Best Web Hosting Provider In India 2024
విజయనగరం జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)
విజయనగరం: ఒక్క సినిమా ఫంక్షన్ కి మంత్రులు, కలెక్టర్, ఇతర అధికారులు రివ్యూ చేసుకుంటారు కానీ, ఇంత పెద్ద పండుగకు సమీక్ష చేసుకునే సమయం లేదా అని విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) మండిపడ్డారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలో ఎప్ప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదన్నారు. ఈ ఘటనకు పూర్తిగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు. భక్తుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిలో భక్తుల మరణాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పాపం తగలదా అని మజ్జి శ్రీనివాసరావు ప్రశ్నించారు. ముక్కోటి ఏకాదశి ప్రతీ సంవత్సరం జరిగే కార్యక్రమం కనీస ఏర్పాట్లు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి పాలకమండలి, టిటిడి అధికారులు నిర్లక్ష్యం వహించారని ధ్వజమెత్తారు. ఏడుగురు భక్తులు మరణించారు, దాదాపు నలభై మంది భక్తులు హాస్పటల్ లో చికిత్స చేయించుకుంటున్నారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, టిటిడి పాలకమండలి, టిటిడి అధికారులు పూర్తిగా బాధ్యత వహించాలన్నారు.
గత వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి సంఘటన ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు.రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటన చోటు చేసుకుందని ఆక్షేపించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే ఏర్పాట్లలో చాలా లోటు పాట్లు ఉన్నాయి వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో ఉదయం నుంచి ఉన్న భక్తులకు కనీసం మంచి నీళ్లు గాని ఇవ్వలేదు, కనీస ఏర్పాట్లు కూడా చేయలేదని తప్పుపట్టారు. ఉదయం నుంచి భక్తులను లైన్లో ఉంచి సాయంత్రం ఒక్కసారిగా గేట్లు తీసి లోపలికి పంపించాడంతో ఇటువంటి ఘటన చోటు చేసుకుందన్నారు. ప్రభుత్వం గాని, అధికారులు గాని, పోలీస్ వ్యవస్థ గాని సామాన్య ప్రజలకు సరైన పాలన అందించడం లేదనడానికి తిరుపతిలో జరిగిన ఈ దుర్ఘటనే నిదర్శనమని మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద రాజకీయ కక్ష తీర్చుకోవడానికే కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తుందని ఆయన ఫైర్ అయ్యారు.