Brahmamudi January 9th Episode: స్వప్నకు సీమంతం, 20 లక్షల బడ్జెట్- రుద్రాణి కొత్త స్కెచ్- కావ్యపై తిరుగుబాటు- రాజ్ షాక్!

Best Web Hosting Provider In India 2024

Brahmamudi January 9th Episode: స్వప్నకు సీమంతం, 20 లక్షల బడ్జెట్- రుద్రాణి కొత్త స్కెచ్- కావ్యపై తిరుగుబాటు- రాజ్ షాక్!

Sanjiv Kumar HT Telugu
Jan 09, 2025 07:52 AM IST

Brahmamudi Serial January 9th Episode: బ్రహ్మముడి జనవరి 9 ఎపిసోడ్‌లో ప్రకాశంకు కావ్య క్షమాపణలు చెబుతుంది. కానీ, ప్రకాశం మాత్రం క్షమించకుండా వెళ్లిపోతాడు. దాంతో కావ్య ఏడుస్తుంటే రాజ్ వచ్చి క్యూట్‌గా, చిన్న పిల్లలా ఉన్నావంటాడు. స్వప్నకు సీమంతం అని రుద్రాణి కొత్త స్కెచ్ వేస్తుంది.

బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 9వ తేది ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ జనవరి 9వ తేది ఎపిసోడ్

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కావ్య చేసిన అవమానం గురించి అన్నయ్య సుభాష్‌కు చెప్పుకుని బాధపడుతాడు ప్రకాశం. నాన్న గారి నమ్మకాన్ని నిలబెట్టాలనుకోవడంలో తప్పులేదు. కానీ, ఇంట్లోవాళ్ల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అన్నయ్య. ఇప్పుడు కావ్య చేసినదానివల్ల నా భార్య నా మాట వింటుందా. నా కొడుకు అన్యాయం చేస్తున్నానని నిలదీస్తే ఏమని సమాధానం చెప్పను అని ప్రకాశం అంటాడు.

yearly horoscope entry point

లేనిదే అడుగుతున్నావ్

మన విషయంలో ఎప్పుడు డబ్బుల గురించి రాలేదు. నేనేంటో నీకు తెలుసు. అసలు కావ్య ఇలా ఎందుకు చేస్తుందో నేను కనుక్కుంటాను. ఈ సమస్యను నేను పరిష్కరిస్తాను. కాస్తా టైమ్ ఇవ్వరా అని సుభాష్ అంటాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది లేదో అదే అడుగుతున్నావ్. కాలం గడిచినకొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతుంది. ఒక్కసారి నువ్వే ఆలోచించు అని వెళ్లిపోతాడు ప్రకాశం. అప్పుడే కావ్య ఎదురుపడుతుంది. తనను క్షమించమని అడుగుతుంది.

నలుగురిలో నేను అలా మాట్లాడటం తప్పే. ఏదో ఆఫీస్ టెన్షన్‌లో అలా మాట్లాడాను. మనస్ఫూర్తిగా అడుగుతున్నాను అని చేతులతో దండం పెట్టి క్షమించమని కావ్య అంటుంది. నిన్ను క్షమించడానికి నేను ఎవరినమ్మా అని ప్రకాశం అంటాడు. అలా అనకండి, నేను మీ కూతురులాంటిదాన్ని. గోల్డ్‌పై ఇదివరకే ఎక్కువ ఇన్వెస్ట్ చేశాం. అక్కడ ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా అలా మాట్లాడాను. ఇప్పుడు కాంట్రాక్ట్‌కు కావాల్సినంత కొనేశా. కావాలంటే వారం తర్వాత ఆయన్ని పిలిచి గోల్డ్ కొందాం అని కావ్య అంటుంది.

అన్ని మనం అనుకున్నట్లు ఉండదు. శ్రీనివాస్ గారి లాంటి వ్యక్తి దగ్గర మాట పోతే అస్సలు నమ్మరు. అప్పటికే ఆయన అడుగుతున్నారు. నేనే పిచ్చోడిలా కావ్య, రాజ్ నా మాట కాదనరు. కచ్చితంగా కొంటారు అని చెప్పాను. కానీ, ఒక్క మాటలో నా విలువ అంత పోయింది. అంతమందిలో నా పరువు తీశారు. ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంట్లో తిరగమంటావ్ అని ప్రకాశం అంటాడు. ఇంతలా నా మాటలు మీ మనసును గాయం చేస్తాయని అనుకోలేదు. మరోసారి అడుగుతున్నాను. అని చేతులు పట్టుకుని క్షమించమంటుంది కావ్య.

చెప్పుతొ కొట్టినట్లు మాట్లాడి

ఇప్పుడు నేనేం మాట్లాడలేను. దయచేసి వెళ్లిపో అని ప్రకాశం అంటాడు. అయినా కావ్య చెప్పబోతుంటే ప్రకాశమే వెళ్లిపోతాడు. ఇంతలో సూపర్ అంటూ ధాన్యలక్ష్మీ ఎంట్రీ ఇస్తుంది. నీ తెలివితేటలే వేరే లెవెల్. అందరిముందు చెప్పుతో కొట్టినట్లు మాట్లాడి. ఇప్పుడు ఒంటరిగా గాయానికి వెన్నెపూస రాయడానికి వచ్చావా. ఒకప్పుడు బంధాలు, బంధుత్వాలు ముఖ్యం అని చెప్పి ఆస్తి రాగానే నీ నిజస్వరూపం బయటపెడుతున్నావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది.

ఒకప్పుడు నేనే నీకు అండగా నిలబడ్డాను అన్నావ్‌గా. అలాంటి మనిషికి ఇదా నువ్ ఇచ్చే మర్యాద ఇదేనా. నాకు, నా మొగుడుకు విలువ లేకుండా చేసిన నిన్ను శత్రువులా కాకుండా ఇంకెలా చూడను. నిన్ను అర్థం చేసుకోవడం అంటే పామును పక్కలో పడుకోబెట్టుకున్నట్లే. అంత ధైర్యం లేదు తల్లి అని నానా మాటలు అనేసి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. అది విని కావ్య బాధపడుతుంది. అదంతా పైనుంచి రాజ్ చూస్తుంటాడు.

కావ్య బెడ్‌పై కూర్చుని ఏడుస్తుంటే రాజ్ వస్తాడు. కన్నీళ్లు తుడిచి నీ బాధను దాచగలవే కానీ, నీ కళ్లు నిజాన్ని దాచలేవు అని రాజ్ అంటాడు. ఇంట్లో అందరిని బాధపెడుతున్నాను. నేనంటే పడనివాళ్లు ద్వేషిస్తున్నారులే అనుకున్నా. కానీ, నన్ను అభిమానించే వాళ్లు కూడా తప్పుగా అర్థం చేసుకుంటే నేను తీసుకోలేకపోతున్నా. ఇప్పుడు చిన్న మావయ్యగారే కావొచ్చు. రేపు పెద్ద మావయ్య, అమ్మమ్మ, అత్తయ్య అందరూ తప్పుగా తీసుకుంటారేమో అనిపిస్తుంది అని కావ్య అంటుంది.

ఏడుస్తుంటే క్యూట్‌గా ఉన్నావ్

నా నిర్ణయాలు అందరిని ఇబ్బందిపెడుతున్నాయని నాకు అర్థమవుతోంది. ఈ బరువు బాధ్యతలు నేను మోయలేను అని చెప్పిన నా మీద పెట్టారు. ఇప్పుడు ఒక్కొక్కరు నన్ను శత్రువులా చూస్తున్నారు. ఇది నా చేతకాని తనానికి పెట్టిన పరీక్షలా ఉంది అని కావ్య అంటుంది. తిక్క కళావతి నువ్ ఏడుస్తున్న కూడా క్యూట్‌గానే ఉన్నావ్ తెలుసా. ఎప్పుడు మొండిగా కనిపించే నువ్వు ఫస్ట్ టైమ్ చిన్న పిల్లలా కనిపిస్తున్నావ్ అని రాజ్ అంటాడు.

తాతయ్య వంద కోట్లు షూరిటీ తీసుకున్నప్పుడు నేను నీ సహాయం తీసుకున్నప్పుడు నుంచి ఈ సమస్య మొదలైంది. పెదరాయుడిలాగా కూల్‌గా ఉన్న నువ్వు 100 కోట్లు కట్టాలన్న భయం పుట్టగానే మోనార్క్‌లా తయారయ్యావ్. ప్రతి పైసా జాగ్రత్త చేయాలని ప్రతి రూల్ స్ట్రిక్ట్‌గా చేశావ్. దాంతో నీపై తిరుగుబాటు మొదలైంది అని రాజ్ అంటాడు. ఇదంతా తాతగారి మాట పోకుండా ఉండేందుకేగా అని కావ్య అంటుంది. అందుకే నేను ఇంట్లో వంద కోట్ల విషయం చెబుతానన్నాను. నువ్ వద్దన్నావ్. ఇప్పుడు ఇలా కూర్చుని ఏడుస్తున్నావ్. దీనికి కారణం నువ్వే అని రాజ్ అంటాడు.

ఇప్పుడు అయినా అసలు విషయం చెబుతామని రాజ్ అంటే.. వద్దండి. ఇప్పుడు చెబితే రుద్రాణి, ధాన్యలక్ష్మీ ఆస్తి పంచమంటారు. కావాలంటే నేను వాళ్ల మాటలు పడతాను. మంచో చెడో సగందూరం వచ్చాం. వెనక్కి వెళ్లి ఓడిపోవడం కన్నా ముందుకు వెళ్లి మనం గెలిచి చూపిద్దాం అని కావ్య అంటుంది. మరి ఈ కంట్లో కన్నీళ్ల సంగతి ఏంటీ అని రాజ్ అంటే.. ఇందాక చిన్నత్తయ తిట్టేసరికి వచ్చాయి. ఇక రావు. ఇప్పుడు ఆలోచించాల్సింది జగదీష్ గారి కాంట్రాక్ట్ వారం రోజుల్లో పూర్తి చేయాలి అని కావ్య అంటుంది.

మనతో చేతులు కలుపుతాడు

మరోవైపు స్విమ్మింగ్ పూల్‌లో రుద్రాణి, రాహుల్ కాళ్లు పెట్టి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ఫీలింగ్ ఏంట్రా ఇంత బాగుంది. ఇంట్లో జరిగిన గొడవ గురించి సంబరపడుతుంది రుద్రాణి. అందరిముందు పరువు పోగొట్టుకున్న చిన్న మావయ్య తనకు విలువ లేదని గ్రహించి యూ టర్న్ తీసుకున్నాడు. త్వరలో మనతో చేతులు కూడా కలుపుతాడు అని రాహుల్ అంటాడు. రామ లక్ష్మణులు విడిపోతే అయోధ్య ముక్కలవుతుందేమో తెలియదు గానీ పెద్దమావయ్య, చిన్న మావయ్య విడిపోతే మాత్రం ఈ దుగ్గిరాల కుటుంబం మాత్రం కచ్చితంగా ముక్కలు అవుతుందిరా అని రుద్రాణి అంటుంది.

కావ్య చేసిన తప్పును బూతద్దంలో చూపించి ఇంట్లోవాళ్లందరితో ఛీ కొట్టిద్దాం. దాని చేతులనుంచి ఆస్తి తీసుకుందాం. తర్వాత నా నెక్ట్స్ టార్గెట్ రాజ్ నుంచి బిజినెస్ లాక్కోవడం. ఇంటిని నేను రూల్ చేయాలి. ఆఫీస్‌ను నువ్ హ్యాండిల్ చేయాలి అని రుద్రాణి అంటుంది. ఇప్పుడు ఏం చేయబోతున్నావ్ అని రాహుల్ అంటాడు. నీ పెళ్లానికి సీమంతం చేయాలి అని రుద్రాణి అంటుంది. ఇంట్లో తిండికే టికానా లేదంటే ఇప్పుడు సీమంతానికి డబ్బులెవరు ఇస్తారు. దానివల్ల వచ్చే లాభం ఏంటీ అని రాహుల్ అంటాడు.

అది రేపు జరగబోయే నాటకం చూడు అని రుద్రాణి అంటుంది. కట్ చేస్తే మరుసటిరోజు ఉదయం హాల్లో అంతా ఉంటారు. రుద్రాణిని వచ్చి శాంత ఏం టిఫిన్ చేయమంటారు అని అడుగుతుంది. దాంతో అంతా షాక్ అయిన రుద్రాణి కావ్యను అడుగు అని అంటుంది. కావ్య మేడమ్ ముందు మిమ్మల్నే అడగమన్నారు. ఇవాళ్టీ నుంచి ఎవరెవరికి ఏం టిఫిన్స్ కావాలో చేయమని కావ్య మేడమ్ చెప్పారు అని శాంత అంటుంది.

వింతగానే అనిపిస్తుంది

ఎందుకు చరితాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇంటిని ఆమెనే ఏలుతుంది కదా. ఆవిడ మాకు కడుపునిండా కావాల్సిన టిఫిన్స్ తినమని దయ చూపి, జాలి చూపి కరుణామృతం చూపించే శాసనాలు తిరగరాస్తున్నారు అని రుద్రాణి అంటుంది. ఇంతలో కావ్య ఎంట్రీ ఇస్తుంది. అందులో వెయ్యింతల వెటకారం కనిపిస్తుందని కావ్య అంటే.. ఒక టిఫిన్ తినమని ఆర్డర్ పాస్ చేసి ఇప్పుడు ఇలా చేస్తే వింతగానే అనిపిస్తుందని రాహుల్ అంటాడు.

అనివార్య కారణాల వల్ల అలా చేయకతప్పదు. నా నిర్ణయాల వల్ల ఇంట్లో అందరూ కష్టపడుతున్నారని మా ఆయన గడ్డిపెట్టారు. అందుకే ఇలా చేస్తున్నాను అని కావ్య అంటుంది. ముష్టివాళ్లకు పడేసినట్లు నాలుగు టిఫిన్స్ పడేస్తే నువ్ చేసిన తప్పులు మర్చిపోతారా అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో పంతులు వస్తాడు. ఎవరు పిలిచారు ఎందుకు అని ఇందిరాదేవి అంటుంది. నేనే. వేరే పెళ్లి చేసుకుందామని అని రుద్రాణి అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు.

లేకపోతే ఏంటీ. మీకెవరికి బాధ్యత, పట్టింపు లేదు. పేరంటాలన్నీ పక్కన పెడుతున్నారు. నా కోడలు స్వప్నకు ఆరు నెలలు నిండాయి. ఆరు నెలల ఆరు రోజులకు దుగ్గిరాల ఇంట్లో సీమంతం జరిపించే ఆనవాయితీ ఉంది అని రుద్రాణి అంటుంది. దాంతో స్వప్న షాక్ అవుతుంది. కోడలిని మనిషిగానే చూడరు. అలాంటిది సీమంతం జరిపించాలనే ఆలోచన ఎలా వచ్చింది అని స్వప్న అంటుంది. రుద్రాణి నీ బ్రెయిన్‌లో రసాయనిక చర్యలు జరుగుతున్నాయా అని ప్రకాశం కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తాడు.

సీమంతానికి 20 లక్షలు

నేను మనస్ఫూర్తిగానే నిర్ణయం తీసుకున్నాను. నాకు స్వప్నంటే నచ్చదు. అంత కంపు నోరు చూడలేదు. అయినా అత్తగా నేను శ్రీమంతం జరిపించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆమె కడుపులో పెరిగే బిడ్డ నా వారసుడు కాబట్టి అని రుద్రాణి అంటుంది. నాకు ఆశ్చర్యంగానే ఉంది. నిజంగానే నాకు సీమంతం చేయిస్తారా. ఇంట్లో టీ కాఫీలకే దిక్కులేదు. నేను సీమంతం గురించి అడిగానంటే నా అంతు చూస్తారని నోరుమూసుకు కూర్చున్నాను అని స్వప్న అంటుంది.

నీ సీమంతం జరుగుతుంది. కనీసం లక్ష విలువ చేసే పట్టుచీర కట్టాలి. అన్నీ తెప్పించాలి. ముత్తైదువులకు వాయినాలు ఇవ్వడమే కాకుండా రిటర్న్ గిఫ్ట్ కింద ఒక వెండి కుంకుమ భరిణ కూడా ఇవ్వాలి. నేను ఆల్రెడీ డిజైన్ చేసేశాను అని రుద్రాణి అంటుంది. దాంతో రాజ్, కావ్య షాక్ అవుతారు. స్వప్న మాత్రం ఆశ్చర్యంతో సంతోషపడుతుంది.

తర్వాత సీమంతానికి వచ్చే అతిథుల నుంచి టిఫిన్స్ వరకు లిస్ట్ రాసిచ్చిన రుద్రాణి మొత్తం బడ్జెట్ 20 లక్షలు అని చెబుతుంది. దాంతో అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024