Best Web Hosting Provider In India 2024
Fitness: రామ్‌దేవ్ బాబా 59 ఏళ్ల వయసులో అంత ఫిట్ గా ఉండడానికి కారణం ఈ ఆహారమేనట, ఆయన మెనూ ఇదే
Fitness: ఫిట్నెస్, డైట్, యోగా విషయంలో బాబా రాందేవ్ సూచనలు, సలహాలు ఎంతో మంది తీసుకుంటూ ఉంటారు. అనుసరించిన విధానంలోని కొన్ని కీలక విషయాలు ఓ ఇంటర్వ్యూలో వెల్లడయ్యాయి.
బాబా రాందేవ్ ఆరోగ్యపరంగా, ఆహారపరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అందుకే ఆయన 59 ఏళ్ల వయసులో కూడా శారీరకంగా, మానసికంగా పటిష్టంగా కనిపిస్తారు. యువతతో పోటీపడుతూ రన్నింగ్, యోగాలాంటివి చేస్తారు. అతడి ఆరోగ్య రహస్యాలను తెలుసుకునేందుకు ఎంతో మంది ఇంటర్య్వూలు చేశారు. తాజాగా కర్లీ టేల్స్ కు ఆయన ఇంటర్య్లూ ఇచ్చారు. అందులో భాగంగా తాను తినే తిండి, యోగాసనాలు కూడా గురించి ఆయన వివరించారు.
బాబా రాందేవ్ మాట్లాడుతూ జీవితంతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు. ఈ యోగా గురువు సాత్విక ఆహారం ముఖ్యతను కూడా వివరించారు.
ఉదయం 3కే లేచి
రాందేవ్ బాబా ప్రతిరోజూ తెల్లవారు జామున 3 గంటలకే నిద్రలేస్తానని చెప్పారు. లేచిన తరువాత ఆయన ఉదయం చేసే మొదటి పని ప్రార్థన చేయడం. “నేను భూమాతకు, గురువులు, ఋషులను ప్రార్థిస్తాను. తరువాత నేను గోరువెచ్చని నీరు తాగుతాను, అది ఒకటి లేదా రెండు నిమిషాల్లో నా కడుపును క్లియర్ చేస్తుంది. ఆ వెంటనే స్నానం చేసి, ఆ తర్వాత రోజూ ఉదయం గంటసేపు ధ్యానం చేస్తాను’ అని ఆయన చెప్పుకొచ్చారు.
ఆయన సింపుల్ వెజిటేరియన్ డైట్ ను మాత్రమే పాటిస్తారు. మీరు ఎప్పుడైనా చీట్ మీల్ తిన్నారా అని అడిగిన ప్రశ్నకు బాబా రాందేవ్ ఏనాడు తినలేదని సమాధానమిచ్చారు. ప్రతి ఒక్కరూ చేయాల్సిన యోగాసనాలు గురించి ఆయన ప్రజలకు ఎన్నో సలహాలు ఇచ్చారు.
ఫిట్నెస్, డైట్చ యోగా విషయంలో బాబా రాందేవ్ ఇచ్చిన చిట్కాలను, సలహాలను అనుసరించడం ద్వారా, మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చు. ఆరోగ్యం, ఆనందం కోసం ఆయన జీవితాన్ని ఎలా మార్చుకోవాలో కూడా చెప్పారు.
సాత్విక ఆహారంతోనే ఆరోగ్యం
ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడానికి సాత్విక ఆహారం అవసరమని రాందేవ్ చెబుతున్నారు. సాత్విక ఆహారం సహజ వనరుల నుండి తయారవుతుంది. కృత్రిమ వనరులు, క్రిమిసంహారకాలు, టాక్సిన్స్ వంటి వాడని ఆహారాన్ని తినడం అత్యవసరం. ఈ ఆహారం తేలికైనది, జీర్ణించుకోవడం సులభం. ఆ ఆహారం జీర్ణవ్యవస్థను ఒత్తిడి చేయదు. ఇది ఆయుర్వేదం ప్రకారం మూడు దోషాలను (వాతం, పిత్తం, కఫం) సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. మీ శరీరాన్ని, మనస్సును ఆరోగ్యంగా ఉంచేందుకు సాత్విక ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చడం చాలా అవసరం.
సింపుల్ యోగాసనాలు
బాబా రాందేవ్ సాధారణ యోగా ఆసనాలు (భంగిమలు) తో రోజును ప్రారంభిస్తారు. ప్రతిరోజూ యోగా సాధన చేయడం ద్వారా శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది. శ్వాస వ్యాయామాల ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. రోజువారీ జీవితంలో యోగాను చేర్చడం వల్ల దాని వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మీ ఉదయం ఫిట్నెస్ దినచర్యకు యోగాను జోడించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
రాందేవ్ బాబా మెనూ ఇదే
నిద్ర లేచాక నోటిని శుభ్రం చేసుకుని ఉసిరి రసాన్ని, లేదా కలబంద రసాన్ని వేడినీటిలో కలిపి తాగుతూ ఉంటారు. స్నానం, పూజలు అయ్యాక అరలీటరు ఆవు పాలు తాగుతారు. తరువాత ఆయన ఎలాంటి బ్రేక్ ఫాస్ట్ తీసుకోరు. రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తింటారు. ఉదయం పదిగంటలకు మధ్యాహ్న భోజనం చేస్తారు. ఆ భోజనంలో రెండు రోటీలు, కూరగాయలతో వండిన కూరలు, కొంచెం అన్నం తింటారు. మధ్యాహ్నం రెండు కిలోమీటర్ల దాకా నడుస్తారు. ఆయన రాత్రిపూట కూడా ఇలాగే భోజనం చేస్తారు. అయితే మజ్జిగ, పెరుగు వంటివి మాత్రం రాత్రి భోజనంలో తినరు.