Best Web Hosting Provider In India 2024
CM Chandrababu : రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు, సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి తీరుతాం- సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఏపీలో రూ.2.08,545 కోట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు రాష్ట్రం పట్ల ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధత ఏంటో తెలుస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఈ రోజు నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీ చేతులు మీదుగా రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ లకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారన్నారు. విశాఖ ప్రజల చిరకాల కోరిక, విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అయ్యాయన్నారు. ఎక్కడికెళ్లినా ప్రధాని మోదీపై ప్రజలు నమ్మకం చూపిస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీపై నమ్మకం, విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలే అయ్యిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి ప్రధాని మోదీ వచ్చారని తెలిపారు.
ఏపీలో రూ.2.08,545 కోట్ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసి…రాష్ట్రం పట్ల ప్రధాని మోదీకి ఉన్న నిబద్ధత ఏంటో తెలుస్తోందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన వేళ ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పిన వ్యక్తి మోదీ అని చంద్రబాబు గుర్తుచేశారు. ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసిన వ్యక్తి మోదీ అన్నారు. ఒక్కో ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి 93 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించిందని, భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్ కొనసాగుతుందన్నారు.
“దిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ విజయం సాధిస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు. అభివృద్ధి, సంస్కరణలు, సంక్షేమం, సుపరిపాలన మోదీ నినాదాలు. దేశాన్ని ఒక బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేకిన్ ఇండియా తెచ్చారు. స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా తెచ్చారు. మోదీ త్వరలో అమరావతికి రావాలని కోరుతున్నాను. రాష్ట్రంలో నదుల అనుసంధానం మా లక్ష్యం. అందుకు కేంద్రం సాయం కోరుతున్నా. ప్రధాని మోదీ కార్యక్రమాల వల్ల దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది. 2047 నాటికి ప్రపంచంలోనే మొదటి లేదా రెండో స్థానంలో భారత్ నిలుస్తుంది. కేంద్రం సాయంతో రాష్ట్రంలో పెట్టుబడులు ఊపందుకున్నాయి”- సీఎం చంద్రబాబు
“రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన మా బాధ్యత. కొప్పర్తి, ఓర్వకల్లు ఇండస్ట్రీయల్ కారిడార్ లుగా మారుతున్నాయి. అరకు కాఫీని మోదీ బాగా ప్రమోట్ చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య చెప్పినా వెంటనే అర్థం చేసుకుంటారు. వెంటనే పనులు జరిగేలా ప్రధాని చొరవ చూపిస్తున్నారు” అని చంద్రబాబు అన్నారు.
టాపిక్