Best Web Hosting Provider In India 2024
APHC On Ticket Prices: పది రోజులకు మించి టిక్కెట్ ధరలు పెంచొద్దన్న ఏపీ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులపై ఆగ్రహం
APHC On Ticket Prices: ఏపీలో గేమ్‌ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాల టిక్కెట్ ధరలను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.ప్రభుత్వ జీవోలకు విరుద్ధంగా సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వుల్ని జారీ చేయడాన్ని తప్పు పట్టింది.పది రోజులకు మించి పెంపుదల ఉండకూడదని స్పష్టం చేసింది.
APHC On Ticket Prices: సంక్రాంతి సినిమా టిక్కెట్ ధరల పెంపుదలపై ఏపీ హైకోర్టు ఆంక్షలు విధించింది. గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాల టిక్కెట్ ధరల పెంపుదలను 10రోజులకు పరిమితం చేయాలని స్పష్టం చేసింది.
డాకు మహరాజ్, గేమ్ చేంజర్ సినిమా టికె ట్లను విడుదలైన రోజు నుంచి మొదటి 14 రోజులపాటు అధిక ధర లకు అమ్ముకునేందుకు ఆ చిత్ర నిర్మాతలకు అనుమతినిస్తూ ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు తప్పుపట్టింది. సినిమా టిక్కెట్ల ధరల పెంపుదలను మొదటి 10 రోజులకు పరిమితం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో శుక్రవారం పూర్తిస్థాయి ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు ప్రకటించింది.
సినిమా టిక్కెట్ల ధరల పెంపుదలపై దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు చీఫ్ జస్టిస్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిల నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. బాలకృష్ణ నటించిన డాకు మహ రాజ్, రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాల టికెట్లను మొదటి 14 రోజుల పాటు అధిక ధరలకు విక్రయించుకునేందుకు చిత్ర నిర్మాతలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడాన్ని సవాలు చేస్తూ గుంటూరుకి చెందిన అరిగెల శ్రీనివా సులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు మొదటి 10 రోజుల పాటు అధిక ధరలకు టికెట్లు అమ్ముకునేందుకు అనుమతినిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో జీఓ-13 జారీచేసిందని, ఆ జీవోకు విరుద్ధంగా రెండు సినిమాలకు 14 రోజులపాటు అధిక ధరలకు అమ్ముకునేం దుకు వీలుగా మెమో జారీ చేయడాన్ని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా మెమో జారీ చేశారని ఫిర్యాదు చేశారు.
డాకు మహరాజ్‌లో నటించిన బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారని, ముఖ్యమంత్రికి సొంత బావమరిది అని, రామ్ చరణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న కొడుకని.. ఈ కారణాలతో రెండు సినిమాలకు అధిక ధరల వసూలుకు అనుమతులు జారీ చేశారని చెప్పారు. గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఇద్దరు రోడ్డు ప్రమాదంలో చనిపోయారని దీనిని దృష్టిలో పెట్టుకుని అర్థరాత్రి ప్రీమియర్ షోలను రద్దుచేయాలని వాదించారు. దీనిపై సీజే ధర్మాసనం స్పందించి సినిమాలకు అధిక ధరలను మొదటి 10 రోజులకే పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రీమియర్ షోలను నిలిపివేయాలనే వాదనలపై స్పందించిన ధర్మాసనం ‘శ్రీహరికోట రాకెట్ ప్రయో గానికి వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తులు మరణించారనే కారణంతో శ్రీహరికోటలో ప్రయోగాలు నిలిపి వేయాలన్న తరహాలో మీ అభ్యర్ధన ఉందని వ్యాఖ్యానించారు. పిల్‌పై తగిన ఉత్తర్వులు జారీచేస్తామని విచారణ వాయిదా వేశారు.
టాపిక్