Best Web Hosting Provider In India 2024
Baby Names: రామాయణంలోని సీతా దేవి పేరును మీ ఆడబిడ్డకు పెట్టాలనుకుంటున్నారా? ఇదిగో కొన్ని చక్కటి పేర్లు
Baby Names: మీ కూతురి కోసం అందమైన పేరు వెతుకుతున్నారా? ఇక్కడ మేము సీతాదేవి పేర్లను ఇచ్చాము. ఆమెకున్న అందంతో, వినయంతో స్త్రీజాతికి ఆదర్శంగా నిలిచింది సీతమ్మ. ఆమె అందమైన పేర్లలో నచ్చినదాన్ని ఎంపిక చేసుకుని మీ పిల్లలకు పెట్టండి.
ఇంట్లో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మీ పుట్టిందని ఆనందించే కుటుంబాలు ఎన్నో. ఆమెకు అందమైన పేరు పెట్టేందుకు తల్లిదండ్రులే కాదు కుటుంబమంతా వెతుకుతూ ఉంటుంది. హిందూ మతంలో చాలా మంది తమ పిల్లలకు దేవుళ్ళుసంబంధం ఉన్న పేర్లను పెట్టడానికి ఇష్టపడతారు. ఎక్కడో ఒక చోట ఆ పిల్లాడి పేరు అతని జీవితంపై ఎంతో ప్రభావం చూపుతుందని నమ్ముతారు. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు అందమైన దేవుడి పేరు పెడతారు. మీరు కూడా మీ పాపకు అందమైన, అర్థవంతమైన పేరు కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మేము సీతాదేవి పేర్లను ఇచ్చాము. మీకు నచ్చిన పేరును ఎంపిక చేసుకోండి.
అమ్మాయిలకు పెట్టేందుకు సీతమ్మ పేర్లు
* సియా: ఇది సీతమ్మ పేరు. మీరు మీ కుమార్తెకు చిన్న పేరును వెతుకుతున్నట్టయితే ఈ పేరును పెట్టవచ్చు. దీనికి అర్థం పరిపూర్ణత అని అర్థం.
* మృణ్మయి: మట్టి నుంచి జన్మించిన సీతాదేవిని మృణ్మయి అని కూడా పిలుస్తారు. ఇది చాలా ప్రత్యేకమైన, ప్రేమపూర్వకమైన పేరు.
* క్షితిజ: సీతాదేవికి ఉన్న అనేక నామాల్లో ఇది కూడా ఒకటి. మీరు మీ కుమార్తెకు ఆధునిక పేరు పెట్టాలనుకుంటే, దీన్ని ఎంచుకోవచ్చు.
* వైదేహి: ఇది కూడా సీతాదేవికి చాలా ప్రాచుర్యం పొందిన పేరు. ఆమెకు జనక మహారాజు కుమార్తె కావడం వల్ల ఈ పేరు వచ్చింది.
* మైథిలి: జనక మహారాజును మిథిల రాజ్యాన్ని పాలించేవారు. అందుకే సీతమ్మకు మైథిలి అనే పేరు వచ్చింది.
* పార్థవి: కుమార్తె పేరు ‘ప’ అక్షరం నుంచి పుట్టినట్లయితే, తల్లి సీతాదేవితో ముడిపడి ఉన్న ఈ పేరును కూడా ఆమెకు ఎంపిక చేయవచ్చు. ఇది చాలా ప్రత్యేకమైన, అందమైన పేరు.
వాణికా: సీతాదేవి పేర్లలో వాణిక ఒకటి. సింపుల్ అండ్ క్యూట్ నేమ్ కోసం చూస్తున్నట్లైతే ప్రియమైన కూతురికి ఈ పేరు పెట్టొచ్చు.
* భూమిజ: భూగర్భం నుంచి జన్మించినందున సీతాదేవికి భూమిజ అనే పేరు కూడా వచ్చింది. మీరు ఈ అందమైన పేరును పాపకు పెట్టవచ్చు.
* జనక నందిని: జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని జనక నందిని అనే పేరు వచ్చింది. మీకు ఈ పేరు నచ్చితే పెట్టుకోవచ్చు.
* అలోకిని: సీతాదేవి పేరుకు అర్థం చుట్టూ వెలుగును వ్యాపింపజేసేది అని అర్థం.
* దేవాన్షి: కుమార్తె పేరు ‘ద’ అక్షరం నుంచి వచ్చినట్లయితే, సీతాదేవికి సంబంధించిన ఈ అందమైన పేరును కూడా ఆమెకు ఇవ్వవచ్చు.
* సీతాషి: సీతాషి అంటే తల్లి సీతాదేవి. మీరు మీ పాపకు ఈ పేరు పెట్టవచ్చు. ఆమె సద్గుణవంతు రాలిగా ఎదుగుతుంది.
* లావణ్య: ఈ అందమైన పేరు కూడా సీతాదేవితో ముడిపడి ఉంది. ఆమె అందాన్ని వర్ణిస్తుంది.
సంబంధిత కథనం