ఉత్తరాంధ్ర అభివృద్ధికి వైయ‌స్ కుటుంబం కృషి

Best Web Hosting Provider In India 2024

ప్ర‌ధాని చేస్తున్న‌ శంకుస్థాప‌నల‌కు అనుమ‌తులు తెచ్చింది వైయ‌స్ జ‌గ‌నే

స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని చంద్ర‌బాబు ప్ర‌ధానితో చెప్పించగలరా?  

వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పి. ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి స‌వాల్‌

వైయ‌స్ఆర్ జిల్లా:  ఉత్త‌రాంధ్ర ప్రాంతం అభివృద్ధికి దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశేష కృషి చేశార‌ని వైయ‌స్ఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు పి. ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ విశాఖ‌లో ప్రధాన మంత్రి న‌రేంద్ర‌ మోదీ చేతుల మీదుగా జ‌రుగుతున్న శంకుస్థాపనలకు గ‌తంలో వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అనుమతులు తీసుకువ‌చ్చార‌ని స్ప‌ష్టం చేశారు. ఇవ‌న్నీ త‌న ఘ‌న‌త‌గా చంద్ర‌బాబు చెప్పుకోవ‌డం సిగ్గుచేట‌ని ధ్వ‌జ‌మెత్తారు. బుధవారం ర‌వీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైయస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రమే  ఉత్త‌రాంధ్ర‌ను  అభివృద్ధి చేశారని, కూటమి ప్రభుత్వం చేసిన చేసిన అభివృద్ధి ఏమీ లేద‌న్నారు.  ఎవరికో పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దు పెట్టినట్టు  కూటమి ప్రభుత్వ తీరు ఉంద‌ని దుయ్య‌బ‌ట్టారు.  కిడ్నీ సమస్యలు తలెత్తకుండా ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తో పాటు అన్ని హంగులతో అత్యాధునిక సాంకేతికతో ఆసుపత్రి నిర్మించిన ఘనత వైయ‌స్ జ‌గ‌న్‌కే దక్కుతుంద‌న్నారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ఉన్న కోర్టు సమస్యలను క్లియర్ చేసి భూములు ఇచ్చిన‌ భాధితులకు నష్టపరిహారం అందించింది వైయ‌స్ జ‌గ‌నే అన్నారు.  విజయనగరం, పాడేరులో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తే ప్రస్తుతం వాటిలో అడ్మిషన్లు లేకుండా చేసిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాటును ప్రైవేటీకరించబోమని ప్రధానితో చెప్పించాలని ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి చంద్ర‌బాబుకు స‌వాలు విసిరారు.  

Best Web Hosting Provider In India 2024