Best Web Hosting Provider In India 2024
Healthy life: ఆరోగ్యకరమైన జీవితం కోసం ఈ 3 వస్తువులను ఈ ఇంటి నుంచి బయటికి విసిరేయండి వెంటనే
Healthy life: ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కానీ ఇప్పటికీ, ప్రతి ఇంట్లో కొన్ని ఉత్పత్తులు కుటుంబంలోని వారు అనారోగ్యానికి గురి చేస్తాయి. ఇంట్లో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే మూడు రకాల వస్తువులను ఇంట్లో నుంచి బయటపడేయండి.
ప్రతి ఒక్కరూ తమ కుటుంబానికి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇంట్లో సృష్టించాలని కోరుకుంటారు. అందుకోసం ఎంతో ఖర్చుపెడతారు కూడా. కానీ ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు. ఏం చేయాలో తెలియక ఎంతో మంది ఈ విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. మీరు మీ ఆరోగ్యాన్ని, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడాలనుకుంటే కొన్ని వస్తువులను మీ ఇంట్లో ఉంచకూడదు.
ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు విష వాతావరణాన్ని పెంచుతాయి. వీటి వల్ల రోగాల ముప్పు చాలా రెట్లు పెరుగుతుంది. దీనిపై వాస్కులర్ సర్జన్, వెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ సుమిత్ కపాడియా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ ద్వారా కొన్ని వస్తువులను ఇంటి నుండి బయట పడేయాలని సూచించారు. వీటిని వాడటం వల్ల వ్యాధుల ముప్పు పెరుగుతుంది. వైద్యులు చెప్పిన ప్రకారం ఇక్కడ చెప్పిన మూడు ఉత్పత్తులు మీ ఇంట్లో ఉంటే వెంటనే తీసి పడేయండి. వాటిని వాడడం మానేయండి.
నాన్ స్టిక్ కుక్ వేర్
ప్రతి వంటగదిలో నాన్ స్టిక్ పాన్ లను ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. అవి చూసేందుకు ఎంతో అందంగా, వాడేందుకు సౌకర్యంగా ఉంటాయి. అందుకే వాటిని వినియోగించే వారి సంఖ్య అధికంగా ఉంది. కానీ వాటి తయారీలో పిఎఫ్ఓఎ అంటే పెర్ఫ్లోరో ఆక్టానోయిక్ ఆమ్లం వంటి రసాయనాలు వాడతారు. ఇవి వేడి చేసినప్పుడు విషపూరిత పొగలను విడుదల చేస్తాయి. ఈ రసాయనాలు శరీరంలో చేరితే హార్మోన్ల అంతరాయం, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉన్నాయి. సురక్షితమైన వంట ఎంపిక కోసం స్టెయిన్లెస్ స్టీల్ లేదా కాస్ట్ ఐరన్ పాత్రలను ఎంచుకోవాలని నిపుణులు అంటున్నారు.
ఎయిర్ ఫ్రెషనర్లు
ఇల్లు పరిశుభ్రంగా ఉండేందుకు, దుర్వాసన వేయకుండా ఉండేందుకు ఎయిర్ ఫ్రెషనర్లు, సువాసన కొవ్వొత్తులు వంటివి ఇంట్లో వాడతారు. అవి మీ ఇంటిని సువాసనతో నిండేలా చేస్తాయి. కానీ చాలా ఎయిర్ ఫ్రెషనర్లు, సువాసన కొవ్వొత్తులలో థాలేట్స్ తో పాలూ ఇండోర్ గాలి నాణ్యతను ప్రభావితం చేసే ఇతర హానికరమైన పదార్థాలు ఉంటాయి. ఈ రసాయనాలు శ్వాసకోశ సమస్యలు, అలెర్జీలకు కారణం అవుతాయి. టాక్సిన్స్ లేకుండా మీ ఇంటిని తాజాగా ఉంచడానికి ముఖ్యమైన నూనెలు లేదా మైనపు కొవ్వొత్తులు వంటి సహజ ప్రత్యామ్నాయాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి.
ఇంటిని శుభ్రపరిచే ఉత్పత్తులు కఠినమైన రసాయనాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మం ద్వారా శరీరంలో చేరి ఆరోగ్యానికి నష్టాన్ని కలిగిస్తాయి. బ్లీచ్, అమ్మోనియా, ఇతర సింథటిక్ సువాసన ఉత్పత్తులను వాడకూడదు. వీటికి బదులు వెనిగర్, బేకింగ్ సోడా, నిమ్మరసం వంటి వాటితో క్లీనర్లను తయారు చేయడాన్ని పరిగణించండి. ఇంటిని శుభ్రపరచడానికి అవి ప్రభావవంతంగా పనిచేస్తాయి. సురక్షితంగా ఉంటాయి.