Best Web Hosting Provider In India 2024
09 Jan 2025 12:13 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్
కర్నూలు: తిరుపతి తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు మృతి చెందిన ఘటనలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి వ్యాఖ్యలు వింతగా ఉన్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై చైర్మన్ బీఆర్ నాయుడు చింతించడం తప్ప చేసేదేమీ లేదని అనడం బాధాకరమన్నారు.ఈ ఘటనపై ఎవరూ ఏం చేయలేరు.. దైవ నిర్ణయమంటూ తప్పించుకోవడం సరికాదన్నారు. పరిపాలనా లోపం వల్లే తొక్కిసలాట జరిగిందని, భక్తుల మరణాలపై టీటీడీ ఛైర్మన్ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేశారని ఎస్వీమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.