Best Web Hosting Provider In India 2024
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టీకరణ
ఆ మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి
క్షతగాత్రులకు కూడా ప్రభుత్వం రూ.25 లక్షలు అందించాలి
మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ డిమాండ్
ప్రధాని సభ పేరుతో విశాఖలో హడావుడి తప్ప ఏం లేదు
భూమిపూజ చేసిన వాటిలో చంద్రబాబు తెచ్చిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా?
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధానితో ప్రకటన చేయించలేదు
స్టీల్ ప్లాంట్ కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి
ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్
విశాఖపట్నం: వైకుంఠ ఏకాదశి రోజు తిరుమల శ్రీవారి దర్శనం టోకెన్ల జారీకి ఏర్పాటు చేసిన క్యూలైన్లలో తీవ్ర తొక్కిసలాట, ఆరుగురి దుర్మరణానికి సీఎం, టీటీడీ ఉన్నతాధికారులు, కలెక్టర్, ఎస్పీదే బాధ్యత అని వైయస్ఆర్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.కోటి చొప్పున, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖలో ప్రధాని పర్యటన పేరుతో కూటమి నాయకులు రోజంతా హడావుడి చేయడం తప్ప, ఒరిగిందేమీ లేదని చెప్పారు. ప్రధానితో శంకుస్థాపన చేయించిన వాటిలో ఒక్క ప్రాజెక్టయినా చంద్రబాబు సాధించినది ఉందా అని ప్రశ్నించారు. చివరకు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంపై ప్రధానితో కనీసం ప్రకటన చేయించలేకపోయారని ఆక్షేపించారు. విశాఖపట్నంలోని వైయస్ఆర్‌సీపీ కార్యాలయంలోపార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ వైఫల్యమే కారణం
వైకుంఠ ద్వార దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు తరలివస్తారని తెలిసి కూడా, టోకెన్ల జారీలో తగిన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైన కారణంగానే ఈ తొక్కిసలాట ఘటన జరిగిందని మాజీ మంతి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. భక్తులు ఏమైపోయినా పర్లేదని భావించారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు జరిగితే వైయస్ జగన్ మీద తోసేయొచ్చన్న ధీమానా? మంచి జరిగితే మన ఖాతాలో, చెడు జరిగితే వైయస్ జగనే కారణం అన్నట్టుగా గత ఏడు నెలలుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.
ఎవరు బాధ్యత తీసుకుంటారు?
రెవెన్యూ, పోలీస్, ఇంటిలిజెన్స్ విభాగాలన్నీ ఏమైపోయాయి. భక్తుల ప్రాణాల విషయంలో ఎందుకింత అలసత్వంగా వ్యవహరించారు. ఈ నిర్లక్ష్యానికి సీఎం, టీటీడీ చైర్మన్, ఈవో, జేఈవో వెంకన్న చౌదరిలలో ఎవరు బాధ్యత తీసుకుంటారని గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. చరిత్రలో ఏనాడూ ఇలాంటి ఘటనలు జరగలేదు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నా వాడుకోలేకపోవడం బాధాకరం. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని స్పష్టంగా చెబుతోందన్నారు. తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని తాను ముందే ఊహించానని, పోలీసు అధికారులను ఆ మేరకు హెచ్చరించానని టీటీడీ ఛైర్మన్ చెప్పడం హేయమన్నారు. దీన్ని బట్టి పేరుకే ఆయన చైర్మన్ అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చైర్మన్ మాటలు సిగ్గుచేటు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలని ఆయన డిమాండు చేశారు.
మృతుల కుటుంబాలకు కోటి పరిహారం చెల్లించాలి:
దుర్ఘటన తర్వాత తన అనుకూల మీడియాలో.. అధికారులపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఛైర్మన్‌పై కోప్పడ్డారు. పరిస్థితిని అనుక్షణం పర్యవేక్షిస్తున్నారు. సంఘటనపై బాధపడ్డారు.. అంటూ ప్రచారం చేసుకుంటున్నారని అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా అలాంటి ప్రచారాలు మాని, తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు కోటి చొప్పున, గాయపడిన వారికి రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.
వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో చాలా జాగ్రత్తలు:
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో భక్తుల నుంచి వచ్చిన విన్నపాలను పరిగణలోకి తీసుకుని పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పించడం జరిగిందని మాజీ మంత్రి తెలిపారు. టోకెన్ల జారీతో పాటు భక్తుల ఏర్పాట్ల విషయంలో పటిష్టమైన ఏర్పాట్లు చేసి ఒక్క చిన్న దుర్ఘటన కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. హిందువుల మనోభావాలను గౌరవించి తిరుమల ప్రతిష్టను పెంచేలా వైయస్ జగన్ వ్యవహరిస్తే, కూటమి ప్రభుత్వం మాత్రం తిరుమల పవిత్రతను మంట గలిపేలా ఆలయ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. లడ్డూ విషయంలో ప్రాయశ్చిత్త దీక్షలు చేసిన సనాతనవాదులు ఇప్పుడేం చేస్తారో చూస్తాం. ఈ ఘటనకు ఏం సమాధానం చెప్తారో ప్రజలు అడుగుతున్నారు. ఎవర్ని బాధ్యుల్ని చేస్తారోనని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు ఒక్కటైనా తెచ్చారా?:
ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన పేరుతో నిన్నంతా విశాఖలో కూటమి నాయకుల హడావుడి తప్ప.. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టుల్లో గడిచిన ఏడు నెలల పాలనలో చంద్రబాబు సాధించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా..? అని గుడివాడ అమర్నాథ్ సూటిగా ప్రశ్నించారు. ప్రధాని శంకుస్థాపన చేసిన గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్టు కోసం ఇదే విశాఖపట్నంలో ఇదే గ్రౌండ్‌లో 2023 మార్చి 3, 4 తేదీల్లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌లో నాటి సీఎం వైయస్ జగన్ సమక్షంలో నేను మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్టీపీసీతో ఒప్పందం చేసుకోవడం జరిగిందని చెప్పారు. మా ప్రభుత్వం 17 రాష్ట్రాలతో పోటీ పడి బల్క్ డ్రగ్ పార్క్ ను సాధించుకొస్తే, ఏపీకి ప్రాజెక్టు వద్దని యనమల రామకృష్ణుడితో టీడీపీ కేంద్రానికి లేఖ రాయించింది. ఇప్పుడదే టీడీపీ వాళ్లు మేమే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇవే కాదు.. కృష్ణపట్నంలో ఇండస్ట్రిల్ పార్కు, విశాఖ రైల్వే జోన్.. అన్ని ప్రాజెక్టులు వైఎస్ జగన్ చొరవతో రాష్ట్రానికి వచ్చినవే. టీడీపీ నాయకులు మాత్రం మేమే తెచ్చామని భజన మొదలుపెట్టారు. పనంతా వైయస్ జగన్‌ది అయితే, పబ్లిసిటీ మాత్రం చంద్రబాబుది అంటూ ఎద్దేవా చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రధానితో ఒక్క ప్రకటన కూడా చేయించలేకపోయారు. అయోమయంలో ఉన్న స్టీల్ ప్లాంట్ కార్మికులు కష్టాల గురించి పట్టించుకోకుండా వస్తుందో రాదో తెలియని స్టీల్ ప్లాంట్ గురించి చెప్పడం మరీ దారుణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు.