Best Web Hosting Provider In India 2024
Allu Arjun New Look: అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్.. ఐదేళ్ల పాటు ఉన్న పుష్ప లుక్ పోయింది
Allu Arjun New Look: అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపించాడు. ఐదేళ్ల పాటు పుష్ప కోసం భారీ గడ్డం, లాంగ్ హెయిర్ స్టైల్ మెయింటేన్ చేసిన అతడు.. మొత్తానికి ఇప్పుడు స్లిమ్ అండ్ ట్రిమ్ లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు.
Allu Arjun New Look: ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదేళ్ల పాటు అల్లు అర్జున్ ఒకే లుక్ లో కనిపించాడు. పుష్ప మూవీ రెండు భాగాల కోసం భారీగా గడ్డం, జుట్టు పెంచి కనిపించిన అతడు.. మొత్తానికి ఆ సినిమా ప్రయాణం ముగియడంతో ఇప్పుడు కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. తాజాగా ఎయిర్ పోర్టులో షార్ట్ హెయిర్ స్టైల్, గడ్డంతో బన్నీ కనిపిస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ కొత్త స్టైల్ అతనికి బాగా సూటైందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ కొత్త లుక్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొన్నాళ్లుగా మీడియాకు దూరంగా ఉంటున్నాడు. సంధ్య థియేటర్ ఘటన, జైలు, కోర్టు కేసులతో సతమతమవుతున్న అతడు.. బయట పెద్దగా కనిపించడం లేదు. పుష్ప 2 మూవీ అంత పెద్ద సక్సెస్ సాధించినా తాను ఎంజాయ్ చేయలేకపోతున్నాని ఆ మధ్య చెప్పాడు. ఇక ఇప్పుడు కొత్త లుక్ లో బన్నీ కనిపిస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గురువారం (జనవరి 9) ఉదయం ఎయిర్ పోర్టులో అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్ తో కనిపించాడు.
కొన్నేళ్ల పాటు అతన్ని లాంగ్ హెయిర్ స్టైల్లో చూసిన ఫ్యాన్స్ కు బన్నీ ఇప్పుడు కొత్తగా కనిపిస్తున్నాడు. అతడు జులాయి మూవీ తీసిన సమయంలో ఎలా ఉన్నాడో ఇప్పుడలా కనిపిస్తున్నాడంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కోసమే ఈ కొత్త స్టైల్ అనీ భావిస్తున్నారు. పుష్ప 3 కూడా ఉంటుందని సెకండ్ పార్ట్ ద్వారా మేకర్స్ చెప్పినా.. అది ఎప్పుడన్నదానిపై క్లారిటీ లేదు. దీంతో బన్నీ ప్రస్తుతానికి ఈ కొత్త లుక్ కి మారినట్లు తెలుస్తోంది. అతని తర్వాతి సినిమాపై అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రానుంది.
పుష్ప 2.. బ్లాక్‌బస్టర్
పుష్ప 2 మూవీ అన్ని అంచనాలను అధిగమిస్తూ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.1900 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు దంగల్ మూవీని కూడా వెనక్కి నెట్టి ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలుస్తుందా లేదా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ అది అంత సులువుగా కనిపించడం లేదు.
నెల రోజులు దాటిన తర్వాత పుష్ప 2 బాక్సాఫీస్ జోరు నెమ్మదించింది. దీంతో దంగల్ ను మించడం అసాధ్యంగానే కనిపిస్తోంది. మరోవైపు ఈ సినిమాకు మరో 20 నిమిషాలు జోడించి జనవరి 11 నుంచి థియేటర్లలో పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ తీసుకొస్తామని చెప్పిన మేకర్స్.. తర్వాత వాయిదా వేశారు. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట, తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్, బెయిలుపై విడుదల వంటి వివాదాలు నెలకొన్నాయి.
టాపిక్