Aishwarya Rajesh: వెంకటేష్‌తో నటించడమంటే చాలా భయమేసింది.. ఓసారి జ్వరం కూడా వచ్చింది.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Aishwarya Rajesh: వెంకటేష్‌తో నటించడమంటే చాలా భయమేసింది.. ఓసారి జ్వరం కూడా వచ్చింది.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu
Jan 09, 2025 06:45 AM IST

Aishwarya Rajesh On Acting With Venkatesh In Sankranthiki Vasthunnam: సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఒక హీరోయిన్‌గా నటించింది ఐశ్వర్య రాజేష్. వెంకటేష్‌తో నటించడం, సంక్రాంతికి వస్తున్నాం మూవీ, అందులోని పాత్ర తదితర సినీ విశేషాలను పంచుకుంది ఐశ్వర్య రాజేష్.

వెంకటేష్‌తో నటించడమంటే చాలా భయమేసింది.. ఓసారి జ్వరం కూడా వచ్చింది.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్
వెంకటేష్‌తో నటించడమంటే చాలా భయమేసింది.. ఓసారి జ్వరం కూడా వచ్చింది.. ఐశ్వర్య రాజేష్ కామెంట్స్

Aishwarya Rajesh Venkatesh Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మూడోసారి తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.

yearly horoscope entry point

ఈ సినిమాలో వెంకేటేష్‌కు జోడీగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్‌గా నటించారు. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం నుంచి విడుదలైన పాటలు సెన్సేషనల్ హిట్‌గా నిలిచి సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని మరింతగా పెంచింది. జనవరి 14న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ విలేకరుల సమావేశంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ విశేషాల్ని పంచుకున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో ఎలా వచ్చారు ? ఈ మూవీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది?

-సుడల్ ఓటీటీ వెబ్ సిరిస్ షూటింగ్‌లో ఉన్నప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి గారి నుంచి కాల్ వచ్చింది. ఓ క్యారెక్టర్‌కి లుక్ టెస్ట్ చేయాలని అన్నారు. నేను చాలా సర్‌ప్రైజ్ అయ్యాను. ఆయన సినిమాలన్నీ చూశాను. ఇందులో నా క్యారెక్టర్‌కి ఒక యాస ఉంది. ఆ యాసతో పాటు ఆ లుక్ టెస్ట్ కోసం హైదరాబాద్ వచ్చాను.

– ఓ డైలాగ్ ఇచ్చారు. రెండు లైన్స్ చెప్పగానే చాలని చెప్పి స్క్రిప్ట్‌ని నరేట్ చేశారు. నరేషన్‌లో పడిపడి నవ్వుకున్నాను. నా కెరీర్‌లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే. భాగ్యం క్యారెక్టర్ కోసం చాలా వెతికారు. ఆ పాత్ర నాకు దక్కడం ఆనందంగా ఉంది.

-ఇప్పటివరకూ చాలా సినిమాలు చేశాను. ‘సంక్రాంతికి వస్తున్నాం‘ నాకు చాలా స్పెషల్. గోదారి గట్టు పాట అందరికీ రీచ్ అయింది. నేను ఎయిర్ పోర్ట్‌లో కనిపిస్తే ప్రతి ఒక్కరూ నాతో ఫోటో తీసుకుంటున్నారు. అది ఆ పాటకి వచ్చిన రీచ్. ఆ సాంగ్ ఒక వైల్డ్ ఫైర్‌లా పాకింది.

-తెలుగులో నాకు ఇప్పటివరకూ సరైన డ్యూయెట్ సాంగ్ పడలేదు. ఆ లోటు గోదారి గట్టు పాటతో తీరింది. వెంకటేష్ గారు లాంటి బిగ్ హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం అది ఇంత వైరల్ హిట్ కావడం ఆనందంగా ఉంది. అలాగే సినిమాలో పాటన్నీ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. పాటలు హిట్ అయితే సగం పాసైపోయినట్లే. ట్రైలర్ ఆ అంచనాలని మరింతగా పెంచింది. ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా.

వెంకటేష్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది ?

-బిగినింగ్‌లో చాలా భయం వేసింది. ఎందుకంటే భాగ్యం.. మామూలు క్యారెక్టర్ కాదు. కత్తిమీద సాములాంటి క్యారెక్టర్. కొంచెం బ్యాలెన్స్ తప్పినా కష్టమే. ఇంతకుముందు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. ఆడియన్స్ చుస్తున్నప్పుడు జాలి పుట్టే క్యారెక్టర్. చాలా క్రూసియాల్ రోల్. కాస్త శ్రుతిమించిన ఓవర్ డోస్ అయిపోతుంది. భాగ్యం పాత్రని అర్ధం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది.

వెంకటేష్ గారు ఎమోషన్స్ అన్నీ నేచురల్‌గా ఉంటాయి. ఆయన టైమింగ్ అద్భుతం. ఆయనతో కలసి యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. భాగ్యం క్యారెక్టర్‌లో అదరగొడుతున్నావ్ అని మెచ్చుకునే వారు. కానీ, డైలాగులు ఇచ్చేటప్పుడు టెన్షన్ వచ్చేసేది. చేతులు వణికేవి. ఒకసారి ఫీవర్ కూడా వచ్చింది (నవ్వుతూ). వెంకీ గారు, అనిల్ గారి సపోర్ట్ మర్చిపోలేను. వెంకీ గారు చాలా పాజిటివ్‌గా ఉంటారు. వండర్‌ఫుల్ పర్సన్.

– భాగ్యం లాంటి క్యారెక్టర్ ఐదారేళ్లుగా తెలుగు సినిమాల్లో చూడలేదు. చాలా ఫ్రెష్ రోల్. ఇలాంటి ఫ్యామిలీ ఫీల్ గుడ్ సినిమా వచ్చి చాలా రోజులైయింది. అందరూ కనెక్ట్ చేసుకునే సినిమా ఇది. అనిల్ గారు చాలా క్రియేటివ్‌గా ఈ కథని చెప్పారు.

Whats_app_banner

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024