Best Web Hosting Provider In India 2024
Rajamouli: భార్యల సంపాదన మీద బతికిన స్టార్ సెలబ్రిటీలు.. రాజమౌళి నుంచి యానిమల్ విలన్ వరకు!
Rajamouli To Bobby Deol Who Depended On Wife Income: సినిమాలతో కోట్లల్లో సంపాందించే సెలబ్రిటీలు కూడా ఒకప్పుడు వారి భార్యల సంపాదన మీద బతికిన పరిస్థితులు ఉన్నాయి. వారిలో దర్శక దిగ్గజం రాజమౌళి కూడా ఉండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది. మరి అలా తమ భార్యల డబ్బుపై బతికిన సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
Rajamouli To Bobby Deol Who Depended On Wife Income: సినిమాల్లో నటించే యాక్టర్స్ నుంచి డైరెక్టర్స్ వరకు ఎవరి రేంజ్‌కు తగినట్లుగా లక్షల్లో, కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటారు. అలాంటి వారికి ఒకరి సంపాదనపై ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. కానీ, జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు.
భార్యల సంపాదనపై బతికి
ఇప్పుడు కోట్లు, లక్షలు సంపాదిస్తున్న స్టార్ సెలబ్రిటీలు కూడా ఒక సమయంలో తమ భార్యలపై సంపాదనపై ఆధారపడి బతికిన పరిస్థితులు ఉన్నాయి. వారిలో దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఉండటం ఆశ్చర్యం కలిస్తున్న విషయం. మరి ఒకప్పుడు తమ భార్యల సంపాదనపై ఆధారపడి బతికిన స్టార్ సెలబ్రిటీలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
ఎస్ఎస్ రాజమౌళి
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్‌గా యమ క్రేజ్ తెచ్చుకున్న డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. హాలీవుడ్ సెన్సేషనల్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో ప్రశంసలు అందుకున్న రాజమౌళి ఒక సమయంలో తన భార్య రమా రాజమౌళి సంపాదనపై ఆధారపడ్డారు. ఈ విషయాన్ని ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్‌లో జక్కన్నే స్వయంగా చెప్పుకొచ్చారు.
తన కెరీర్ మొదట్లో పడిన కష్టాల గురించి చెప్పిన రాజమౌళికి ఒకానొక సమయంలో ఒక్క పైసా సంపాదన లేదని, అప్పుడు తన భార్య రమా జీతంపైనే బతికానని, అందుకు తానేం సిగ్గుపడట్లేదని, సంతోషంగా ఉందని ఆ ఈవెంట్‌లో రాజమౌళి తెలిపారు.
అజయ్ ఘోష్
తెలుగు సినిమాల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అజయ్ ఘోష్. ఇటీవలే మ్యూజిక్ షాప్ పూర్తి సినిమాలో మెయిన్ లీడ్ రోల్ చేసి ఆకట్టుకున్నారు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ బాగా సంపాదిస్తున్న అజయ్ ఘోష్ కూడా తన భార్య సాంబలక్ష్మీ డబ్బుపై ఆధారపడ్డారట.
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో సరైన ఆఫర్లు లేక డబ్బులు లేక అజయ్ ఘోష్ పెయింటింగ్ వేసేందుకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయట. అవి సరిపోకపోవడంతో ఆ సమయంలో తన భార్య ఆర్థికంగా అజయ్ ఘోష్‌కు సహాయం చేశారని సమాచారం.
బాబీ డియోల్
యానిమల్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చిన బాలీవుడ్ సీనియర్ హీరో బాబీ డియోల్. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో బాబీ డియోల్ తన విలనిజంతో ఎంతో మెప్పించాడు. దాంతో ఆయనకు వరుసగా కంగువా, డాకు మహారాజ్, దళపతి 69, హరి హర వీరమల్లు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది.
అయితే, యానిమల్‌కు ముందు ఎలాంటి ఆఫర్స్ లేకుండా బాబీ డియోల్ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో తన భార్య తాన్య డియోల్ సంపాదనపై ఆధారపడ్డారు. అప్పుడు సూసైడ్ కూడా చేసుకోవాలని అనుకున్నారట. కానీ, యానిమల్ సినిమాతో ఒక్కసారిగా తన ఫేట్ మారిపోయిందని, సందీప్ రెడ్డి వంగాకు ఎంతో కృతజ్ఞుడినని ఇప్పటికీ ఎమోషనల్ అవుతూ చెబుతారట బాబీ డియోల్.
అందుకే అంత ఎమోషనల్
అయితే, యానిమల్‌కు ముందు ఎవరికి తన ఫొటోలు పంపినా చూద్దాం అని చెప్పేవారట. కానీ, బాబీ డియోల్‌కు ఒక్క సినిమాలో కూడా అవకాశం ఇవ్వలేదట. తాను ఎప్పుడు ఇంట్లోనే ఉండటం చూసిన బాబీ డియోల్ కుమారుడు ఆర్యమన్ డియోల్ నాన్న ఇక పని చేయరా అని తల్లితో అడిగాడట. అది విన్న కుంగిపోయిన బాబీ డియోల్ ఎలాగైనా ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నారట. అందుకే యానిమల్ మూవీ అన్న, సందీప్ రెడ్డి వంగా అన్న బాబీ డియోల్ అంత ఎమోషనల్ అవుతారని సమాచారం.