Best Web Hosting Provider In India 2024
AP Inter Exams: వచ్చే ఏడాది నుంచి ఏపీలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షల రద్దు! ఇంటర్ విద్యలో సంస్కరణలు షురూ..
AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యలో సమూల సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో ఎన్‌సిఈఆర్‌టి సిలబస్ అమల్లోకి రావడంతో దానికి అనుగుణంగా ఇంటర్ విద్యలో కూడా మార్పులు చేపట్టడానికి సిద్ధమవుతోంది.
AP Inter Exams: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యలో సమూల మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు పరీక్షల్ని నిర్వహించక పోవడంతో ఏపీలో కూడా ఈ విధానాన్ని అమలు చేసే అంశంపై సలహాలు, సూచనల ఇంటర్ బోర్డు ఆహ్వానిస్తోంది. విద్యార్థులపై ఒత్తిడి తొలగించేందుకు 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఫస్టియర్ విద్యార్థులకు వార్షిక పబ్లిక్ పరీక్షల్ని రద్దు చేయాలని ఇంటర్ బోర్డు ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై సలహాలు సూచనలు స్వీకరిస్తున్నారు.
ఏపీ, తెలంగాణ మినహా దేశంలోని ఇతర రాష్ట్రాల బోర్డులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్ని నిర్వహించడం లేదు.అత్యధిక శాతం ఇంటర్ బోర్డులు, యూనివర్శిటీల్లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షల్ని మాత్రమే నిర్వహిస్తున్నారు. ఆ మార్కుల్నే అర్హతగా పరిగణిస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్ని పరిగణలోకి తీసుకోవడం లేదు.
ఇంటర్మీడియట్ ఫస్టియర్ పరీక్షల్ని తొలగిస్తే మొదటి ఏడాది సిలబస్‌లో కీలక అంశాలపై పట్టు సాధించడంతో పాటు వాటి ఆధారంగా రెండో ఏడాది సబ్జెక్టులపై పట్టు సాధించడంతో పాటు నీట్, జేఈఈ పరీక్షల్లో విజయం సాధించడానికి వీలవుతుందని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
సైన్స్ గ్రూపుల్లో ఉమ్మడి ఏపీలో చివరి సారి సిలబస్ సవరణలు జరిగాయి. ఇంటర్ ఫస్టియర్ సిలబస్ 2021-13, సెకండియర్ 2013-14లో మార్చారు. ఆర్ట్స్ సిలబస్ 2014-16 మధ్య కాలంలో మార్చారు. లాంగ్వేజ్ సిలబస్‌ను 2018-20 మధ్య సవరించారు. దీనిపై విద్యా రంగ నిపుణులతో ఏర్పాటు చేసిన కమిటీలతో అధ్యాయనం చేసిన తర్వాత 2025-26 నుంచి ఇంటర్ విద్యలో ఎన్‌సిఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
సారూప్యత, సమానత్వం కోసం…
దేశ వ్యాప్తంగా ఇంటర్ పరీక్ష పత్రాల మూల్యాంకనంలో సీబీఎస్‌ఈ, ఇతర రాష్ట్రాల విద్యామండళ్ల సారూప్యత, సమానత్వానికి ఫస్టియర్ పరీక్షల్ని తొలగించాలని బోర్డు భావిస్తోంది.
ఇంటర్ ఫస్టియర్‌లో బోర్డు నిర్ణయించిన సిలబస్, బ్లూ ప్రింట్ ఆధారంగా ఫస్టియర్ పరీక్షల్ని కాలేజీల్లో అంతర్గతంగా నిర్వహిస్తారు. ఇంటర్ సెకండియర్ పరీక్షల్ని సెకండియర్ సిలబస్‌తో మాత్రమే నిర్వహించి ఫలితాలను విడుదల చేశారు.
ఈ ప్రతిపాదనలపై సలహాలు సూచనల్ని 2025 జనవరి 26లోపు ఇంటర్ బోర్డుకు తెలియచేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు, విద్యార్థుల తల్లదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు సూచనలు చేయాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కోరారు. ప్రతిపాదిత సంస్కరణల నమూనాలు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంటాయి. biereforms@gmail.com మెయిల్‌కు అభిప్రాయాలను పంపాల్సి ఉంటుంది.
ఇకపై 500 మార్కులకే ఇంటర్ పరీక్షలు
కొత్త ముసాయిదా ప్రకారం ఇంటర్ పరీక్షల విధానంలో కూడా సమూల మార్పులు చేస్తారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి చేపట్టే సంస్కరణల్లో ఇంటర్ పరీక్షల్ని 500మార్కులకు నిర్వహిస్తారు. ఆర్ట్స్, సైన్స్ గ్రూపుల్లో పరీక్షల్ని 500మార్కులకు పరిమితం చేస్తారు.
ఆర్ట్స్ సబ్జెక్టుల్లో సివిక్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్ వంటి సబ్జెక్టులో 100 మార్కులకు 80మార్కులకు థియరీ పరీక్షల్ని నిర్వహిస్తారు. ప్రాజెక్ట్ వర్క్, పరిశోధనా కార్యక్రమాలకు మరో 20 మార్కులు కేటాయిసతారు. ప్రతి కోర్సుకు గరిష్టంగా 500మార్కులకు పరీక్షలు జరుగుతాయి.
ఎంపీసీ గ్రూపులో 380 మార్కులకు థియరీ పరీక్షలు,120 మార్కులను ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు.ఎంపీసీ గ్రూపులో ఇంగ్లీష్‌కు 80 +20మార్కులు, ఎంచుకున్న భాషకు 80+20మార్కులు, గణితం/జీవ శాస్త్రంకు 80+20మార్కులు, భౌతిక శాస్త్రానికి 70+30, రసాయిన శాస్త్రానికి 70+30 మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్న్/ప్రాక్టికల్ తప్పని చేశారు. మొత్తం పరీక్షల్లో థియరీకి ఎంపీసీలో 380+120 సాధించాలి.
బైపీసీ గ్రూపులో 370 మార్కులను థియరీ పరీక్షలకు, 130 మార్కులను ఇంటర్నల్, ప్రాక్టికల్ పరీక్షలకు కేటాయిస్తారు.బైపీసీ గ్రూపులో ఇంగ్లీష్‌కు 80 +20మార్కులు, ఎంచుకున్న భాషకు 80+20మార్కులు, గణితం/జీవ శాస్త్రంకు 80+20మార్కులు, భౌతిక శాస్త్రానికి 70+30, రసాయిన శాస్త్రానికి 70+30 మార్కులు కేటాయిస్తారు. ప్రతి సబ్జెక్టులో ఇంటర్న్/ప్రాక్టికల్ తప్పని చేశారు.
ఇంటర్ బోర్డు పరీక్షల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, ఖాళీలను పూరించడం, ఏకపద సమాధానాలు వంటి వాటికి మార్కుల్ని ప్రతిపాదించారు. వ్యాసరూప ప్రశ్నలకు 8 మార్కులకు బదులు 5/6 మార్కులు కేటాయించాలని భావిస్తున్నారు.
ఇంటర్ బోర్డు ప్రతిపాదించిన సంస్కరణలపై సలహాలు సూచనల్ని 2025 జనవరి 26లోపు ఇంటర్ బోర్డుకు తెలియచేయాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలు, విద్యార్థుల తల్లదండ్రులు, విద్యార్థులు, విద్యావేత్తలు సూచనలు చేయాల్సిందిగా ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా కోరారు. ప్రతిపాదిత సంస్కరణల నమూనాలు ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంటాయి. biereforms@gmail.com మెయిల్‌కు అభిప్రాయాలను పంపాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం
టాపిక్