Bachchala Malli OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా.. ప్లాట్‌ఫామ్ ఇదే..

Best Web Hosting Provider In India 2024

Bachchala Malli OTT Release Date: ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా.. ప్లాట్‌ఫామ్ ఇదే..

Hari Prasad S HT Telugu
Jan 08, 2025 09:06 PM IST

Bachchala Malli OTT Release Date: ఓటీటీలోకి అల్లరి నరేష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా వచ్చేస్తోంది. ఈ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్సయింది. అయితే స్ట్రీమింగ్ తేదీ ఊహించగలరా అంటూ ఆ ఓటీటీ ఓ ట్విస్ట్ ఇవ్వడం విశేషం.

ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా.. ప్లాట్‌ఫామ్ ఇదే..
ఓటీటీలోకి వచ్చేస్తున్న అల్లరి నరేష్ లేటెస్ట్ యాక్షన్ డ్రామా.. ప్లాట్‌ఫామ్ ఇదే..

Bachchala Malli OTT Release Date: ఒకప్పుడు వరుస కామెడీ సినిమాలతో అలరించిన అల్లరి నరేష్ ఈ మధ్య సీరియస్ సినిమాలకు ఓటేస్తున్నాడు. అలా అతడు నటించిన యాక్షన్ డ్రామా బచ్చల మల్లి. ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20వ తేదీన థియేటర్లలో రిలీజైంది. అప్పుడే ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ మూవీని ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని బుధవారం (జనవరి 8) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

yearly horoscope entry point

బచ్చల మల్లి ఓటీటీ రిలీజ్

అల్లరి నరేష్ మూవీ బచ్చల మల్లి ఈటీవీ విన్ ఓటీటీలోకి రానుంది. అయితే మూవీ స్ట్రీమింగ్ తేదీని మాత్రం ఆ ఓటీటీ చెప్పలేదు. సింపుల్ గా డేట్ ను అంచనా వేయగలరా అంటూ ఓ ట్వీట్ చేసింది. కమింగ్ సూన్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో నరేష్ సిగరెట్ కాలుస్తూ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఆ ఒక్కటీ అడక్కు అంటూ ఓ కామెడీ మూవీ తీసి బోల్తా పడిన తర్వాత మళ్లీ బచ్చల మల్లితో సీరియల్ పాత్ర పోషించిన అల్లరి నరేష్ కు.. ఇప్పుడూ సక్సెస్ దక్కలేదు.

దీంతో మూవీని నెల రోజుల్లోపే ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. డేట్ గెస్ చేయగలరా అని ఈటీవీ విన్ అడగడం చూస్తుంటే.. సంక్రాంతికి మూవీ రావడం ఖాయంగా కనిపిస్తోంది. అటు థియేటర్లలో కొత్త సినిమాల సందడి నెలకొన్న నేపథ్యంలో వచ్చే వారం సంక్రాంతి సందర్భంగా ఈ బచ్చల మల్లిని ఈటీవీ విన్ స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బచ్చల మల్లి మూవీ ఎలా ఉందంటే?

అల్లరి నరేష్, అమృతా అయ్యర్ జంటగా నటించిన మూవీ బచ్చల మల్లి. ఈ సినిమాను సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేశాడు. గతేడాది డిసెంబర్ 20న థియేటర్లలో రిలీజైంది. ఏపీలోని తుని దగ్గరలో ఉన్న సురవరం అనే ఊళ్లో జరిగిన కథగా ఈ మూవీని తెరకెక్కించారు. మల్లి అనే పాత్రలో నరేష్ నటించాడు. చదువులో ఎంతో తెలివైన విద్యార్థిగా ఉండే మల్లి.. తన తండ్రి తీసుకున్న ఓ నిర్ణయం వల్ల ఎలా ఓ మొండి వ్యక్తిగా మారాడు? కావేరి (అమృతాఅయ్యర్) అనే అమ్మాయితో ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం ఎలా మారిపోయింది? అసలు మల్లి తండ్రి చేసిన తప్పేంటి? దానివల్ల మల్లి, కావేరి ఎదుర్కొనే సవాళ్లేంటన్నది ఈ బచ్చల మల్లి మూవీలో చూడొచ్చు.

ఈ సినిమాకు అల్లరి నరేషే పెద్ద ప్లస్ పాయింట్. అతని నటన మరో లెవెల్. తన కెరీర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ లో ఇదీ ఒకటి. మూవీ స్టోరీ కూడా బాగానే ఉన్నా.. దానిని తెరపై ప్రెజెంట్ చేసిన విధానం ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోవడంతో బాక్సాఫీస్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. స్క్రీన్ ప్లేలో లోపాలు, అనవసరమైన సీన్లు చికాకు తెప్పిస్తాయి. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాపవడంతో ఈ మూవీని నెల లోపే ఓటీటీలోకి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. సంక్రాంతికే ఈటీవీ విన్ ఓటీటీ మూవీని స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ ఉంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024