌గానే తింటున్నారు. అది చూడలేక అంటేనే అన్నారు అని మీనా అంటుంది. సత్యం వచ్చి టిఫిన్ చేస్తాడు.

సరే షీలా డార్లింగ్ ఎక్కడ. కనిపించట్లేదు అని నానమ్మ సుశీల గురించి బాలు అడుగుతాడు. ఇంకెక్కడ డార్లింగు.. ఆవిడెప్పుడో పోయారు కదా అని చనిపోయినట్లు అంటుంది ప్రభావతి. దాంతో అంతా షాక్ అయి చూస్తారు. అలా చూస్తారేంటీ. నేనేమన్నాను. ఊరికెళ్లిపోయిందిగా అన్నాను అని ప్రభావతి అంటుంది. అది పూర్తిగా చెప్పి ఏడు అని సత్యం అంటాడు. నాకు చెప్పకుండానే వెళ్లిపోయిందా అని బాలు అంటాడు. అప్పుడు నువ్ నిద్రపోతున్నావని, నీకు చెప్పమని మాకు చెప్పి వెళ్లిపోయిందని సత్యం అంటాడు.

 

వాడు ఇబ్బందిపడకూడదు. పీకల దాకా తాగిన, గొడవలు పడ్డా ఏమనకూడదు అని ప్రభావతి అంటుంది. నాన్నకు నేనేంటో బాగా తెలుసు. ఏం అనాలో వద్దో నువ్ చెప్పాల్సిన అవసరం లేదు అని బాలు అంటాడు. అబ్బా వదిలేయ్ ప్రభ. తినేటప్పుడు కూడా ఏంటీ. కొడుకు అని చూడకుండా ఎప్పుడు ఏదోటి అంటావ్ అని సత్యం అంటాడు. ఆ ఈ కొడుకుతోపాటు అందరికి దూరంగా దిక్కు మొక్కు లేకుండా ఉంటున్న చిన్న కొడుకును కూడా ఇంటికి తీసుకురండి అని ప్రభావతి అంటుంది.

సాంప్రదాయబద్ధంగా రానిస్తేనే

పాపం పసోడు. ఏదో ప్రేమించి పెళ్లి చేసుకుంటే వదిలేయాలా. అంతకుమించిన తప్పేంట్రా అని ప్రభావతి అంటుంది. వాడి వల్ల ఓ అమాయకురాలు ఇక్కడ బలైంది అని సంజు రివేంజ్ మీనింగ్‌లో అంటాడు బాలు. నువ్ ఆగురా. చెప్పా కదా. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి సాంప్రదాయబద్ధంగా వస్తేనే రానిస్తాను. లేదంటే రానివ్వను అని సత్యం అంటాడు. ఎలా రానివ్వరో అది చూస్తాను అని ప్రభావతి మనసులో అనుకుంటుంది.

అది జరగదు నాన్న. వాళ్ల ఇంట్లో అందరికి కొవ్వే. అది చూశాం కదా అని బాలు అంటాడు. తర్వాత గుడికి వెళ్తున్నట్లు చెబుతాడు బాలు. ఏదైనా మొక్కుకున్నారా అని సత్యం అంటాడు. అలాంటిదేం లేదు. ఈయన మానసికంగా కుంగిపోయారు. కాస్తా ప్రశాంతంగా ఉంటారని అని మీనా చెబుతుంది. అంతేనా లేదా గుట్టుగా ఇంకెక్కడికైనా అని ప్రభావతి అనుమానిస్తుంది. అలాంటిదేం లేదు. భయపడాల్సిన అవసరం లేదు అని మీనా అంటుంది.

 

వీడు బయటకెళ్తే ఏ గొడవ తీసుకొస్తాడో అని మనోజ్ అంటే.. వచ్చినా నువ్వేం చేయలేవు కదరా అని బాలు అంటాడు. నువ్ ఆ శ్రుతి వాళ్ల దగ్గరికి వెళ్లి కాళ్లవేళ్ల పడకు. నీ కకృతి ఎంత దూరమైన తీసుకెళ్తుంది. నేను మౌనిక దగ్గరికి వెళ్లనట్టే నువ్ శ్రుతి వాళ్ల దగ్గరికి వెళ్తే నీ మీద ఒట్టే అని ప్రభావతి మీద ఒట్టేసి వెళ్లిపోతాడు బాలు. మరోవైపు సురేంద్ర తాగుతూ ఉంటాడు. అన్ని పనులు మానేసి ఇదేపనిగా తాగుతున్నారు. ఎందుకిలా అని శోభ అంటుంది.

నా కళ్ల ముందే కూర్చుని

నీ కూతురు చేసిన పని తలుచుకుంటుంటే రోజు రోజుకు నా కోపం కట్టలు తెంచుకుంటుంది. అది తగ్గడానికి ఇది తప్పా ఇంకోటి తెలియట్లేదు. మన పరువు తీసిన కూడా వెళ్లావ్ కదా. ఏమంది మరి. మీరింకా బతికే ఉన్నారా అని అడిగిందా అని సురేంద్ర అంటాడు. అది అడగలేదు. దాన్ని చూడగానే ఇందుకేనా నేను బతికి ఉంది అనిపించింది. అక్కడికి వెళ్లేసరికి పనికిమాలిన ప్రభా అక్కడే ఉంది. 22 ఏళ్ల క్రితం దాని ఉద్యోగం పోకుండా ఉండేందుకు నా దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని నిలబడింది. ఇప్పుడు నా ముందే సోఫాలో కూర్చుని వాళ్లను మచ్చిక చేసుకుంటుంది అని శోభ అంటుంది.

 

అది చూసి నిజంగానే చచ్చిపోవాలనిపించింది అని శోభ అంటుంది. 22 ఏళ్లలో ఒకటి రెండు సార్లు చూసుంటావ్. దానికే ఇలా అనిపిస్తే.. రోజు నాకు వంగి వంగి దండాలు పెట్టేవాడు నాకు వియ్యంకుడు అయ్యాడంటే ఈ మందు కాదు ఇంకేదైనా తాగి చనిపోవాలని ఉంది అని సురేంద్ర అంటాడు. జరిగిపోయిందేదో జరిగిపోయింది. కానీ, శ్రుతి కష్టాల్లో ఉంది. ఆ ప్రభా వాళ్ల దగ్గరికి వచ్చింది మనం వాళ్లను వాళ్ల ఇంట్లో సాంప్రాదయబద్ధంగా దింపమని అని శోభన చెబుతుంది.

ఏం మాట్లాడుతున్నావ్. వాళ్లు చెప్పగానే గొర్రెల తల ఊపి వచ్చావా. వాళ్లను నవ్వుతూ పంపించాలా అని సురేంద్ర అంటాడు. నేను మీ పగను, పంతాన్ని కూడా పంచుకోవాల్సినదాన్ని. మనకి ఇలా చేసిన ఆ సత్యాన్ని, వాడి భార్యను రోజు రోజు ఏడ్చేలా చేయాలి. దానికోసమైనా మీరు అక్కడికి రావాలి అని శోభన చెబుతుంది. తర్వాత గుడిలో బాలు మీనాను మౌనిక చూస్తుంది. వాడు ఎలా చూసుకుంటున్నాడు అని అడుగుతారు.

మౌనిక అబద్ధం

వాడు మీ మీద కోపంతో నా జీవితం బలి చేశాడని చెబితే నువ్ వాడిని బతకనిస్తావా అని మనసులో అనుకున్న మౌనిక బాలుతో మాత్రం బాగా చూసుకుంటున్నాడు అని అబద్ధం చెబుతుంది. తర్వాత మౌనికకు బాలు గాజులు వేస్తాడు. అక్కడికి వచ్చి సంజు వాళ్లను చూసినట్లుగా చూపిస్తారు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024