Best Web Hosting Provider In India 2024
Ramayana Release Date: 32 ఏళ్ల తర్వాత ఇండియాలో రిలీజ్ అవుతున్న సినిమా ఇది.. ఇదీ కారణం
Ramayana Release Date: ఇండియాలో ఇప్పుడో మూవీ 32 ఏళ్ల తర్వాత రిలీజ్ అవుతోంది. ఒకప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత వివాదంతో వాయిదా పడుతూ వస్తున్న ఈ యానిమేషన్ మూవీ.. మొత్తానికి ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Ramayana Release Date: రామాయణం.. ఈ ఇతిహాసం ఇప్పటికే ఎన్నో రూపాల్లో మన ముందుకు వచ్చింది. ఈ మధ్యే ప్రభాస్ కూడా ఆదిపురుష్ పేరుతో ఈ కథను మనకు అందించిన విషయం తెలుసు కదా. అయితే ఇదే రామాయణం యానిమేషన్ లో మూడు దశాబ్దాల కిందటే రూపొందింది. అయితే 1992లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత నేపథ్యంలో థియేటర్లలో రిలీజ్ కాలేదు. మొత్తానికి 32 ఏళ్ల తర్వాత జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ రిలీజ్ డేట్
రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ యానిమేషన్ రూపంలో రూపొందిన మైథలాజికల్ డ్రామా. రాముడి కథను సరికొత్తగా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం ఇది. 1993లోనే న్యూఢిల్లీలో జరిగిన 24వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. అయితే రామ జన్మభూమి ఉద్యమం నేపథ్యంలో దేశవ్యాప్తంగా రిలీజ్ కు నోచుకోలేదు. మొత్తానికి జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ విషయాన్ని బుధవారం (జనవరి 8) ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ వెల్లడించింది. “ఎదురుచూపులు ముగిశాయి. దేశంలోని అత్యంత గొప్పదైన ఈ కథను మరోసారి చూడండి. రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ జనవరి 24న హిందీ, ఇంగ్లిష్, తెలుగు, తమిళం వెర్షన్లలో రిలీజ్ కానుంది. ఈ 4కే ఎక్స్పీరియన్స్ మీకోసం వేచి చూస్తోంది” అనే క్యాప్షన్ తో మూవీ రిలీజ్ విషయాన్ని తెలిపింది.
విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో..
రామాయణ: ది లెజెండ్ ఆఫ్ ప్రిన్స్ రామ యానిమేషన్ మూవీని 4కే వెర్షన్లో తీసుకొస్తున్నారు. మూవీ రిలీజ్ కు ముందు జనవరి 10న ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఈ లేటెస్ట్ మూవీని టాప్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ పర్యవేక్షించనున్నారు. రామాయణంలోని సారాంశాన్ని చెబుతూనే ఈ కాలం వ్యూయర్స్ ను ఆకట్టుకునేలా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నారు. తెలుగులోనూ రిలీజ్ కానుండటంతో ఇక్కడి ప్రేక్షకులు కూడా మూవీని ఎంజాయ్ చేయొచ్చు.