Best Web Hosting Provider In India 2024
Romantic Tragedy: మలయాళం రొమాంటిక్ ట్రాజెడీ మూవీ ఓటీటీలోకి వచ్చింది – తెలుగులోనూ స్ట్రీమింగ్
Romantic Tragedy: మలయాళం రొమాంటిక్ ట్రాజెడీ మూవీ కల్బ్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఐదు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రంజిత్ సజీవ్, నేహా నజ్నీన్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి సాజిద్ దర్శకత్వం వహించాడు.
Romantic Tragedy: మలయాళం రొమాంటిక్ మూవీ క్వల్బ్ ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో రెంటల్ విధానంలో మలయాళం వెర్షన్ డిసెంబర్‌లోనే రిలీజైంది. తాజాగా ఈ మూవీని ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఐదు భాషల్లో రిలీజ్ చేశారు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లలో డిజాస్టర్…
ఈ మలయాళం మూవీలో రంజిత్ సజీవ్, నేహా నజ్నీన్ హీరోహీరోయిన్లుగా నటించారు. గత ఏడాది జనవరిలో ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. కల్బ్ మూవీకి సాజిద్ యాహియా దర్శకత్వం వహించాడు.
2020లోనే కల్బ్ మూవీ షూటింగ్ మొదలైంది. కానీ అనివార్య కారణాల వల్ల నాలుగేళ్లు ఈ మూవీ ఆలస్యంగా రిలీజైంది.
12 పాటలు…
కల్బ్ మూవీలో సిద్ధికీ, అథిరా పటేల్, జాఫర్ ఇడుక్కి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. ప్రకాష్ అలెక్స్, విమల్ నజర్, నిహాల్ సాధిఖ్ సంగీతం అందించారు. మొత్తం 12 పాటలతో మేకర్స్ ఈ మూవీని రూపొందించారు.
డిఫరెంట్ లవ్‌స్టోరీ…
డిఫరెంట్ లవ్‌స్టోరీగా దర్శకుడు సాజిద్ కల్బ్ మూవీని తెరకెక్కించాడు. సూఫీ సిద్ధాంతాల ప్రకారం ప్రేమ, నమ్మకం, వ్యామోహం, ఆకర్షణ, ఆరాధన, మరణం లాంటి అంశాలను ఈ కథలో చూపించారు. విషాదాంత ప్రేమకథగా ఈ మూవీ రూపొందింది.
కులమతాల అడ్డుగోడలు…
లియో కాల్పో తండ్రితో కలిసి ఓ బీచ్ రెస్టారెంట్ రన్ చేస్తుంటాడు. ఫారిన్‌లో సెటిల్ అవ్వాలని కలలు కంటాడు. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ ఫారిన్ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆమెతో కలిసి విదేశాల్లో సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. అనుకోకుండా తంబి అనే ముస్లిం అమ్మాయిని చూస్తాడు లియో. తొలిచూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. కులమతాలు అడ్డుగోడలను దాటుకొని తంబి, లియో ఒక్కటయ్యారా? ప్రేమలో లియో ఓడిపోవడానికి కారణమేమిటి అన్నదే కల్బ్ మూవీ కథ.
డైరెక్టర్‌గా…యాక్టర్‌గా…
సాజిద్ డైరెక్టర్‌గా, యాక్టర్‌గా మలయాళంలో పలు సినిమాలు చేశాడు. బెంగళూరు డేస్, ఫ్రైడ్‌తో పాటు మరికొన్ని సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించాడు. ఇన్స్‌పెక్టర్ దావూద్ ఇబ్రహీం , మోహన్‌లాల్‌తో పాటు మరో రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.