Best Web Hosting Provider In India 2024
OTT Mystery: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్.. రెండేళ్లకు ఓటీటీ రిలీజ్.. 6.8 రేటింగ్.. ఎక్కడ చూడాలంటే?
Break Out OTT Streaming Telugu: ఓటీటీలోకి దాదాపుగా రెండేళ్ల తర్వాత ఇవాళ వచ్చేసిన తెలుగు మిస్టరీ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ బ్రేక్ అవుట్. హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ హీరోగా చేసిన బ్రేక్ అవుట్ మూవీకి ఐఎండీబీ 6.8 రేటింగ్ ఇచ్చింది. బ్రేక్ అవుట్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసుకుందాం.
Break Out OTT Release Telugu: ఓటీటీలోకి ఇప్పుడు అనేక సినిమాలు వివిధ కంటెంట్‌తో వచ్చి అలరిస్తున్నాయి. పలు భిన్నరకాల జోనర్స్‌లో తెలుగు ఆడియెన్స్‌క వినోదం పంచుతున్నాయి తెలుగు చిత్రాలు. హారర్, కామెడీ, బోల్డ్, ఫాంటసీ, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్స్‌తోపాటు మిస్టరీ, సర్వైవల్ థ్రిల్లర్ విభాగంలో కూడా సినిమాలు అలరిస్తున్నాయి.
బ్రహ్మానందం కుమారుడు
అలా తెలుగులో తెరకెక్కిన మూవీనే బ్రేక్ అవుట్. మిస్టరీ అండ్ సర్వైవల్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమాలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కుమారుడు రాజా గౌతమ్ హీరోగా చేశాడు. సుబ్బు చెరుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజా గౌతమ్‌తోపాటు కిరీటి దామరాజు, ఆనంద్ చక్రపాణి , రమణా రాఘవ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
బ్రేక్ అవుట్ సినిమాను అనిల్ మోదుగ బ్యానర్‌పై అనిల్ మోదుగ నిర్మించారు. ఎమ్ఎస్ జోన్స్ రూపర్ట్ సంగీతం అందించిన బ్రేక్ అవుట్ మూవీ 2023 మార్చి 10న థియేటర్లలో విడుదలైంది. అయితే, ఈ సినిమా పెద్దగా రీచ్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేకపోయింది. దాంతో ఇలాంటి ఓ సినిమా వచ్చిందనే విషయం చాలా మందికి తెలియకుండా పోయింది.
రెండేళ్ల తర్వాత ఓటీటీకి
ఇప్పుడు ఓటీటీ పుణ్యమా అని బ్రేక్ అవుట్ గురించి తెలుగు ఆడియెన్స్‌కు తెలిసే ఛాన్స్ వచ్చింది. ఐఎండీబీ నుంచి 6.8 రేటింగ్ పొందిన బ్రేక్ అవుట్ ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపుగా రెండేళ్ల తర్వాత ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం విశేషంగా మారింది. అందుకే ఈ సినిమాపై కాస్తా బజ్ క్రియేట్ అయింది. అలాగే, తెలుగులో పెద్ద ఓటీటీ రిలీజ్‌లు లేకపోవడంతో బ్రేక్ అవుట్ డిజిటల్ స్ట్రీమింగ్ ఆసక్తిగా మారింది.
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో బ్రేక్ అవుట్ నేటి (జనవరి 9) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం జనవరి 9 నుంచి ఈటీవీ విన్‌లో బ్రేక్ అవుట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు ప్లాట్‌ఫామ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అనౌన్స్‌మెంట్ ప్రకారం ఈరోజు బ్రేక్ అవుట్ ఓటీటీ రిలీజ్ అయింది.
ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్
“సర్వైవల్ అండ్ కరేజ్ ఎగ్జైటింగ్ స్టోరీని చూసేందుకు సిద్ధంగా ఉండండి. బ్రేక్ అవుట్ సినిమా జనవరి 9 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది” అని రాసుకొచ్చిన ఈటీవీ విన్ టీమ్ అధికారికంగా తెలియజేసింది. ఇదిలా ఉంటే, మోనో ఫోబియాతో బాధపడే హీరో డైరెక్టర్ కావాలని కలలు కంటుంటాడు. అందుకు హైదరాబాద్‌కు వెళ్లి స్టోరీ చెప్పాలనుకుంటాడు.
హైదరాబాద్‌కు వెళ్లిన హీరో ఓ గ్యారెజీలో తన ఫ్రెండ్‌తో నివసిస్తుంటాడు. అయితే, ఓరోజు హీరో ఒంటరిగా ఉన్నప్పుడు అనుకోకుండా గ్యారేజ్ డోర్ క్లోజ్ అవుతుంది. హీరో ఎంత ట్రై చేసిన తెరుచుకోదు. దాంతో తెగ భయపడిపోతాడు హీరో.
గ్యారేజీలో చిక్కుకున్న హీరో
గ్యారేజీలో చిక్కుకున్న హీరో ఎలా బయటపడ్డాడు? ఆ సమయంలో తనలో మెదిలిన ఆలోచనలు ఏంటీ? హీరో మానసిక స్థితి ఎలా ఉంది? గ్యారేజ్ డోర్ ప్రమాదవశాత్తు పడిందా? ఎవరైనా కావాలని క్లోజ్ చేశారా? అనే విషయాలు తెలియాలంటే బ్రేక్ అవుట్ మూవీ చూడాల్సిందే. థియేటర్లలో మిస్ అయిన బ్రేక్ అవుట్ మూవీని ఈటీవీ విన్ ఓటీటీలో చూసేయండి.