Best Web Hosting Provider In India 2024
Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్ తండ్రి హీరోగా నటించిన తెలుగు సినిమాలు ఇవే – చిరంజీవి, బాలకృష్ణ మూవీస్‌లో విలన్‌గా!
Aishwarya Rajesh: సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఈ సంక్రాంతికి తెలుగులో హీరోయిన్‌గా తన లక్‌ను పరీక్షించుకోబోతున్నది ఐశ్వర్య రాజేష్. ఆమె కెరీర్‌లో బిగ్ బడ్జెట్ తెలుగు మూవీగా సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతోంది. ఐశ్వర్య రాజేష్ తాతతో పాటు ఆమె తండ్రి కూడా తెలుగులో పలు సినిమాలు చేశారు.
Aishwarya Rajesh Father: ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటిస్తోన్న సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఈ సంక్రాంతికి ప్రేక్షకులను పలకరించబోతున్నది. వెంకటేష్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీకి అనిల్‌రావిపూడి దర్శకత్వం వహిస్తోన్నాడు. తెలుగులో ఐశ్వర్య రాజేష్ హీరోయన్‌గా నటిస్తోన్న ఫస్ట్ బిగ్ బడ్జెట్ మూవీ ఇదే కావడం గమనార్హం.
వరల్డ్ ఫేమస్ లవర్…
గతంలో తెలుగులో వరల్డ్ ఫేమస్ లవర్, టక్ జగదీష్, రిపబ్లిక్‌తో పాటు మరికొన్ని సినిమాలు చేసింది. నటిగా ఈ సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టిన కమర్షియల్‌గా మాత్రం సక్సెస్‌లను అందివ్వలేకపోయాయి. తమిళంలో హీరోయిన్‌గా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన మూవీస్ చేస్తూ సఫరేట్‌గా ఫ్యాన్ బేస్‌ను ఏర్పరుచుకుంది.
తాత..తండ్రి…
ఐశ్వర్య రాజేష్ తాత, తండ్రితో పాటు ఆమె ఫ్యామిలీలో చాలా మంది సినీ పరిశ్రమలో నటులుగా రాణించారు. ఐశ్వర్య రాజేష్ తాత అమరనాథ్ 1950 -60 దశకంలో టాలీవుడ్‌లో హీరోగా వెలుగువెలిగాడు. తండ్రి బాటలోనే ఐశ్వర్య రాజేష్ తండ్రి రాజేష్ కూడా సినిమాల్లోనే అడుగుపెట్టాడు.
జంధ్యాల దర్శకత్వంలో…
జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన నెలవంక మూవీతో రాజేష్ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో సలీమ్ పాత్రలో అసమాన నటనను కనబరిచాడు. తొలి మూవీనే హిట్ కావడంతో రాజేష్‌కు అవకాశాలు క్యూ కట్టాయి. జంధ్యాల దర్శకత్వంలోనే వచ్చిన రెండు జళ్ల సీత, ఆనందభైరవి సినిమాల్లో కూడా రాజేష్ హీరోగా కనిపించాడు. చిరంజీవి పల్లెటూరి మొనగాడు, బాలకృష్ణ సీతారామ కళ్యాణంతో పాటు నలభైకిపైగా సినిమాల్లో విలన్‌గా నటించాడు. తన విలనిజంతో ప్రేక్షకులకు మెప్పించాడు.
38 ఏళ్ల వయసులోనే…
తాగుడుకు అలవాటుపడిన రాజేష్ 38 ఏళ్ల వయసులోనే లివర్ డ్యామేజీ కారణంగా కన్నుమూశాడు. తండ్రి చనిపోయే నాటికి ఐశ్వర్య రాజేష్ వయసు ఎనిమిది ఏళ్లేనట. తండ్రి నట వారసత్వాన్ని కొనసాగించిన ఐశ్వర్యరాజేష్ తొలుత సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి హీరోయిన్‌గా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నది.
నలుగురు పిల్లల తల్లిగా…
సంక్రాంతికి వస్తున్నాం మూవీలో భాగ్యం అనే క్యారెక్టర్‌లో నలుగురు పిల్లల తల్లిగా ఐశ్వర్యరాజేష్ కనిపించబోతున్నది. సుడల్ అనే వెబ్‌సిరీస్‌లో తన యాక్టింగ్ నచ్చి అనిల్ రావిపూడి ఈ అవకాశం ఇచ్చినట్లు ప్రమోషన్స్‌లో ఐశ్వర్య రాజేష్ చెప్పింది. ప్రస్తుతం తమిళంలో మూడు, కన్నడంలో ఓ సినిమా చేస్తోంది ఐశ్వర్య రాజేష్.