Best Web Hosting Provider In India 2024
Karthika Deepam 2 Serial:జ్యోత్స్న ప్లాన్ అట్టర్ ఫ్లాప్ – దీప ముందు హీరోగా మారిన కార్తీక్ – సారీ చెప్పిన దశరథ్!
Karthika Deepam 2 Serial: కార్తీక దీపం 2 జనవరి 9 ఎపిసోడ్‌లో జ్యోత్స్న వల్ల జాబ్ కోల్పోయిన ఉద్యోగులకు కార్తీక్, దీప అండగా ఉంటారు. తిరిగి వారిని ఉద్యోగంలోకి తీసుకోవాలని జ్యోత్స్న ఆఫీస్ ముందు కార్తీక్, దీప ధర్నా చేస్తారు. జ్యోత్స్న చేసిన పని గురించి తెలిసిన శివన్నారాయణ ఫైర్ అవుతాడు.
Karthika Deepam 2 Serial: దీప తండ్రి ఇంటిని అమ్మేయడానికి ఊరు వెళ్లిన అనసూయ తిరిగివస్తుంది. ఆమెను చూసి కాంచన ఆనందపడుతుంది. దీప, కార్తీక్ కనిపించకపోవడం, టిఫిన్ సెంటర్ ఓపెన్ చేయకపోవడంతో ఏమైందని కాంచనను అడుగుతుంది అనసూయ. ఓ సమస్య వచ్చిందని, దానిని పరిష్కరించడం కోసం ఇద్దరు వెళ్లారని కాంచన అంటుంది.
కార్తీక్, దీప ధర్నా…
కట్ చేస్తే జ్యోత్స్న కంపెనీ ముందు దీప, కార్తీక్ ధర్నా చేస్తుంటారు. సీఈవో డౌన్ డౌన్ అంటూ జ్యోత్స్నకు వ్యతిరేకంగా కంపెనీ ఉద్యోగులతో కలిసి నినాదాలు చేస్తుంటారు. తీసేసిన ఉద్యోగులను తిరిగి జాబ్‌లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తుంటారు. ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులను పిలవమని మేనేజర్‌కు ఆర్డర్ వేస్తుంది.
పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేనని, మీరు బయటకు వచ్చి చూస్తే ఎందుకో మీకే తెలుస్తుందని మేనేజర్ అంటాడు. మేనేజర్ మాటలతో ధర్నా చేస్తోన్న వారి దగ్గరకు వస్తుంది జ్యోత్స్న. ధర్నా చేస్తోన్న వారిలో కార్తీక్, దీప ఉండటం చూసి జ్యోత్స్న షాకవుతుంది.
మాటిచ్చిన కార్తీక్…
జ్యోత్స్నను చూడగానే భయంతో ఉద్యోగులు నినాదాలు చేయడం ఆపేస్తారు. మీ ముందు నేనున్నానని, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని కార్తీక్ వారికి మాటిస్తాడు. ఏంటి ఇది, మీకు వీళ్లకు సంబంధం ఏమిటి కార్తీక్, దీపలను అడుగుతుంది జ్యోత్స్న. కానీ వారు సమాధానం చెప్పకుండా ధర్నా కొనసాగిస్తారు.
నాటకం బట్టబయలు…
కంపెనీ ముందు ధర్నా చేసి నాపై పగ తీర్చుకోవాలని అనుకుంటున్నావా కార్తీక్‌ను నిలదీస్తుంది జ్యోత్స్న. పగ తీర్చుకోవడం గురించి నువ్వు మాట్లాడకు జ్యోత్స్న. నువ్వు మా టిఫిన్ బండి దగ్గరకు ఎవరికి పంపించావో మాకు తెలుసు అని జ్యోత్స్న నాటకాల్ని బయటపెడుతుంది దీప. నువ్వు పంపించిన మనుషులు వెనక్కి తిరిగి పారిపోయారు అని జ్యోత్స్న గాలితీసేస్తుంది దీప. పద్దతి తెలియని ఈ మనిషి పగ తీర్చుకోవడం గురించి మాట్లాడుతుంది అని దీపను సపోర్ట్ చేస్తూ కార్తీక్ మాట్లాడుతాడు.
సాక్ష్యాలు ఉంటే…
మీ టిఫిన్ సెంటర్‌కు నేను మనుషులను పంపించింది నిజమైతే…సాక్ష్యాలు ఉంటే పోలీసు కేసు పెట్టుకోమని జ్యోత్స్న బుకాయిస్తుంది. అవన్నీ మనసులో పెట్టుకొని మా కంపెనీ పరువు తీయద్దని గొడవ చేస్తుంది.
రూల్స్‌తో సంబంధం లేదు…
తీసేసిన ఉద్యోగులను వెంటనే తిరిగి జాబ్‌లో చేర్చుకోమని కార్తీక్ తన డిమాండ్స్‌ను జ్యోత్స్న ముందు పెడతాడు. కంపెనీ రూల్స్ గురించి జ్యోత్స్నకు చెబుతాడు. కంపెనీ రూల్స్‌తో తనకు సంబంధం లేదని, వీళ్లంతా యాభై ఏళ్లు దాటిన వాళ్లు అని, ఔట్‌డేటెడ్ ఎంప్లాయ్స్‌కు తన కంపెనీలో స్థానం లేదని జ్యోత్స్న పొగరుగా సమాధానమిస్తుంది. కంపెనీ రూల్స్‌ను అతిక్రమించి నీకు నచ్చినట్లే చేస్తే ఊరుకోమని, ఎంప్లాయ్స్‌కు న్యాయం జరిగే వరకు పోరాడుతామని జ్యోత్స్నకు కార్తీక్, దీప వార్నింగ్ ఇస్తారు. వీలైనంత త్వరగా వీళ్లకు న్యాయం జరగకపోతే కంపెనీ బంద్ అవుతుందని కార్తీక్ అంటాడు.
శివన్నారాయణ షాక్…
ఎవరి బెదిరింపులకు ఈ జ్యోత్స్న తలవంచదని, ఏం చేసుకుంటారో చేసుకొండి అని జ్యోత్స్న ఇంటికి వెళ్లిపోతుంది. కార్తీక్, దీప తమ ధర్నాను కొనసాగిస్తారు. ఎంప్లాయ్స్‌తో కలిసి కార్తీక్, దీప తమ ఆఫీస్ ముందు ధర్నా చేస్తోన్న సంగతిని శివన్నారాయణకు చెబుతాడు దశరథ్.
కంపెనీలో యాభై ఏళ్ల వయసు దాటిన ఎంప్లాయ్స్‌ను జ్యోత్స్న తీసేసిందని, వారు న్యాయం కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లారని దశరథ్ అంటాడు. ఆ ఉద్యోగులు కోర్టుకు వెళితే మన కంపెనీకే నష్టమని లీగల్ అడ్వైజర్ తనకు ఫోన్ చేసి చెప్పాడని దశరథ్ కంగారు పడతాడు. జ్యోత్స్న చేసిన పనికి శివన్నారాయణ ఎలా రియాక్ట్ అవుతాడో పారిజాతం భయపడుతుంది.
నాశనం చేస్తే ఊరుకోను..
అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఎందుకు చేశావు అని అడగను…కానీ ఈ ధర్నాను ఎలా ఆపుతావో చెప్పమని జ్యోత్స్నను నిలదీస్తాడు శివన్నారాయణ. ఇప్పుడు ఏమైందని ఇంత ఆవేశపడుతున్నారని కూల్‌గా జ్యోత్స్న సమాధానం చెబుతుంది. నోర్మూయ్ అని శివన్నారాయణ కోపంగా అంటాడు.
జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అన్నది తాను జీవితకాలం నిబద్ధతతో నిర్మించుకున్న ఇళ్లు…నమ్మకంతో సంపాదించుకున్న గౌరవం…నీ చేతకానీ నిర్ణయాలతో దానిని నాశనం చేయాలని అనుకుంటే ఊరుకోనని, మనవరాలు ఆని కూడా చూడనని వార్నింగ్ ఇస్తాడు.
సారీ చెప్పను…
నా పరువు నడిరోడ్డులో పోయేలా ఉందని శివన్నారాయణ బాధపడతాడు. ఎంప్లాయ్స్‌కు సారీ చెప్పమని జ్యోత్స్నపై దశరథ్ ఫైర్ అవుతాడు. తాను ఎవరికి సారీ చెప్పనని జ్యోత్స్న అంటుంది. మీడియా దృష్టిలో ఈ విషయం పడేలోపు సమస్య సాల్వ్ కావాలని, మేము చెప్పింది మాత్రమే చేయమని జ్యోత్స్నను హెచ్చరిస్తాడు.
నిజం దాచేసిన కాశీ తండ్రి…
ధర్నా గురించి కాశీకి చెబుతుంది స్వప్న. జ్యోత్స్న చేసిన తప్పుడు పని గురించి వినగానే కాశీ తండ్రి కోపం పట్టలేకపోతాడు. ఆమెకు ఇప్పుడే బుద్ది చెబుతానని, జ్యోత్స్న చెంప పగలగొడతానని కాశీ తండ్రి ఆవేశంగా అంటాడు. జ్యోత్స్నకు బుద్ది చెప్పే అధికారం మీకు ఎక్కడిది?
తన విషయంలో బాధ్యత తీసుకోవడానికి నువ్వు ఎవరు? అని తండ్రిని అడుగుతాడు కాశీ. తాను జ్యోత్స్న కన్న తండ్రిని అనే నిజం బయటపెట్టబోయి ఆగిపోతాడు కాశీ తండ్రి. తన మా అన్న కూతురు అని మాట మార్చేస్తాడు. పారిజాతం వల్లే జ్యోత్స్న ఇలా తయరవుతుందని అంటాడు.
మా వల్ల తప్పు జరిగింది…
జ్యోత్స్నను తీసుకొని కార్తీక్ ధర్నా చేస్తోన్న చోటుకు వస్తాడు దశరథ్. ఏం సార్ కోపంతో మమ్మల్ని కొట్టడానికి వచ్చారా అని దశరథ్‌ను అడుగుతాడు కార్తీక్. చేసిన తప్పుకు క్షమాపణ చెప్పడానికి వచ్చానని దశరత్ బదులిస్తాడు. మా వల్ల పెద్ద తప్పు జరిగిందని చెబుతాడు.
జ్యోత్స్న సారీ…
ఇది తప్పు కాదు…బాధ్యతలు మర్చిపోవడం జ్యోత్స్నపై కార్తీక్ సెటైర్లు వేస్తాడు. ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తీసేస్తే వీళ్లు ఏమైపోతారని, కంపెనీపై ఆధారపడేవాళ్లకు అన్యాయం చేయద్దని కార్తీక్ అంటాడు. దశరథ్ ఉద్యోగులందరికి సారీ చెబుతాడు. జ్యోత్స్నను కూడా క్షమాపణలు చెప్పమని అంటాడు. తండ్రి మాట కాదనలేక మొక్కుబడిగా సారీ చెబుతుంది.
కార్తీక్ జిందాబాద్…
మీరంతా ఎప్పటిలాగే మీ మీ పోస్టుల్లో కొనసాగవచ్చని ఉద్యోగులకు దశరథ్ మాటిస్తాడు. మీ బోనస్‌లు, ఇంక్రిమెంట్స్‌లో ఎలాంటి మార్పు ఉండదని ఉద్యోగులకు దశరథ్ మాటిస్తాడు. ఆయన మాట వినగానే ఉద్యోగులు ఆనందపడతారు. కార్తీక్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సంబరపడిపోతారు. కార్తీక్ మెడలో పూలదండ వేస్తారు. కార్తీక్, దీపకు థాంక్స్ చెబుతారు.
జ్యోత్స్న కోపం…
ఈ పూల దండలు, అభినందనలు తనకు అవసరం లేదని, మీ ఎండీకి, సీఈవోకు చెప్పమని ఉద్యోగులకు చెబుతాడు కార్తీక్. అయినా వినకుండా కార్తీక్‌ను భుజాలపై ఎత్తుకొని సంబరాలు చేస్తారు.
పని చేసేది తన దగ్గర..పొగిడేది శత్రువును అని ఆ సీన్ చూసి జ్యోత్స్న లోలోన కోపంతో రగిలిపోతుంది.
కార్తీక్‌కు మీ లాంటి వైఫ్ ఉండటం ఆనందంగా ఉందని ప్రభాకర్ అంటాడు. జ్యోత్స్నను ఏడిపించడానికి మరోసారి ఆ మాట చెప్పమని ప్రభాకర్‌తో అంటాడు కార్తీక్. మళ్లీ ఇదే మాట చెబుతాడు ప్రభాకర్. అది చూసి జ్యోత్స్న కోపం పట్టలేకపోతుంది. ముఖం పక్కకు తిప్పుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2సీరియల్ ముగిసింది.