Best Web Hosting Provider In India 2024
Renu Desai: రేణు దేశాయ్ నాకు సోదరిలాంటిది.. పురిటి నొప్పుల్ని అలా చూపించడంతో కన్నీళ్లు వచ్చాయి.. డైరెక్టర్ కామెంట్స్
1000 Words Director Ramana Villart About Renu Desai: అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ దివి నటించిన లేటెస్ట్ మూవీ 1000 వర్డ్స్. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ రమణ విల్లర్ట్ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇటీవల జరిగిన 1000 వర్డ్స్ స్పెషల్ షో సందర్భంగా డైరెక్టర్ రమణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Director Ramana Villart About Renu Desai: అరవింద్ కృష్ణ, బిగ్ బాస్ దివి వాద్యా, మేఘన శ్రీనివాస్, వినయ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 1000 వర్డ్స్. ఈ సినిమాకు రమణ విల్లర్ట్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించారు. డా. సంకల్ప్ కథ, డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించిన 1000 వర్డ్స్ స్పెషల్ ప్రీమియర్‌ను ఇటీవల ప్రదర్శించారు.
1000 వర్డ్స్ స్పెషల్ ప్రీమియర్
ఈ స్పెషల్ ప్రీమియర్‌కు రేణు దేశాయ్, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చి రెడ్డి, మధుర శ్రీధర్, జ్యోతి పూర్వాజ్, సుకు పూర్వాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేయగా కార్యక్రమంలో బిగ్ బాస్ దివి, హీరో అరవింద్ కృష్ణ, మేఘన శ్రీనివాస్, డైరెక్టర్ రమణ తదితర టెక్నికల్ టీమ్ పాల్గొంది. ఈ సందర్భంగా రేణు దేశాయ్, 1000 వర్డ్స్ సినిమాపై డైరెక్టర్ రమణ విల్లర్ట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
“గత 20 ఏళ్లుగా నేను ఓ మంచి సినిమాను చేయాలని తపిస్తూనే ఉన్నాను. నాకు కథలు రాయడం రాదు. నేను చాలా కథలు వింటూ వచ్చాను. అప్పుడే సంకల్ప్ ఈ కథతో వచ్చారు. ఓ తల్లి బిడ్డను కనేప్పుడు పడే బాధను చెప్పాలని, చూపించాలనే ఈ సినిమాను తీశాం. అరకులో పూర్తిగా షూట్ చేశాం. మేఘన గారు అమ్మ పాత్రలో అద్భుతంగా నటించారు. పురిటి నొప్పుల్ని డబ్బింగ్‌లో చూపించడంతో కన్నీళ్లు వచ్చాయి” అని డైరెక్టర్ రమణ విల్లర్ట్ తెలిపారు.
స్టార్ హీరో అవుతారు
“ఇలాంటి కథకు హీరోగా ఎవరు వస్తారో అని అనుకున్నాం. ఈ కథను అరవింద్ గారికి చెబితే వెంటనే ఒప్పుకున్నారు. కథ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయని అన్నారు. ఆయన మాకు ఎంతో సహకరించారు. ఆయన అద్భుతంగా నటించారు. త్వరలోనే ఆయన పెద్ద స్టార్ హీరో అవుతారు. దివి నటన చూసి అంతా ఫిదా అవుతున్నారు. దివి చాలా అందంగా ఉండటమే కాదు అంతే అద్భుతంగా నటించారు” అని రమణ విల్లర్ట్ అన్నారు.
“చైల్డ్ ఆర్టిస్ట్ విజయ్ అలియాస్ నూరీ నటన చూసి నాకు ముచ్చట వేసింది. ఎంత చదువుకుంటావో చదువుకో నేనుంటాను అని మాటిచ్చాను. నాకు ఆ పిల్లాడు అంతగా నచ్చాడు. మ్యూజిక్ డైరెక్టర్ శివ కృష్ణ ఇచ్చిన ట్యూన్‌కు కీరవాణి తండ్రి గారు శివశక్తి దత్తా అద్భుతంగా రాశారు. లక్ష్మీ భూపాల గారు రెమ్యునరేషన్ లేకుండా పాట రాసిచ్చారు” అని దర్శకుడు రమణ పేర్కొన్నారు.
సపోర్ట్ ఇస్తానన్నారు
“శివ రామ్ చరణ్ ఫ్రేమ్స్ చూసి నాకు అద్భుతంగా అనిపించింది. తొమ్మిది నెలలు నాతో పాటు జర్నీ చేశాడు. ఓ ఫోటోగ్రాఫర్‌కు నచ్చేలా సినిమాటోగ్రఫర్ పని చేయడం మామూలు విషయం కాదు. సంకల్ప్ నాకు ఎన్ని వెర్షన్స్ కావాలంటే అన్ని వెర్షన్స్ ఇచ్చాడు. ఎడిటర్ మనోజ్ మాకు అద్భుతంగా ఎడిట్ చేసి ఇచ్చాడు” అని రమణ విల్లర్ట్ చెప్పుకొచ్చారు.
“రేణు దేశాయ్ గారు నాకు సోదరి వంటి వారు. ఆమెకు ఈ కథ చెప్పగానే ఎమోషనల్ అయ్యారు. ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేస్తానని ఆమె ముందుకు వచ్చారు. సోనికి బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేశాను. వాళ్లు ఇచ్చిన కెమెరాతో షూట్ చేశాను. అపర్చర్ లైట్స్ కూడా ఇచ్చారు. కూప్ లెన్స్ ఇచ్చి సపోర్ట్ చేసిన రాజ్ కుమార్ గారికి థాంక్స్. నేను మొదటి ప్రయత్నం చేశాను. చూసిన వారంతా తప్పులు చెప్పండి. వాటిని తెలుసుకుని సరిదిద్దుకుంటాను” అని దర్శకనిర్మాత రమణ విల్లర్ట్ వెల్లడించారు.